టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) ఈ ఏడాది పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తమ వాహనాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా, జీతానికి పనిచేసే ఉద్యోగులు కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు లభ్యం కానున్నాయి.

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

టొయోటా ప్రకటించిన ఈ ‘స్పెషల్ ఆఫర్లు' సంభావ్య కస్టమర్లకు సులభంగా కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కోసం ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. వీటి ద్వారా కస్టమర్లు తమ డ్రీమ్ టొయోటా కారును సొంతం చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. అదనంగా, ఈ పథకాన్ని ఎంచుకునే ఆసక్తి గల కస్టమర్లు టొయోటా యొక్క ప్రత్యేకమైన 3 నెలల ఈఎమ్ఐ హాలిడే ఆఫర్‌ను కూడా పొందగలరు. అంటే, లోనులో కారు కొన్న వారు మొదటి మూడు నెలల పాటు ఈఎమ్ఐని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

ఇటీవల ప్రకటించిన ప్రభుత్వ నగదు ప్యాకేజీ పథకంలో, ఉద్యోగులు ఎల్‌టిసి / ఎల్‌టిఏకు సమానమైన నగదు రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది లీవ్ ఎన్‌కాష్మెంట్ లేదా ఎల్‌టిఏ / ఎల్‌టిసి ఛార్జీలను కలిగి ఉంటుంది మరియు ఇది ఎల్‌టిసి / ఎల్‌టిఏకు అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకారం పన్ను రహితంగా కూడా ఉంటుంది. అయితే, ఈ పథకాన్ని పొందే వ్యక్తి 12 శాతం మరియు అంతకంటే ఎక్కువ జీఎస్టీని ఆకర్షించే వస్తువులు మరియు సేవలకు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

MOST READ:సాధారణ కార్లు లగ్జరీ కార్లుగా మారాయి..ఎలాగో తెలుసా ?

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

జీతం తీసుకునే కస్టమర్లు ప్రత్యేక ఈ టొయోటా పండుగ ఆఫర్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించిన ‘స్పెషల్ క్యాష్ ప్యాకేజీ'తో కలపుకోవచ్చు. మరోవైపు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు కూడా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా వారు 10,000 రూపాయల వరకూ వడ్డీ లేని అడ్వాన్స్‌ను పొందే అవకాశం ఉంటుంది.

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

ఇది కొనుగోలు ప్రక్రియలో యొక్క ప్రారంభ భారాన్ని తగ్గించడానికి మరియు మొత్తం కారు కొనుగోలును ప్రక్రియను సులభతరం చేయడానికి వారికి సహాయపడుతుంది. టొయోటా ఇటీవలే విడుదల చేసిన సరికొత్త అర్బన్ క్రూయిజర్‌తో సహా పలు ఇతర టొయోటా మోడళ్ల కోసం బుకింగ్ చెల్లింపులు చేయడానికి వినియోగదారులు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. దేశంలో కొనసాగుతున్న మహమ్మారి సమయంలో కస్టమర్లు స్వంత కార్లను కొనుగోలు చేసి, తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా ప్రయాణించవచ్చు.

MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

టొయోటా ఈ ప్రత్యేకమైన ఆఫర్‌తో పాటుగా తమ వినియోగదారులకు వివిధ ఫైనాన్స్ భాగస్వాముల ద్వారా అందుబాటులో ఉన్న అనేక సౌకర్యవంతమైన ఈఎమ్ఈ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది. సౌకర్యవంతమైన ఈఎమ్ఈ ఆప్షన్లను తక్కువ వడ్డీ రేటు మరియు ఏడు సంవత్సరాల పొడిగించిన రుణ పదవీకాలం వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలతో అందిస్తున్నారు.

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

ఈ ప్రత్యేకమైన ఆఫర్ల గురించి టొయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని వ్యాఖ్యానిస్తూ, "పండుగ సీజన్‌లో చాలా మంది వినియోగదారులు కొత్త కారు కొనడం వంటి పెద్ద కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటుంటారుయ. ఈ నేపథ్యంలో, వారి కొనుగోలు నిర్ణయంలో సహకరించేందుకు మరియు వారి వాహన కొనుగోలు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ఈ ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నాము. ఈ ఆఫర్లతో కస్టమర్లు వారి స్వంత టొయోటా కారు కలను నిజం చేసుకోవచ్చని" అన్నారు.

MOST READ:ఆకతాయిల అల్లరి పనులకు గవర్నమెంట్ బస్సు ఆగిపోయింది.. ఎలానో మీరే చూడండి

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

టొయోటాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ మోడల్ ధర రూ. 8.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దేశంలో అత్యంత పోటీతో కూడుకున్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో టొయోటా తమ అర్బన్ క్రూయిజర్‌ను విడుదల చేసింది.

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

ఈ మోడల్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత టొయోటా డీలర్‌షిప్‌లలో కానీ బుక్ చేసుకోవచ్చు. టొయోటా అర్బన్ క్రూయిజర్ మిడ్, హై మరియు ప్రీమియం అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:మీరు ఈ బైక్ గుర్తుపట్టారా.. ఇది అందరికీ ఇష్టమైన బైక్ కూడా

టొయోటా కార్లపై పండుగ ఆఫర్లు; ఉద్యోగస్తులకు స్పెషల్ డిస్కౌంట్స్..

టొయోటా స్పెషల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనల ఆధారంగా వేతనం తీసుకునే ఉద్యోగుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలు చేసే కొత్త వాహనం భారతదేశంలో ఎల్‌టిఏ / ఎల్‌టిసి రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నందున వినియోగదారుడు తమకు కావలసిన వాహనాన్ని కొనుగోలు చేయడంలో ఇది సహాయపడుతుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) has announced special offers for salaried customers to welcome the festive season this year. The company is offering a host of benefits for employees of both government and private organisations. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X