టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా దేశీయ విపణిలో విక్రయిస్తున్న గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, యారిస్ సెడాన్లపై జూన్ నెలలో భాగంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. లాక్‌డౌన్ తర్వాత కంపెనీ అమ్మకాలను పెంచుకునేందుకు టొయోటా గట్టిగానే ప్రయత్నిస్తోంది. కోవిడ్-19 వారియర్లకు కూడా ప్రత్యేక రాయితీలను ఆఫర్ చేస్తోంది.

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, టొయోటా డీలర్లు గ్లాంజా కారుపై రూ.15,000 వరకూ ప్రయోజనాలను అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో క్యాష్ డిస్కౌంట్లతో పాటుగా మీ పాత కారును ఎక్సేంజ్ చేసుకుంటే కారు విలువకు అదనంగా ఎక్సేంజ్ బోనస్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

ప్రస్తుతం భారత మార్కెట్లో టొయోటా గ్లాంజా ధరలు రూ.7.01 లక్షల నుంచి రూ.8.96 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో రెండు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తాయి. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్‌కి గట్టి పోటీ ఇస్తుంది.

MOST READ: ముంబై పోలీసులకి సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా ?

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

టొయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో ఒకే ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది, అది కూడా పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. మారుతి బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త టొయోటా గ్లాంజా కారులో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

మారుతి బాలెనోలో ఉండే దాదాపు అన్ని ఫీచర్లను ఈ టొయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో కూడా గమనించవచ్చు. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎమ్ఐడి డిస్‌ప్లేతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫాలో-మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ వంటి విశిష్టమైన ఫీచర్లతో వస్తుంది.

MOST READ: ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

ఇక టొయోటా యారిస్‌పై అందిస్తున్న ఆఫర్ల విషయానికి వస్తే.. జూన్ 2020లో ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.72,500 ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 కార్పోరేట్ బోనస్, రూ.20,000 లాయల్టీ బోనస్‌లను అందిస్తున్నారు. కోవిడ్ వారియర్ల కోసం రూ.32,500 ప్రత్యేక తగ్గింపులను కూడా ఆఫర్ చేస్తున్నారు.

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

సాధారణ కస్టమర్లకు కార్పోరేట్ బోనస్ మాత్రమే వర్తిస్తుంది, కోవిడ్-19 ఫ్రంట్‌లైన్ వారియర్లకు కార్పోరేట్ బోనస్‌కి బదులుగా ప్రత్యేక డిస్కౌంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. టొయోటా యారిస్ సెడాన్ ఈ సెగ్మెంట్లో కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది.

MOST READ: స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

టొయోటా యారిస్‌లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ సూపర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ బిఎస్6 వెర్షన్ యారిస్ ధరలు ప్రస్తుతం రూ.8.86 లక్షల నుంచి రూ.14.30 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

టొయోటా యారిస్ మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని అన్ని వేరియంట్లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెర్నా, స్కొడా ర్యాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హోండా సిటీ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ: త్వరలో నిలిపివేయనున్న మహీంద్రా గ్రూప్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎందుకో తెలుసా ?

టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

టొయోటా గ్లాంజా, యారిస్ డిస్కౌంట్‌లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19పై పోరులో సహకరించిన ఫ్రంట్‌లైన్ వారియర్లకు టొయోటా ప్రత్యేకమైన రాయితీలను ఆఫర్ చేస్తుండటం నిజంగా మంచి విషయం. మరోవైపు యారిస్ సెడాన్ విషయంలో కూడా కంపెనీ మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. బెస్ట్ డీల్‌లో యారిస్ కారును కొనాలనుకునే వారికి నిజంగా ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.

Most Read Articles

English summary
Toyota is offering huge discounts and special offers on the Glanza and the Yaris BS6 models in June 2020. The offers from the brand include cash discount, exchange bonuses, extended warranty and exclusive discounts for Covid-19 warriors. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X