2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఆటో రంగంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు రావడానికి భారతదేశం ఇంకా కొంత సమయం వేచి చూడాలి. కాని కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రావడం వల్ల భారతదేశంలో విద్యుదీకరణ విప్లవం ప్రారంభమైంది. ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల కానున్న టాప్ ఎలక్ట్రిక్ వాహనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడంతో బాగా కృషి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహన శకంలో నూతన ఉత్సాహాన్ని చూపిస్తుంది. దీని ఫలితంగా 2020 లో వివిధ బ్రాండ్ల నుంచి వస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి మనదేశంలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తేనే ఎలక్ట్రిక్ వాహనరంగంలో మరింత ముందుకు వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ సంవత్సరం భారతదేశంలో లాంచ్ చేయబోయే టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాలను చూద్దాం.

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

మహీంద్రా ఎలక్ట్రిక్ కెయువి 100:

ఇండియాలో ప్రసిద్ధి చెందిన సంస్థల్లో మహీంద్రా ఒకటి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎండి & సిఇఒ డాక్టర్ పవన్ గోయెంకా, మహీంద్రా ఎలక్ట్రిక్ కెయువి 100 ను ఈ ఏడాది భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కెయువి 100 కి సంబంధించిన కొన్ని వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కెయువి 15.9 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది సుమారు 120 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఈ ఎలెక్ట్రిక్ కారుని 2020 లో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబోతున్నారు.

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్:

టాటా మోటార్స్ 2020 జనవరిలో నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు ఇప్పటికే ప్రదర్శించబడింది. దీని స్పెసిఫికేషన్ కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి. టాటా నెక్సాన్ శాశ్వత మాగ్నెట్ ఎసి మోటారును ఉపయోగిస్తుంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మోజే ఛార్జ్ తో దాదాపుగా 300 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. నెక్సాన్ లోని కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 245 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని విడుదల చేస్తుంది.

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఇందులో ఉన్న ఫాస్ట్ ఛార్జెర్ ని ఉపయోగించి బ్యాటరీని 60 నిముషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇదే పని హోమ్ ఛార్జర్ ని ఉపయోగించి చేయడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. వాస్తవానికి ఫాస్ట్ ఛార్జింగ్ నిమిషానికి 4 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది మరియు ఇందులో 50 శాతం ఛార్జ్ ఉంటే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి -XM, XZ + మరియు XZ + Lux లు.

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్:

ఎంజి హెక్టర్ తర్వాత, ఎంజి నుంచి విడుదలైన మరో బ్రాండ్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది జనవరి 2020 లో ప్రారంభించబడుతుంది. ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మూడు దశల శాశ్వత సింక్రోనస్ ఎలక్ట్రిక్ మాగ్నెట్ మోటారు ఉంటుంది. ఇది 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 140.7 బిహెచ్‌పికి సమానమైన శక్తిని కలిగిస్తుంది మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 353 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 1 మీటర్ లోతు వరకు ధూళి మరియు నీటిని నిరోధించడానికి కావలసిన సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది దాదాపు 340 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది వినియోదాదారుని అనుగుణంగా ఉండే ఫీచర్స్ ని కలిగి ఉంటుంది.

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఆడి ఇ-ట్రోన్‌:

ఆడి ఇ-ట్రోన్‌ను మొదటిసారిగా 2018 సెప్టెంబర్‌ యుఎస్‌ఎలో జరిగిన ఆడి వార్షిక సమ్మిట్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు ఈ సంవత్సరం భారతదేశంలో జరగబోయే ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడుతుంది. ఇది ఆడి నుండి వచ్చిన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ కార్. ఈ-ట్రోన్ ధర దాదాపు 1.5 కోట్లు ఉండే అవకాశం ఉంది.

Read More:ఇండియాలో పెరిగిన కియా సెల్టోస్ ధరలు...పెరిగిన ధరల జాబితా ఇప్పుడే చూడండి!

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఆడి ఇ-ట్రోన్ ఎస్‌యూవీలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటి ముందు భాగంలో ఉన్నది 125 కిలోవాట్లని, వెనుక మోటారు 140 కిలోవాట్లని, మొత్తం 265 కిలోవాట్లు లేదా 355 బిహెచ్‌పిల వద్ద 561ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలెక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్ పై దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో 400 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.

Read More:గుడ్ న్యూస్....ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టనున్న ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్!

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

పోర్స్చే టైకాన్:

పోర్స్చే టైకాన్ అనేది మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ మరియు స్పోర్ట్స్ కార్ కూడా. ఇది సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉండి 600 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది హై వోల్టేజ్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 3.5సెకండ్లలో 0-100 కిమీ వేగంతో వెళ్తుంది.

Read More:టయోటా నుంచి బుకింగ్ కి సిద్దమవుతున్న మరో రెండు కార్లు!

2020 లో ప్రారంభం కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

పోర్స్చే టైకాన్ కేవలం స్పోర్టి మాత్రమే కాదు, ఇది ఆచరణాత్మకమైనదిగా కూడా ఉంటుంది. ఇప్పుడు పోర్స్చే ఇండియాలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దీని ధర సుమారుగా 1 కోటి రూపాయలు పైనే ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా భారతదేశం రాబోయే కాలంలో ఎలక్ట్రానిక్ వాహనరంగంలో పరుగులు తీయబోతోంది అనడంలో సందేహం లేదు.

Most Read Articles

English summary
Top 5 Electric Car Launches In 2020-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X