Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టొయోటా అర్బన్ క్రూయిజర్ ఇంటీరియర్స్ వెల్లడి; ఈ అద్భుతాన్ని మీరు చూసేయండి!
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నుంచి మరికొద్ది రోజుల్లోనే విడుదల కానున్న కొత్త సబ్ 4-మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్"కి సంబంధించి కంపెనీ తాజాగా ఇంటీరియర్ వివరాలను వెల్లడి చేసింది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ కోసం రూ.11,000 అడ్వాన్స్‌తో బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

మారుతి సుజుకి-టొయోటా కిర్లోస్కర్ ఒప్పందంలో భాగంగా, ఈ జాయింట్ వెంచర్ నుంచి వస్తున్న రెండవ ఉత్పత్తి ఈ అర్బన్ క్రూయిజర్. ఈ జాయింట్ వెంచర్ ఇప్పటికే మారుతి బాలెనో ఆధారంగా చేసుకొని తయారు చేసిన టొయోటా గ్లాంజాను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా వస్తున్న అర్బన్ క్రూయిజర్‌ను కూడా మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు.

ఇంటీరియర్ చిత్రాలలో చూపినట్లుగా, మారుతి సుజుకి బ్రెజ్జాకి మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్‌కి మధ్య క్యాబిన్‌లో రెండు ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. అందులో మొదటిది స్టీరింగ్ వీల్‌పై టయోటా లోగో, రెండవది కొత్త డ్యూయెల్-టోన్ డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్.
MOST READ: బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

ఈ రెండు మార్పులు మినహా, మొత్తం క్యాబిన్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మాదిరిగానే ఉంటుంది. ఇందులోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి వాటిని చెప్పుకోవచ్చు.

ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్‌తో పాటుగా ఎలక్ట్రోక్రోమిక్ రియర్‌వ్యూ మిర్రర్ మరియు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సీట్ ఆర్మ్‌రెస్ట్ ఉంటాయి. మారుతి అందిస్తున్న ‘స్మార్ట్‌ప్లే స్టూడియో' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టొయోటా 'స్మార్ట్ ప్లేకాస్ట్'గా రీబ్రాండ్ చేసి విక్రయిస్తోంది. ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది.గా ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటుగా బ్రాండ్ కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.
MOST READ: వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

ఇక టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎక్స్టీరియర్ వివరాలను గమనిస్తే, ముందు వైపు రెండు హారిజాంటల్ గ్రిల్‌తో కూడిన కొత్త బంపర్‌ను చూడొచ్చు. ఈ గ్రిల్ మధ్యలో ‘టొయోటా' లోగో ఉంటుంది. ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్లుగా మారే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌పై ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్, సెంట్రల్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ ఫినిష్‌లో కూడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లో 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి స్టాప్ లైట్‌తో కూడిన రియర్ స్పాయిలర్ ఉన్నాయి. ఇది మొత్తం 9 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో ఆరు సాలిడ్ కలర్ ఆప్షన్స్ మరియు మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్ (టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే) ఉంటాయి.
MOST READ: కవాసకి వల్కాన్ ఎస్ బిఎస్6 క్రూయిజర్ విడుదల; ధర, ఫీచర్లు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా బిఎస్6లో ఉపయోగిస్తున్న పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించనున్నారు. ఇందులో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

ఈ ఇంజన్ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.
MOST READ: ముంబైలో విడుదల కానున్న రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్

టొయోటా అర్బన్ క్రూజర్ ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టొయోటా అర్బన్ క్రూయిజర్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కంపెనీ దీని ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. దీని క్యాబిన్ మొత్తం మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది. మార్కెట్లో ఇది కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.