స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

ఆగస్టు 15 న యావత్ భారతదేశం తన 73 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి భారతీయుడు సగర్వంగా జరుపుకునే ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 'మేడ్-ఇన్-ఇండియా' ప్రసిద్ధ కార్ మోడళ్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ కార్లు దేశంలో చాలా విజయాలు సాధించిన మరియు వివిధ ప్రపంచ మార్కెట్లలో విక్రయించిన కార్లు వీటిలో ఉన్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి అనేక కార్లు తయారు చేయబడ్డాయి. ఇవి దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లలో చాలా విజయాలు సాధించాయి. ప్రపంచమార్కెలో గొప్ప విజయాన్ని సాధించిన 5 కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

1. రేవ ఐ :

భారతీయ మార్కెట్లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్లలో రేవా ఐ ఒకటి. ఇది భారతదేశంలో తయారు చేయబడింది. ఇప్పుడు ఒక్క మన దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు 26 ఇతర ప్రపంచ మార్కెట్లలో విక్రయించబడింది. రేవ ఐ మహీంద్రా స్వాధీనం చేసుకునే ముందు బెంగళూరుకు చెందిన ఒక సంస్థ యొక్క ప్రధాన మోడల్. మహీంద్రా ఇ 2 ఓ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ స్థానంలో ఈ కారు 2011 వరకు భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది.

MOST READ:షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

2. డిసి అవంతి :

డిసి అవంతి చూడటానికి గొప్పగా ఏమి కనిపించదు, అంతే కాకుండా ఇది ప్రజలలో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కాని అవంతి భారతదేశంలో మొట్టమొదటి హోమ్ గ్రౌన్ స్పోర్ట్స్ కారు. ప్రజలకు సరసమైన స్పోర్ట్స్ కారును అందించడానికి ‘డిసి' చేసిన గొప్ప ప్రయత్నం.

ఇది ప్రారంభంలో కొంత ప్రాచుర్యం చెందినప్పటికీ కాలక్రమేణా విఫలమైంది. ఈ కారు 2.0 లీటర్ ఇంజిన్‌తో నడిచింది. ఈ ఇంజిన్ 248 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

3. హిందూస్తాన్ అంబాసిడర్ :

హిందూస్తాన్ అంబాసిడర్ భారత మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి. ప్రారంభంలో ఆక్స్ఫర్డ్ మోరిస్ ఆధారంగా, దేశంలో తయారు చేయబడిన మొట్టమొదటి కార్లలో ‘అంబి' ఒకటి. అంబాసిడర్‌ను మొట్టమొదటిసారిగా 1958 లో ప్రవేశపెట్టారు. హిందూస్తాన్ అంబాసిడర్ ప్రారంభమైనప్పటి నుంచి సాధారణ ప్రజల నుంచి దేశ ప్రధాని దాకా చాలామందికి సేవలు అందించింది.

MOAT READ:కార్ దొంగతనాలను నివారించడానికి కొత్త ఐడియా, ఏంటో తెలుసా !

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

4. టాటా ఇండికా :

ఇండికా హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో ప్యాసింజర్ వెహికల్ విభాగంలో టాటా మోటార్స్ ప్రవేశించినట్లు గుర్తించబడింది. అప్పటి వరకు వాణిజ్య వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసే సంస్థ, మారుతి జెన్ వంటివారికి పోటీగా ఇండికాను తీసుకువచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

టాటా ఇండికా ఒకప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇండికా యొక్క విజయం టాటా మోటార్స్ సెడాన్, ఎస్టేట్ మరియు క్యాబ్‌లతో సహా వివిధ వెర్షన్లను ప్రవేశపెట్టడానికి దారితీసింది. టాటా ఇండికాను రోవర్ తిరిగి బ్యాడ్జ్ చేసి, సిటీరోవర్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించారు.

MOST READ:హ్యుందాయ్ కంపెనీ ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

5. మహీంద్రా స్కార్పియో :

టాటా ఇండికా మాదిరిగానే, మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో ఎస్‌యూవీ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో ఉంది. మహీంద్రా స్కార్పియో పూర్తిగా హోమ్ డెవెలప్డ్ వెహికల్. ఇది దాదాపు 50 సంవత్సరాలుగా ఉనికిలోనే ఉంది.

మహీంద్రా స్కార్పియో మొట్టమొదటిసారిగా 2002 లో అమ్మకానికి వచ్చింది మరియు ఇప్పటి వరకు భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ 2021 లో స్కార్పియో యొక్క కొత్త తరం వాహనాన్ని ప్రవేశపెడుతుందని చెబుతున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

గౌరవప్రదమైన ప్రస్తావనలు

1. టాటా నానో :

ప్రపంచంలోనే చౌకైన కారును పరిచయం చేయాలన్న రతన్ టాటా కల నుంచి బయట పడిన వాహనమే ఈ టాటా నానో కార్. నానో కారులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది భారత మార్కెట్లో రెండు మరియు మూడు చక్రాల వాహనాలకు సరసమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

MOST READ:కవాసాకి జెడ్ 900 బైక్ పై కనిపించిన ఇమ్రాన్ హష్మి

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

ప్రపంచంలోని చౌకైన కారు అనే ట్యాగ్ నానో ప్రారంభ హైప్ పొందటానికి సహాయపడింది. కానీ ఇది క్రమంగా దేశీయ మార్కెట్లో సరైన అమ్మకాలను సాగించలేకపోయింది. టాటా నానో అమ్మకాలను పెంచడానికి అనేక నవీకరణలు జరిగాయి. అయితే కంపెనీ ఇటీవల మోడల్‌ను నిలిపివేసింది.

స్వాతంత్య్ర దినోత్సవం: భారత్‌లో తయారైన టాప్ 5 ఫేమస్ ‘మేడ్-ఇన్-ఇండియా’ కార్లు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

భారతదేశంలో తయారైన మొదటి 5 కార్ల యొక్క జాబితా పైన వివరించడం జరిగింది. ఇవి స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్లలో గొప్ప విజయాన్ని సాధించాయి. మీరు మా జాబితాలో ఉన్న కార్లను అంగీకరిస్తున్నారా..? ఈ జాబితాలో ఇంకా మేము ఏదైనా మిస్ చేశామా..? మీ అభిప్రాయాలను దిగువన కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.

Most Read Articles

Read more on: #independence day
English summary
Independence Day: Here Are The Top-Five Famous ‘Made-In-India’ Cars Till Date. Read in Telugu.
Story first published: Friday, August 14, 2020, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X