గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

ఆటో పరిశ్రమకు ఈ వారం చాలా మంచిదిగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని మోడల్స్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో భాగగంగానే కొత్త మహీంద్రా థార్ కూడా ఇటీవల లాంచ్ చేయబడింది. దానితో పాటు అనేక కొత్త మోడల్స్ టెస్ట్ లు జరిగాయి. దీనికి సంబంధించి గత వారం టాప్ కార్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం.

గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

5. ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ :

ఇటీవల వడోదరాలో ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క టెస్ట్ మ్యూల్ గుర్తించబడింది, ఇదో కొన్ని కాస్మొటిక్ మార్పులు చేయబడ్డాయి. ఈ టెస్ట్ మ్యూల్‌లో కొత్త గ్రిల్ ఉపయోగించబడింది. ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంకా చాలా మార్పులు చూడవచ్చు. ఇది మునుపటికంటే చాలా మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

4. టయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ :

ఇటీవల టయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ యొక్క 3 డి మోడల్ వెల్లడైంది మరియు దీనికి టయోటా ఫార్చ్యూనర్ మాదిరిగానే అప్‌డేట్ ఇవ్వబడి ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు. టొయోటా ఫార్చ్యూనర్ ఇన్నోవా క్రిస్టాతో తన ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది.

MOST READ:కొత్తగా కనిపిస్తున్న మూడు కార్లు కలయికతో తయారయిన కొత్త కారు

గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

3. రెనాల్ట్ క్విడ్ నియోటెక్ లాంచ్ :

రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రెనాల్ట్ క్విడ్ నియోటెక్ ఎడిషన్‌ను రూ. 4.29 లక్షల ధరతో ప్రవేశపెట్టారు. ఇది క్విడ్ యొక్క టాప్ వేరియంట్లలో 0.8 లీటర్ మాన్యువల్ మరియు 1.0 లీటర్ మాన్యువల్ మరియు AMT ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

2. మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎలక్ట్రిక్ లాంచ్ :

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి 400 ను భారత్‌లో విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ సమాచారం ప్రకారం, కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2020 అక్టోబర్ 8 న భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.

MOST READ:మీరు ఎప్పుడైనా అతి చిన్న త్రీ-వీల్ మారుతి సుజుకి 800 కారు చూసారా ?

గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

1. 2020 మహీంద్రా థార్ లాంచ్ :

2020 మహీంద్రా థార్ భారతదేశంలో ప్రారంభించబడింది. దీని ధర రూ. 9.80 లక్షలు. మహీంద్రా థార్ రెండు ట్రిమ్ ఎఎక్స్ మరియు ఎల్ఎక్స్ వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. 2020 మహీంద్రా థార్ చాలా ఫీచర్లు, మెరుగైన డిజైన్ మరియు అనేక కొత్త పరికరాలతో పరిచయం చేయబడింది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !

2020 మహీంద్రా థార్ టాప్ వేరియంట్ ధర రూ .12 .95 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని బుకింగ్‌ను దేశంలోని డీలర్‌షిప్‌లు మరియు ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రారంభించారు. థార్ యొక్క మొదటి యూనిట్ వేలంలో గెలిచిన వ్యక్తికి అందించారు. సాధారణ వినియోగదారులకు డెలివరీ నవంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.

ఇప్పుడు పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో సహా అనేక కొత్త మోడళ్లను భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సీజన్లో వాహనాలు కూడా ఎక్కువ అమ్ముడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

Most Read Articles

English summary
Top Car News Of The Week. Read in Telugu.
Story first published: Monday, October 5, 2020, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X