2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి పేరుతో భారత మార్కెట్లో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.34.98 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉంది.

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే కొత్త 2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్ అనేక కొత్త ఫీచర్లు, కాస్మోటిక్ మార్పులను కలిగి ఉంటుంది. గడచిన సంవత్సరంలో విడుదలైన టిఆర్‌డి వెర్షన్‌కు భిన్నంగా, ఈ ఏడాది కంపెనీ రెండు ఆటోమేటిక్ వెర్షన్లలో స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను అందిస్తోంది. అవి - టూ-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్-డ్రైవ్.

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టాప్-స్పెక్స్ టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి ఫోర్-వీల్-డ్రైవ్ మోడల్ ధర రూ.36.88 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. టిఆర్‌డి వెర్షన్ టొయోటా ఫార్చ్యూనర్‌ను స్టాండర్డ్ ఫార్చ్యూనర్ టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. అయితే, స్టాండర్డ్ మోడల్ కన్నా టిఆర్‌డి మోడల్‌లో ఎక్కువ అప్‌గ్రేడ్స్ లభిస్తాయి.

ఇందులో ముఖ్యంగా, ముందు మరియు వెనుక వైపు బంపర్లను రీడిజైన్ చేశారు. ఇరువైపులా కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, డ్యూయల్ టోన్ రూఫ్, చార్‌కోల్ బ్లాక్ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు టిఆర్‌డి బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మరింత స్పోర్టీ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, ఈ ఎస్‌యూవీ భద్రతను పెంచే అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో 360-డిగ్రీల పానోరమిక్ వ్యూ మోనిటర్, ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ అండ్ మెరూన్ కలర్ థీమ్‌తో డ్యూయల్-టోన్ స్కీమ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

అంతేకాకుండా, లెథర్ అప్‌హోలెస్ట్రీలో ఫినిష్ చేయబడిన కార్ సీట్లు ఉంటాయి. ఈ సీట్లు మరియు డోర్ ప్యానెళ్లపై ఎరుపు రంగు స్టిచింగ్ ఉంటుంది. ఇంటీరియర్‌లో అకడక్కడా టిఆర్‌డి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది.

ఈ ఫీచర్లకు అదనంగా, కస్టమర్ల ఎంపిక మేరకు ఇందులో అనేక రకాల ఆప్షనల్ యాక్ససరీలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే (హెచ్‌యూడి), ఒక టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్), పడల్ ల్యాంప్స్, వెనుక సీటులో ప్యాసింజర్స్ కోసం వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, డిజిటల్ వీడియో రికార్డర్ మరియు క్యాబిన్ లోపల గాలిని శుద్ధి చేయడంలో సహాయపడే ఎయిర్ అయానైజర్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

MOST READ:ఒక నెలరోజుల తరువాత పట్టుబడ్డ లంబోర్ఘిని సూపర్ కార్ : ఎలాగో తెలుసా !

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్‌లో కేవలం కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో స్టాండర్డ్ ఫార్చ్యునర్‌లో ఉపయోగించే 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 175 బిహెచ్‌పి శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సీక్వెన్షియల్ మరియు పాడిల్ షిఫ్ట్‌తో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టిఆర్‌డి ఫార్చ్యూనర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, టికెఎమ్ సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, "ప్రస్తుతం వినియోగదారులు వాహనాల నుండి ఎక్కువ శక్తి, పనితీరు, భద్రత, ఫీచ్లు మరియు డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకుంటున్నారు. వాహనాల లుక్ అండ్ ఫీల్‌లో తాజాదనాన్ని కాంక్షిస్తున్నారు. కస్టమర్-ఫస్ట్ విధానం మరియు వారి అవసరాలను తీర్చడానికి అంకితమైన అభిరుచికి అనుగుణంగా, మేము సంవత్సరాలుగా కొత్త ఉత్పత్తులు, స్పెషల్ ఎడిషన్లను ప్రవేశపెడుతూ వచ్చాము."

MOST READ:హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"ఇందులో భాగంగానే, తాజాగా టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టాము. అసమానమైన మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో కస్టమర్లు కోరుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వడం ద్వారా వారి డిమాండ్లను తీర్చడానికి మరొక ప్రయత్నంలో భాగంగానే టిఆర్‌డి ఫార్చ్యూనర్‌ను ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందిస్తున్నాము. ప్రస్తుత భయానక పరిస్థితుల్లో మనం పీల్చే గాలి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఇందులో ఎయిర్ అయానైజర్‌ను ఆఫర్ చేస్తున్నామ"ని అన్నారు.

2020 టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి ఎడిషన్లలో స్టాండర్డ్ వెర్షన్ కన్నా అధిక ఫీచర్లు లభిస్తాయి. ఈ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీలో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి, అవి స్టాండర్డ్ వెర్షన్ నుండి వేరుగా ఉండేలా చేస్తాయి.

MOST READ:మరోసారి కరోనా లాక్‌డౌన్ ఉల్లంఘించి రోడ్ షో చేసిన బిజినెస్ మ్యాన్, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Most Read Articles

English summary
Toyota Kirloskar Motors has launched the limited-edition Fortuner TRD in the Indian market. Prices for the special-edition SUV starts at Rs 34.98 lakh, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X