టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా తమ కస్టమర్ల కోసం ఈ లాక్‌డౌన్ సమయంలో సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సౌకర్యవంతమైన ఈఎమ్ఐ ఆప్షన్ మరియు టొయోటా అఫీషియల్ వాట్సాప్ అనే రెండు సులభమైన మరియు సౌకర్యవంతమైన కొత్త ఫీచర్లను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) పరిచయం చేసింది. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వినియోగదారుల సౌకర్యార్థం ఈ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రకటించింది.

టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

ఈ కొత్త సేవలను ప్రారంభించిన సందర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. ఈ కష్ట కాలంలో తమను అర్థం చేసుకుని, మద్దతు తెలిపిన వినియోగదారులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో నెలకొన్ని పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ఇందులో భాగంగానే తమ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేలా కొత్త ప్రణాళికలను సిద్దం చేశామని సోనీ చెప్పారు.

టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

తాము రూపొదించిన కొత్త ప్రణాళికలతో కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల పని మరింత సులభతరం కానుందని, తమ కొత్త ఈఎమ్ఐ పథకాలు మరింత సులువైన మరియు సౌకర్యవంతమైన పేమెంట్ ఆప్షన్లను అందిస్తుందని ఆయన చెప్పారు. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరియు వారితో నేరుగా కాంటాక్ట్ కాకుండా వారి సమస్యలను పరిష్కరించేదుకు కొత్తగా ఓ అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : పాకిస్థాన్‌లో తలెత్తిన కొత్త సమస్య

టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

టొయోటా కొత్తగా ప్రారంభించిన ఈ రెండు ప్రణాళికల్లో మొదటిదైన సరళ ఈఎమ్ఐ ఆప్షన్‌లో భాగంగా కస్టమర్లు తమ కొనుగోలు శక్తిని, నెలసరి వాయిదా మొత్తాన్ని తెలుసుకునే వెసలుబాటు కల్పిస్తుంది. ఇక రెండవదైన టొయోటా అఫీషియల్ వాట్సాప్ ఖాతా సదుపాయంతో కస్టమర్లు తమకు కావల్సిన సమాచారాన్ని తెలుసుకోవటం, సమీప డీలర్లను సంప్రదించడం వంటివి చేయవచ్చు.

టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

టొయోటా వాహనాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోదలచిన కస్టమర్లు లేదా ఫీడ్‌బ్యాక్ ఇవ్వదలచిన కస్టమర్లు 83676 83676 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వటం లేదా 'Hi' అని ఎస్ఎమ్ఎస్ చేయటం ద్వారా టొయోటాను నేరుగా సంప్రదించవచ్చు. ఈ వాట్సాప్ సదుపాయం కొత్త కార్లను కొనుగోలు చేయటం/పాత కార్లను విక్రయించడం, ఎక్సేంజ్ ఆఫర్ల వివరాలను తెలుసుకోవటంతో పాటుగా సర్వీస్ అపాంట్‌మెంట్లను బుక్ చేసుకోవటం, బ్రేక్‌డౌన్ సర్వీస్‌ని రిక్వెస్ట్ చేయటం, సర్వీస్‌కి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయటం మొదలైనవి చేయవచ్చు.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు తరాలుగా ఉపయోగిస్తున్న సైకిల్

టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

ఇక టొయోటాకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే.. టొయోటా ఇండియా ఇటీవలే దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న అన్ని రకాల మోడళ్లను ధరలు భారీగా పెంచింది. ప్రస్తుత కాలుష్య నిబంధనలకు అనుగుణంగా కంపెనీ అందిస్తున్న మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో తమ వాహనాల ధరలను పెంచింది. దీంతో ప్రస్తుతం టొయోటా భారత్‌లో విక్రయిస్తున్న టొయోటా గ్లాంజా, యారిస్ వాహనాల ధరలు భారీగా పెరిగాయి.

టొయోటా కస్టమర్ల కోసం స్పెషల్ సర్వీస్ ఆఫర్లు

టొయోటా అందిస్తున్న ప్రత్యేక సేవలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా ఇండియా కొత్తగా ప్రారంభించిన సేవలతో కస్టమర్లు ఇప్పుడు ఇంటి పట్టునే ఉండి తమకు కావల్సిన సమాచారాన్ని అతి సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో వినియోగదారులు షోరూమ్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమకు కావల్సిన అన్ని వివరాలను ఒక్క మెసేజ్‌తో పొందవచ్చు.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) has announced the introduction of two new service offerings to ensure convenience and ease - Flexible EMI Option and Toyota Official Whatsapp. These two services have been introduced to provide the best customer experience based on changing needs and customer expectations. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more