ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా భారత మార్కెట్ కోసం ఓ కొత్త ప్రీమియం ఎస్‌యూవీని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న స్టాండర్డ్ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కన్నా మరింత శక్తివంతమైన ప్రీమియం ఫార్చ్యూనర్ లెజెండర్‌ను టొయోటా భారత్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన ప్రకారం, టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ కంపెనీ వచ్చే ఏడాది (2021) ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. స్టాండర్డ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీతో పాటుగా కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ మోడల్‌ను మరింత ప్రీమియం వెర్షన్‌గా విక్రయించనున్నారు.

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీలో డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజన్ పరంగా గణనీయమైన మార్పులు ఉండనున్నాయి.

MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌లో డ్యూయల్ ప్రొజెక్టర్ సెటప్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్‌లతో చాలా షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఇందులో బంపర్‌పై డైనమిక్ ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్ స్ట్రిప్స్ కూడా కనిపిస్తాయి.

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

ఇందులోని ఇతర మార్పులలో మందు వైపు సెంటర్‌లో ‘టొయోటా' బ్యాడ్జింగ్‌తో కూడిన కొత్త సన్నటి ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ ఇన్‌టేక్స్, ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా చిన్నగా ఉండే ఫాగ్ ల్యాంప్స్, బంపర్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రింది భాగంలో సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్, కొత్త 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి.

MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

ఇంటీరియర్ ఫీచర్లు గమనిస్తే, టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ అదనపు ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, సీట్లపై ప్రీమియం డ్యూయల్-టోన్ అప్‌హోలెస్ట్రీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేన్-డిపార్చర్ అలెర్ట్, క్రూయిజ్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి మార్పులు ఉన్నాయి.

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌లో ప్రధానంగా చెప్పుకోవల్సింది ఇందులో పవర్‌ఫుల్ ఇంజన్ గురించి. ఈ ప్రీమియం ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

ఎమ్‌జి గ్లోస్టర్‌కి పోటీగా వస్తున్న పవర్‌ఫుల్ 'టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్'

టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో అందుబాటులోకి రానుంది. ఇందులోని అదనపు ఫీచర్ల కారణంగా ఇది స్టాండర్డ్ ఫార్చ్యునర్ కంటే అధిక ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.40 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది భారత మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Toyota Fortuner Legender SUV India Launch Confirmed, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X