Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాప్ కార్ న్యూస్: మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లు; ఎస్‌యూవీలదే పైచేయి
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ విభాగంలోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు కార్ల తయారీదారులు కూడా ప్రత్యేకంగా ఎస్యూవీ విభాగంపై దృష్టి సారించాయి. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కియా సోనెట్, టయోటా అర్బన్ క్రూయిజర్ మోడళ్లు మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల కానున్నాయి. మరోవైపు రెనాల్ట్ తమ డస్టర్‌లో ఓ టర్బో వేరియంట్‌ను విడుదల చేసింది. గడచిన వారంలోని టాప్ కార్ న్యూస్ ఇలా ఉన్నాయి:

రెనాల్ట్ డస్టర్ టర్బో వేరియంట్ విడుదల
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న డస్టర్ ఎస్‌యూవీలో ఓ కొత్త టర్బో వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త పవర్ఫుల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. కొత్త 2020 రెనాల్ట్ డస్టర్ టర్బో ఐదు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో రెండు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి.

కొత్త డస్టర్‌లోని 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 154 బిహెచ్పి శక్తిని మరియు 1600 ఆర్‌పిఎమ్ వద్ద 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ: డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో 'షాడో ఎడిషన్' విడుదల
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న '3 సిరీస్ గ్రాన్ టురిస్మో' మోడల్లో ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో 'షాడో ఎడిషన్' పేరిట మార్కెట్లో విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.42.50 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 330ఐ ఎమ్ స్పోర్ట్ షాడో ఎడిషన్‌లో స్టాండర్డ్ జిటి వేరియంట్లో ఉన్న పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇందులోని 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 248 బిహెచ్పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 6 సెకన్లలోనే గంటకు 0 - 100 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

టొయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నుంచి కొత్తగా రానున్న కొత్త సబ్-మీటర్ కాంపాక్ట్-ఎస్యూవీ "అర్బన్ క్రూయిజర్" కోసం ఆగస్ట్ 22, 2020 బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఇది మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారును విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు.

ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా బిఎస్6లో ఉపయోగిస్తున్న పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించనున్నారు. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 104 బిహెచ్పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం, మొదటి రోజే భారీ రికార్డ్
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. కస్టమర్లు రూ.25,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఈ కాంపాక్ట్-ఎస్యూవీ కోసం ఆగస్టు 20న బుకింగ్స్ ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభమైన ఒక్క రోజులోనే కియా సోనెట్‌ను భారత మార్కెట్లో 6,523 మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు. కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ వచ్చే నెల ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

2020 మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను వెల్లడించే వీడియో
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా తమ పాపులర్ థార్ ఎస్‌యూవీలో కొత్త తరం మోడల్‌ను ఆగస్ట్ 15న మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీని ఈ ఏడాది అక్టోబర్ 2న మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త 2020 మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ సామర్ధ్యాని తెలియజేస్తూ కంపెనీ ఓ వీడియోను విడుదల చేసింది.

కొత్త 2020 మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు కంపెనీ ఈ ఎస్‌యూవీలో బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్స్, మోడరన్ రోల్ఓవర్ రెడ్యూస్, హిల్ హోల్డ్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ: కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

ఈ వారం టాప్ కార్ న్యూస్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారత కార్ మార్కెట్లో కస్టమర్లు సెడాన్ల కంటే ఎస్‌యూవీలనే ఎక్కువగా ఇష్టపడతున్నారు. దీని ఫలితంగా, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి వాహన తయారీదారులు కొత్త మోడళ్లు, స్పెషల్ ఎడిషన్లు లేదా స్టాండర్డ్ మోడల్స్‌లో మరింత శక్తివంతమైన వేరియంట్లను విడుదల చేస్తున్నారు.