బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్, తమ బిడది ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో ఇద్దరు ఉద్యోగులకు కోవిడ్ -19 పాజిటివ్ రావటంతో కంపెనీ తమ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.

బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

టొయోటా ఇది వరకు చేసిన ప్రకటనలో జూన్ 7 మరియు జూన్ 16వ తేదీలలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షించబడ్డారని, ఫలితంగా ఈ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేశామని ప్రకటించింది.

బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

ఈ కేసులు నమోదైనప్పటి నుంచి టొయోటా ప్లాంట్‌ను మూసివేసి, క్రిమిసంహారక మందులను స్ప్రే చేసి పూర్తిగా శానిటైజ్ చేసింది. అంతేకాకుండా, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రతిరోజూ పెద్ద మొత్తంలో యాదృచ్ఛికంగా కొందరికి ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహిస్తూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

MOST READ: నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

టయోటా ఈ ప్లాంట్‌లో పరిస్థితిని పర్యవేక్షించడం కొనసాగిస్తుందని, తమ ఉద్యోగుల ఆరోగ్యం మరియు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ కంపెనీలలో కోవిడ్-19 కేసులు నమోదైన నేపథ్యంలో, ఆ తర్వాత టొయోటా దేశంలో కోవిడ్-19 కేసులు నమోదైన మూడవ అతిపెద్ద ఆటో తయారీదారుగా మారింది.

బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

టొయోటాకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. కంపెనీ అందిస్తున్న బిస్6 వెర్షన్ గ్లాంజా మరియు యారిస్ మోడళ్లపై జూన్ నెలలో డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్స్‌తో పాటుగా ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి ఆఫర్లు ఉన్నాయి. వీటికి అదనంగా, దేశంలోని కోవిడ్ -19 వారియర్లకు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను టొయోటా ఆఫర్ చేస్తోంది.

MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

టొయోటా గ్లాంజాపై గరిష్టంగా రూ .15,000ల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటే, టొయోటా యారిస్ గరిష్టంగా రూ.72,500ల ప్రయోజనాలను అందిస్తున్నారు. జూన్ నెలలో అందించే డిస్కౌంట్ల గురించి మరింత తెలుసుకోవడానికి - ఈ లింకుపై క్లిక్ చేయండి.

బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

టొయోటా బిడది ప్లాంట్‌లో సేవలు పునఃప్రారంభం కావటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిజానికి ఇది శుభవార్త. టొయోటా కిర్లోస్కర్ మోటార్ తన బిడది ప్లాంట్‌ను వైరస్ రహితంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ పరిస్థితిని వారు చాలా వేగంగా పరిష్కరించినందుకు టయోటాకు హ్యాట్సాఫ్.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor announces resumption of services at Bidai facility. The brand had temporarily suspended operations after two employees tested positive for Covid-19. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X