టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

టయోటా ఫార్చ్యూనర్ బీఎస్6 మోడల్ అతి త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది, అయితే విడుదలకు ముందే ఫార్చ్యూనర్‌లోని బీఎస్6 వెర్షన్ ఇంజన్ స్పెసిఫికేషన్లను రిలీజ్ చేసింది. టయోటా పార్చ్యూనర్ బీఎస్6 మోడల్ మీద ఇప్పటికే టయోటా డీలర్లు 5 వేల రూపాయలతో బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

టయోటా విడుదల చేసిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి గాడివాడి ప్రచురించిన కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి. బీఎస్6 టయోటా ఫార్చ్యూనర్‌లో 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.8-లీటర్ డీజల్ ఇంజన్‌లు వస్తున్నాయి.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

ఈ రెండు బీఎస్6 ఇంజన్‌లకు సంభందించిన పవర్ మరియు టార్క్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బీఎస్4 టయోటా ఫార్చ్యూనర్‌లో ఉన్న 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో ఎంచుకోవచ్చు.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

ప్రస్తుతం లభిస్తున్న 2.8-లీటర్ డీజల్ ఇంజన్ 174బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది, దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. డీజల్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

బీఎస్6 వెర్షన్ టయోటా ఫార్చ్యూనర్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎలాంటి కాస్మొటిక్ మార్పులు జరగలేదు. ఫార్చ్యూనర్‌లో అవే మునుపటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు 8-దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు, ఆపిల్ కార్‌ప్లే మరియి ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు వస్తున్నాయి.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

సేఫ్టీ విషయానికి బీఎస్6 టయోటా ఫార్చ్చూనర్ ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, హిల్ అసిస్ట్ కంట్రోల్, విప్లాష్ కాన్సెప్ట్ ఫ్రంట్ సీట్, త్రీ-పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్టులు, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఆటోమేటిక్ స్పీడ్ లాక్ మరియు ఎమర్జెన్సీ అన్-లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

ప్రస్తుతం మార్కెట్లో లభించే టయోటా ఫార్చ్యూనర్ బీఎస్4 ఎస్‌యూవీ ధర రూ. 28.18 లక్షల నుండి రూ. 42.20 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. అయితే, బీఎస్6 వెర్షన్ ధరలు సుమారుగా రూ. 50,000 నుండి రూ. 75,000 వరకూ పెరిగే అవకాశం ఉంది.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

టయోటాకు సంభందించిన వార్తలు చూసుకుంటే టయోటా మారుతి భాగస్వామ్యంతో వచ్చిన గ్లాంజా రీ-బ్యాడ్జ్‌డ్ మోడల్ తర్వాత మారుతి నుండి మరో మోడల్‌ను సేకరించి టయోటా బ్రాండ్ పేరుతో రీ-బ్యాడ్జ్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. టయోటా గ్లాంజ్ సేల్స్ పరంగా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండో మోడల్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

టయోటా ఫార్చ్యూనర్‌లో ముఖ్యమైన అప్‌‌డేట్ వచ్చింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా కిర్లోస్కర్ ఇండియా సంస్థకు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్. అతి త్వరలో బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో బీఎస్6 వెర్షన్ ఫార్చ్యూనర్ విడుదలకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి.

Source:GaadiWaadi

Most Read Articles

English summary
Toyota Fortuner BS6 Petrol And Diesel Engine Specifications Revealed. Read in Telugu.
Story first published: Thursday, January 30, 2020, 19:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X