కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

ప్రస్తుతం భారత మార్కెట్లో పండుగ సీజన్ నడుస్తోంది. ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్లో పండుగ సీజన్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కస్టమర్లు కొత్త వస్తువులు, వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. తయారీదారులు కూడా ఈ మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ ఉత్పత్తులపై వివిధ రకాల ఆఫర్లను అందిస్తూ, కస్టమర్లను ఆకర్షిస్తుంటారు.

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

మనదేశంలో జరుపుకునే పండుగల సుదీర్ఘ జాబితాలో, దశరా దీపావళి పండుగలు చాలా ప్రత్యేకమైనవి. ఈ పండుగలు ప్రజల్లో కొత్త ఆనందాన్ని తీసుకువస్తాయి. ప్రజలు కొత్త వస్తువుల కొనుగోలుతో తమ ఆనందాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రత్యేకించి ఈ పండుగ సీజన్‌లో కొత్త వాహనం కొనుగోలు చేయటానికి గల టాప్-5 కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

విలువైన సమయం, శుభ పరిణామం

భారతదేశంలో పండుగ కాలం, శుభ సమయంగా (గుడ్ లక్ టైమ్)గా పరిగణించబడుతుంది మరియు ఇది ప్రజలలో సానుకూల భావాలను కలిగిస్తుంది. కొత్త ప్రారంభాలను ప్రారంభించడానికి లేదా పెద్ద కొనుగోళ్లు లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది వారిని ప్రేరేపిస్తుంది.

MOST READ: రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

భారతదేశంలో కొత్త వాహనాల కొనుగోలును ఇప్పటికీ చాలా మంది దుబారాగానే పరిగణిస్తుంటారు. అందుకే చాలా మంది సంభావ్య కస్టమర్లు, ముఖ్యంగా మొదటిసారి కొనుగోలుదారులు చేసే పండుగ సీజన్ కోసం తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వస్తారు. పండుగ సీజన్‌లో వాహనం కొంటే మంచి జరుగుతుందనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం.

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలు

ఇదివరకు చెప్పినట్లుగానే, పండుగ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు వాహన తయారీదారులు తమ ఉత్పత్తులపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలు అందిస్తుంటారు. భారీ తగ్గింపు ధరలో కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సీజన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

MOST READ: డాట్సన్ కార్లపై భారీ ఫెస్టివల్ ఆఫర్స్; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

పండుగ సీజన్లో ప్రత్యేకంగా కార్ల తయారీదారులు తమ కస్టమర్ల కోసం అధిక నగదు తగ్గింపులు, సులభమైన ఫైనాన్స్ ఆప్షన్లు మరియు వివిధ రకాల ఇతర ప్రయోజనాలను అందిస్తారు. ఈ భారీ తగ్గింపులు మరియు ప్రయోజనాలు, కొత్త కారును కొనే కస్టమర్లకు చాలా పొదుపులను జోడిస్తాయి. వాహన కొనుగోలు నిర్ణయం తీసుకునే విషయంలో ఇవి కస్టమర్లను ప్రోత్సహించేలా ఉంటాయి.

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

కొత్త కార్ల విడుదల

ఈ సీజన్‌లో భారీ డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను అందించడమే కాకుండా, కార్ల తయారీదారులు భారత మార్కెట్లో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి పండుగ సీజన్‌ను ఎంచుకుంటారు. పండుగ సీజన్లో లాంచ్ చేసిన కార్లు, ముఖ్యంగా దీపావళి సమయంలో విడుదలయ్యేవి అమ్మకాల పరంగా మంచి పనితీరు కనబరుస్తాయి. ఎందుకంటే, కస్టమర్లు పాత వాటి కంటే సరికొత్త ఉత్పత్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.

MOST READ: హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

ఈ పండుగ సీజన్‌లో, వాహన తయారీ కంపెనీలు అనేక కొత్త మోడళ్లను, స్పెషల్ ఎడిషన్లను మరియు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను ప్రత్యేక ఫీచర్లతో విడుదల చేస్తుంటాయి. భారత్‌లో మరికొద్ది రోజుల్లోనే మారుతి సెలెరియో ఫేస్‌లిఫ్ట్, బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, ల్యాండ్ రోవర్ డిఫెండర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ మొదలైన మోడళ్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

వెయిటింగ్ పీరియడ్

పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కస్టమర్లు అధిక సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేస్తుంటారు కాబట్టి, తయారీదారులు కూడా తమ ఉత్పత్తి కేంద్రాల్లో వాహనాల ఉత్పత్తి సాధారణం కంటే అధిక స్థాయిలో తయారు చేస్తుంటారు. ఫలితంగా, ఆయా మోడళ్ల వెయింటింగ్ పీరియడ్ కూడా సాధారణం కన్నా తక్కువగా ఉంటుంది.

MOST READ: టాటా హారియర్ డార్క్ ఎడిషన్‌లో కొత్త వేరియంట్స్ విడుదల; ధర, వివరాలు

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

మరోవైపు, ఈ ఏడాది మార్చ్ నెల నుండి దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాహనాల అమ్మకాల్లో ఏర్పడిన పెద్ద ఖాళీని భర్తీ చేసుకునేందుకు, ఈ పండుగ సీజన్‌లో తయారీదారులు కూడా రెట్టింపు ఉత్సాహంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో కోల్పోయిన అమ్మకాలను తిరిగి పొందటానికి పండుగ సీజన్ సహాయపడుతుందని కార్ల తయారీదారులు భావిస్తున్నారు.

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

ఎక్సేంజ్ ఆఫర్లు, ఫైనాన్స్ ఆప్షన్లు

కొత్త కార్ల కొనుగోలులో నిర్ణయం విషయంలో కస్టమర్లకు సహకరించేందుకు కార్ల తయారీదారులు వాహన మార్పిడి (ఎక్సేంజ్)పై మంచి డీల్స్ కూడా ఇస్తుంటారు. ఎక్సేంజ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, లాయల్టీ బోనస్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా, ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా వాహనం కొనాలనుకునే వారి కోసం తక్కువ వడ్డీ రేట్లు, ఆకర్షనీయమైన ఈఎమ్ఐ పథకాలు వంటి అనేక సులభమైన యాజమాన్య మరియు ఫైనాన్స్ ఆప్షన్లను కూడా అందిస్తుంటారు.

MOST READ: రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనడానికి గల టాప్-5 కారణాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పండుగ సీజన్‌లో, ముఖ్యంగా దీపావళి సమయంలో కొత్త కారు కొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో కస్టమర్లకు మరియు కార్ బ్రాండ్‌లకు మంచి లాభాలు ఉంటాయి. కస్టమర్లు తక్కువ ధరకే వాహనాన్ని పొందితే, కార్ కంపెనీ అధిక అమ్మకాల కారణంగా ఎక్కువ లాభాలను పొందుతారు.

Most Read Articles

English summary
With the Indian festive season around the corner, it offers an excellent chance for people to make new purchases for themselves and their house, while also embarking on new beginnings as well. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X