టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ భారతదేశంలో ప్రారంభించబడింది. దీని ధర రూ. 8.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). టొయోటా కాంపిటీటివ్ సబ్ 4 మీటర్ల విభాగంలో అర్బన్ క్రూయిజర్‌ను విడుదల చేసింది. టయోటా అర్బన్ క్రూయిజర్ బుకింగ్ గత నెలలోనే ప్రారంభమైంది. కొత్తగా లాంచ్ అయిన టయోటా అర్బన్ క్రూయిజర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. టయోటా అర్బన్ క్రూయిజర్ మిడ్, హై మరియు ప్రీమియంతో సహా మొత్తం మూడు వేరియంట్లలో తీసుకురాబడింది, దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ.11.30 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్). దీని డెలివరీ అక్టోబర్ మధ్యలో ప్రారంభం కానుంది.

Variant Price
MID-GRADE MT ₹8,40,000
MID-GRADE AT ₹9,80,000
HIGH-GRADE MT ₹9,15,000
HIGH-GRADE AT ₹10,65,000
PREMIUM-GRADE MT ₹9,80,000
PREMIUM-GRADE AT ₹11,30,000
టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇప్పటికే టయోటా అర్బన్ క్రూయిజర్ బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా రెస్పెక్ట్ ప్యాకెట్ అందుకోబోతున్నారు. అర్బన్ క్రూయిజర్ రూపకల్పనను మనం గమనించినట్లయితే దీని ముందు భాగంలో కంపెనీ యొక్క సిగ్నేచర్ గ్రిల్ ఇవ్వబడింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ ఫంక్షన్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఇండికేటర్స్ మరియు ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, స్ప్లిట్ టైల్లైట్స్ ఉన్నాయి.

MOST READ:విదేశీ దళాలు ఉపయోగిస్తున్న మేడ్ ఇన్ ఇండియా కార్లు, ఇవే

టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

అర్బన్ క్రూయిజర్‌లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్, డ్యూయల్ టోన్ షేడ్, క్రోమ్ రూఫ్ రైల్, బాడీ కలర్ ORVM, ఫ్రంట్ బంపర్‌తో కొత్త స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ లోపలి భాగంలో స్టీరింగ్ వీల్‌పై టయోటా లోగో మరియు కొత్త బ్లాక్ అండ్ బ్రౌన్ డ్యూయల్ కలర్ టోన్ థీమ్ ఉన్నాయి. ఇందులో పెద్ద క్యాబిన్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, క్లైమేట్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎం, కంట్రోల్ బటన్ ఆన్ స్టీరింగ్, స్మార్ట్ ఎంట్రీ విత్ ఇంజిన్ పుష్ స్టార్ట్ / స్టాప్, స్మార్ట్‌ఫోన్ నావిగేషన్ వంటివి ఉంటాయి.

MOST READ:ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ లో సేఫ్టీ ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్‌బెల్ట్ వార్నింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఐఆర్‌విఎం అందించబడతాయి. ఇది ఆరు సింగిల్ టోన్ మరియు మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడుతుంది, ఇది 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 న్యూటన్ మీటర్ టార్క్ను అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. అన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది. తేలికపాటి హైబ్రిడ్ సిస్టంను దాని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా అందిస్తారు.

MOST READ:కేద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 250 కోట్ల విలువైన కొత్త విమానం.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?

టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ 3 సంవత్సరాలు / 1 లక్ష కిలోమీటర్ల వారంటీని కలిగి ఉంది. దాని కలర్ ఎంపికల పరంగా, ఇది ఆరు సింగిల్ టోన్ మరియు మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది దేశీయ మార్కెట్‌లో సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మారుతి బ్రెజ్జా వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Urban Cruiser Launched. Read in Telugu.
Story first published: Wednesday, September 23, 2020, 12:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X