భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

భారతదేశంలో ట్రక్కులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇండియాలో ట్రక్కులు ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ట్రక్కులను కొన్ని ప్రాంతాలలో లారీ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ట్రక్కులు శక్తిలోనూ, పరిమాణంలోనూ, ఆకారంలోనూ విభిన్న రకాలుగా ఉంటాయి. ట్రక్కులను డెలివరీ వ్యాన్లు, ట్రెయిలర్లు, టిప్పర్లు వంటి వాటిగా వర్గీకరించారు.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

భారతదేశంలో ట్రక్కుల యొక్క ప్రాముఖ్యత:

ట్రక్కులు సాధారణంగా వస్తువులను తరలించడానికి, ఆహార పదార్థాలను, ఫ్రూట్స్ ని, కూరగాయలను తరలించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువదూరం రవాణా చేయడానికి ఈ ట్రక్కులు సహాయపడతాయి. ఇవి అప్పుడప్పుడు రహదారులలో ప్రయాణించడానికి కూడా ఉపయోగపడతాయి.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

ట్రక్కులు భారత రవాణా వ్యవస్థకి వెన్నెముక వంటివి. ట్రక్కులు ఉత్తమమైన భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇంధన వ్యవస్థ ఇంకా ఏరోడైనమిక్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా తక్కువ దూరాలకు రవాణా చేయడానికి చాల మంది సొంత ట్రక్కులను కలిగి ఉంటారు. ట్రక్కులను ఎంచుకునే విషయంలో సరైన వాటిని ఎంచుకోవడం కూడా చాలా అవసరం. ముందుగా ట్రక్ యొక్క కెపాసిటీ తెలుసుకోవాలి, ట్రక్కులో ఏమి రవాణా చేయాలో నిర్దారించుకోవాలి. ఇంకా ఇంజిన్ వంటి విషయాలలో కూడా కచ్చితమైన వాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఇప్పుడు భారతదేశంలో 10 బెస్ట్ ట్రక్కులను గురించి తెలుసుకుందాం!

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

1. అశోక్ లేలాండ్

సాధారణంగా ట్రక్కులలో రారాజు వంటిది అశోక్ లేలాండ్. ఇది భారతదేశంలో తయారయ్యే అతిపెద్ద వాణిజ్య వాహనాల్లో ఇది ఒకటి. అశోక్ లేలాండ్ సంస్థ తమ కార్య కలాపాలను 1948 లో ప్రారంభించింది. ఈ సంస్థ ఎక్కువగా ట్రక్కులు, బస్సులు, సైనిక మరియు అత్యవసర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలను తయారు చేస్తుంది.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

ప్రపంచవ్యాప్తంగా ట్రక్కుల తయారీలో అశోక్ లేలాండ్ 16 వ స్థానంలో ఉంది. వార్షిక అమ్మకాలను గమనిస్తే దాదాపు 6,000 నుంచి 7,000 వరకు ఉన్నాయి. కంపెనీ వారు ఎక్కువగా 16 నుంచి 25 టన్నుల వాహనాలను తయారు చేయడంపై ద్రుష్టి సారించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 7.5 టన్నుల నుంచి 49 టన్నుల సామర్థ్యం గల ట్రక్కులను తయారు చేసారు.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

2. టాటా మోటార్స్

ఇది ఇండియాలో ఉన్న ఒక ఉత్తమ మల్టి నేషనల్ ఆటోమోటివ్ కంపెనీ. ఇది 1945 లో మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాన కార్యాలయం స్థాపించబడింది. ఈ కంపెనీ వారు ఎక్కువగా ట్రక్కులు ప్రయాణికుల కార్లు, కోచ్‌లు, బస్సులు మరియు సైనిక వాహనాల వంటి వాటిని తయారు చేస్తారు.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

టాటా మోటార్స్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ట్రక్ ఉత్పత్తి దారు. వీరి యొక్క వార్షిక ఆదాయం సుమారు 42 బిలియన్ డాలర్లు. ఈ సంస్థ యొక్క కొన్ని అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. అవి ల్యాండ్ రోవర్, టాటా హిస్పానో, జాగ్వార్ మరియు టిడిసివి లు.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

3. మహీంద్రా & మహీంద్రా

భారతదేశంలో మహీంద్రా & మహీంద్రా ఉత్తమ ఆటోమొబైల్ సంస్థ. ఇది 1947 లో స్థాపించబడింది . దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు మరియు వాహన తయారీదారులు. ఇది మాక్సిమో, బొలెరో మాక్సి, జెనియో వంటి వాటిని తయారు చేస్తుంది.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

4. హిందుస్థాన్ మోటార్స్

హిందుస్థాన్ మోటార్స్ ఇండియాలో ఒక ప్రముఖ ఆటోమోటివ్ తయారీదారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉంది. ఈ కంపెనీ 1948 లో ప్రారంభించింది. ఇది బిర్లా టెక్నికల్ సర్వీసెస్ ఇండస్ట్రియల్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ. ఇది పాసింజెర్స్ కార్లు, ట్రక్కులు, ఇతర తేలిక[పాటి వాహనాలను తయారు చేస్తోంది.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

5. ఐషర్

దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గావ్ లో ఉంది. ఇది 1948 లో స్థాపించబడింది. ఇది మంచి ఇంధన వ్యవస్థను మరియు ఉన్నతమైన పని తీరుని, వేగవంతమైన టర్నరౌండ్ వాహనాలను, అంతే కాకుండా అధిక పేలోడ్ కలిగిన ట్రక్కులను తయారు చేస్తుంది. తక్కువ ధర కలిగిన ఈ వాహనాలు అధిక విశ్వనీయతను కలిగి ఉన్నాయి.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

6. స్వరాజ్ మాజ్డా

స్వరాజ్ మజ్డా ఆటో మొబైల్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం చండీఘర్ లో ఉంది. పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా మరియు సుమిటోమో కార్పొరేషన్ సహకారంతో దీనిని స్థాపించారు. ఈ సంస్థ మీడియం డ్యూటీ ట్రక్కులను తయారు చేస్తుంది.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

7. ఆసియా మోటార్ వర్క్స్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆటో మొబైల్ తయారీ సంస్థలలో ఆసియా మోటార్స్ కూడా ఒకటి. ఇది మైనింగ్ వంటి భారీ వస్తువులను తరలించడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సంస్థ అధిక పనితీరు కల్గిన ట్రాక్టర్ ట్రెయిలర్లు, టిప్పర్లు మరియు ఏఎమ్డబ్ల్యు ట్రక్కులను తయారు చేస్తుంది.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

8. భారత్ బెంజ్

భారతదేశంలో భరత్ బెంజ్ యొక్క ట్రక్కులు దేశవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందాయి. ఇది వినియోగదారులకు చాల అనుకూలంగా ఉండటమే కాకుండా వినియోగ దారుల అవసరాలకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. భారత్‌ బెంజ్ ట్రక్కులు మరియు హెవీ డ్యూటీ ట్రాక్టర్లు మరియు బస్సులను ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో టాప్ 10 బెస్ట్ ట్రక్స్ ఇవే

9. వోల్వో ట్రక్కులు

ఈ సంస్థ 1998 లో స్థాపించబడింది. వోల్వో ట్రక్కులు వాణిజ్య మరియు ప్రాంతీయ ఉపయోగం కోసం ట్రక్కుల వంటి వాణిజ్య వాహనాలను తయారు చేస్తుంది. ఈ సంస్థ నాణ్యమైన సేవలను ఉత్పత్తులను అందిస్తుంది.

Most Read Articles

English summary
Top 10 Best Truck brands in India. Read in Telugu.
Story first published: Wednesday, February 19, 2020, 15:53 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X