టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

గడచిన వారంలోని టాప్ ఆటో న్యూస్‌ని గమనిస్తే, రెండు కొత్త మోడళ్లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. భారత్‌లో బిఎస్6 అప్‌డేట్ తర్వాత చాలా మంది తయారీదారులు తమ డీజిల్ ఇంజన్‌లను దూరంగా ఉంచేందుకు చూస్తుండగా, హ్యుందాయ్ కూడా తమ డీజిల్ ఇంజన్లతో ఆల్-అవుట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

ఆటో తయారీదారులు వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల చేయబోయే కొన్ని కొత్త మోడళ్లను కూడా ప్రకటించారు. గత వారంలో ఫోర్-వీలర్ ఆటో పరిశ్రమలో జరిగిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల

మారుతి సుజుకి అందిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ కారు ఎస్-ప్రెసోలో కంపెనీ సిఎన్‌జి మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మారుతి ప్రకటించిన మిషన్ గ్రీన్ ప్రణాళికలో భాగంగా, కంపెనీ తమ సిఎన్‌జి లైనప్‌లో ఈ కొత్త మోడల్‌ను చేర్చింది. మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ప్రారంభ ధర రూ .4.84 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

MOST READ: భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

టాల్ బాయ్ డిజైన్ కలిగిన ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం నాలుగు వేరియంట్‌లలో (LXi, LXi (O), VXi మరియు VXi (O)) లభిస్తుంది. సిఎన్‌జి మోడల్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .5.13 లక్షలు ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్‌లో అదే 998 సిసి త్రీ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా బిఎస్6 డీజిల్ విడుదల

హ్యుందాయ్ తమ కొత్త ఎలాంట్రా బిఎస్6 డీజిల్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. హ్యుందాయ్ తమ డీజిల్ వెర్షన్ వెర్నాను రెండు వేరియంట్లలో మాత్రమే అందిస్తోంది: (SX, SX (O)). బేస్-ట్రిమ్ ధర రూ.180 లక్షలు కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.20.65 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి.

MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన కెటిఎమ్

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా బిఎస్6 డీజిల్ వెర్షన్‌లో అదే 1.5-లీటర్ సిఆర్‌డి ఇంజన్‌ను అప్‌డేటెడ్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 114bhp మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

2020 హోండా సిటీ బుకింగ్స్ ప్రారంభం

హోండా తమ ఐదవ తరం సిటీ సెడాన్ భారత మార్కెట్లో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కొత్త 2020 హోండా సిటీని డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు లేదా ఆసక్తిగల కస్టమర్లు బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

కొత్త హోండా సిటీ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది, అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇది మార్కెట్లో విడుదల కానుంది. ఈ మోడల్‌ను ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేయటం జరిగింది. - మరిన్ని వివరాలు / పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

మూడు వేరియంట్లలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ ఈ నెలలో తమ సరికొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం కంపెనీ మూడు వేరియంట్లలో హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ: మరింత పొడుగు పెరగనున్న హెవీ వెహికల్స్, ఎందుకంటే ?

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

త్వరలో విడుదల కానున్న ఈ ఎస్‌యూవీని రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్లలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీలా ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. అయితే, ఇంజన్ మరియు ట్రాన్సిమిషన్స్ విషయంలో మాత్రం ఇది హెక్టర్ మాదిరిగానే ఉంటుందని సమాచారం. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్‌లో లభ్యమవుతున్న టొయోటా యారిస్

టొయోటా అందిస్తున్న యారిస్ సెడాన్ ఇప్పుడు ప్రభుత్వ ఇ-మార్కెట్ (జిఇమ్) ప్లేస్ జాబితాలో చేర్చబడినది. ఈ బి-సెగ్మెంట్ సెడాన్ ప్రారంభ ధర రూ.9.12 లక్షలకు (షిప్పింగ్ ఛార్జీలకు ముందు) కంపెనీ లిస్ట్ చేసింది.

MOST READ: లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

ఈ సెడాన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 'జె' ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. 2016 లో ప్రారంభించిన జిఇమ్, ప్రభుత్వ సంస్థలు, విభాగాలు మరియు (పిఎస్‌యు) ప్రభుత్వ రంగ యూనిట్ల ద్వారా వస్తువులు మరియు సేవల ఆన్‌లైన్ సేకరణ కోసం అంకితమైన ఇ-మార్కెట్ ప్లేస్.

టాప్ కార్ న్యూస్ ఆఫ్ ది వీక్: మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి, హ్యుందా ఎలాంట్రా, హోండా సిటీ

గత వారం టాప్ ఆటో న్యూస్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అనేక ఆటోమొబైల్ తయారీదారులు డీజిల్ ఇంజన్ స్థానంలో పెట్రోల్ ఇంజన్లను ఆఫర్ చేయటం ప్రారంభిస్తున్నారు. మరికొన్ని కంపెనీలు మాత్రం బిఎస్6 అప్‌డేట్ తర్వాత డీజిల్ ఇంజన్‌ల విభాగంలో మంచి డిమాండ్‌ను దక్కించుకుంటున్నారు. రానున్న నెలల్లో ఆటోమొబైల్ మార్కెట్లో మరింత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
A couple of new models have gone on sales in the Indian market. While most manufacturers are shying away from the diesel engines after the BS6 update, Hyundai seems to be going all-out with their diesel engines. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X