టొయోటా అర్బన్ క్రూజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ ఇమేజ్ లీక్!

జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా (టికెఎమ్) భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోందని, ఆ ఎస్‌యూవీకి 'అర్బన్ క్రూయిజర్' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మొదటి చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.

ఆటోకార్ ఇండియా కొత్త టొయోటా కాంపాక్ట్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఫొటోను లీక్ చేసింది. ఇది చూడటానికి టొయోటా వెర్షన్ మారుతి విటారా బ్రెజ్జాలా అనిపిస్తుంది. టొయోటా-మారుతి భాగస్వామ్యంలో భాగంగా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను (మారుతి బాలెనోకి టొయోటాకి వెర్షన్) తయారు చేసినట్లుగానే ఈ కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

టొయోటా అర్బన్ క్రూజర్ ఫస్ట్ ఇమేజ్

అయితే, ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్ మారుతి సుజుకి బ్రెజ్జా కంటే భిన్నంగా కనిపిస్తుంది (ఈ మోడల్‌లో కంపెనీ చాలా విషయాలు అప్‌గ్రేడ్ చేసినట్లు అనిపిస్తుంది). ముందు భాగంలో ట్విన్-స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌లో కట్స్ మరియు క్రీజ్ లైన్స్, బిల్ట్-ఇన్ ఫాక్స్ బుల్ బార్ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్‌ను ఇందులో గమనించవచ్చు.

బాడీ మొత్తం క్రోమ్ ట్రీట్‌మెంట్ కనిపిస్తుంది. కారుకు చేసిన ఈ ట్వీక్స్, బ్రెజ్జా నుండి అర్బన్ క్రూజర్ భిన్నంగా కనిపించడానికి సహకరిస్తాయి. ఇవే కాకుండా, అర్బన్ క్రూయిజర్ ఒకే బాడీ పార్ట్స్‌ను పంచుకునేటప్పుడు దీని ఓవరాల్ లుక్ విటారా బ్రెజ్జా లాగా కనిపిస్తుంది.

ఇంటీరియర్స్‌లో, అర్బన్ క్రూయిజర్ టొయోటా మార్క్ కనిపిస్తుంది. ఇందులో అప్‌హోలెస్ట్రీ మరియు డాష్‌బోర్డ్ డిజైన్‌లు మారే అవకాశం ఉంది. అయితే, ఓవరాల్ ఇంటీరియర్ క్యాబిన్ మాత్రం తిరిగి బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది. అన్ని మారుతి సుజుకి మోడళ్లతో పాటు టయోటా గ్లాంజాలో కనిపించే అదే స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అర్బన్ క్రూజర్‌లో కూడా అమర్చనున్నారు.

టొయోటా అర్బన్ క్రూజర్ ఫస్ట్ ఇమేజ్

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా బిఎస్6లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించనున్నారు. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ ఇమేజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా అర్బన్ క్రూయిజర్ భారత మార్కెట్లో ఈ జపనీస్ బ్రాండ్‌కు మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీగా నిలుస్తుంది. యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, భారతదేశంలో ఎస్‌యూవీల పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు టొయోటా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ మరియు త్వరలో రానున్న కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motors is gearing up to launch its brand new compact-SUV called the Urban Cruiser in the Indian market. According to Autocar India, they have got their hands on the world-exclusive first image of the new upcoming compact SUV, the Urban Cruiser. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X