ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) నుండి తాజాగా మార్కెట్లో విడుదలైన సరికొత్త మోడల్ "అర్బన్ క్రూయిజర్" కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలను కంపెనీ డీలర్లు ప్రారంభించారు. కస్టమర్లకు ఈ పండుగ సీజన్‌ను మరింత ఆనందభరితం చేసేందుకు కంపెనీ శరవేగంగా డెలివరీలను పూర్తి చేస్తోంది.

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీకి లభిస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని కూడా పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. కంపెనీ ఇప్పటికే మొదటి బ్యాచ్ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీలను ఫ్యాక్టరీ నుండి డీలర్‌షిప్ కేంద్రాలకు పంపింది. మరోవైపు దీపావళి సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, రెండవ బ్యాచ్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది.

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

భారత మార్కెట్లో టొయోటా అర్బన్ క్రూయిజర్ ధరలు రూ.8.40 లక్షల నుండి రూ.11.30 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ, ఇండియా). గడచిన ఆగస్ట్ నెలలోనే కంపెనీ ఈ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ మోడల్‌ను పూర్తిగా ఆవిష్కరించకముందు నుండే, కస్టమర్లు దీనిపై ఆసక్తి కనబరిచినట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

ప్రస్తుతం టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా వినియోగదారుల నుండి మంచి ప్రోత్సాహకరమైన స్పందన లభిస్తోంది, డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ చేసేందుకు తమ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో ఈ మోడల్ ఉత్పత్తిని చేపట్టామని కంపెనీ తెలిపింది.

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

టొయోటా అర్బన్ క్రూయిజర్ మొత్తం మూడు వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇది మోనో-టోన్ మరియు డ్యూయెల్-టోన్ అనే పెయింట్ స్కీమ్‌లలో లభిస్తోంది. ఈ మోడల్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని కూడా ఆఫర్ చేస్తోంది.

MOST READ:అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త వెహికల్స్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకు రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షనే ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్. ఈ రెండు మోడళ్లలో చాలా వరకు పరికరాలు, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. కాకపోతే, అర్బన్ క్రూయిజర్‌లో చేసిన ప్రధాన మార్పులలో ఎల్‌ఈడి లైటింగ్ ప్యాకేజీ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్ మరియు ఫాగ్ లైట్లను అన్నింటినీ ఎల్ఈడిలతో అందిస్తున్నారు.

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్ కూడా విటారా బ్రెజ్జాలోని ఇంటీరియర్స్ మాదిరిగానే అదే లేఅవుట్‌ను మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ జాబితాలో పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

మారుతి యొక్క ‘స్మార్ట్‌ప్లే స్టూడియో' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టొయోటా తమ 'స్మార్ట్ ప్లేకాస్ట్'గా రీబ్రాండ్ చేసింది. ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్‌తో పాటుగా ఎలక్ట్రోక్రోమిక్ రియర్‌వ్యూ మిర్రర్ మరియు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఉన్నాయి.

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు కోప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ ఆడియో, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

విటారా బ్రెజ్జాలో అమర్చిన ఇంజన్‌నే అర్బన్ క్రూయిజర్‌లోను అమర్చారు. ఇందులో 1.5-లీటర్ కె-సిరీస్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది.

ప్రారంభమైన టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ డెలివరీలు

టొయోటా అర్బన్ క్రూయిజర్ డెలివరీల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో తమ కస్టమర్లకు అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీలను అందించడం ద్వారా వారి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయాలని టొయోటా ప్లాన్ చేస్తోంది. ఇది చూడటానికి విటారా బ్రెజ్జా మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇందులో టొయోటా మార్క్ ప్రీమియం స్టైలింగ్‌ను మరియు ఫీచర్లను మనం గమనించవచ్చు.

Most Read Articles

English summary
Toyota dealers across the India has started delivering new Urban Cruiser compact SUV. The company has already dispatched the first batch of SUVs to its dealers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X