టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్" విడుదల తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్‌ను సెప్టెంబర్ 23వ తేదీన అధికారికంగా దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు టికెఎమ్ తెలిపింది. అర్బన్ క్రూయిజర్ కోసం కంపెనీ ఇప్పటికే ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి - టొయోటా జాయింట్ వెంచర్ నుండి వస్తున్న రెండవ ఉత్పత్తి ఇది. ఈ జాయింట్ వెంచర్ నుంచి ఇప్పటికే మారుతి సుజుకి బాలెనో ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన కొత్త టొయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ను టికెఎమ్ విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఇప్పుడు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని టొయాటా తమ అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీని తయారు చేసింది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

టొయోటా అర్బన్ క్రూయిజర్ కోసం కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించింది. అందరి కన్నా ముందుగా ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.11,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న టొయోటా అధీకృత డీలర్ల ద్వారా కానీ ఈ కారుని బుక్ చేసుకోవచ్చు.

MOST READ:త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లయింగ్ కార్లు ఇవే.. మీరు చూసారా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను చూస్తుంటే దాని మొత్తం డిజైన్ మరియు సిల్హౌట్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, టొయోటా తమ స్టైల్‌లో బ్రెజ్జాను మోడిఫై చేసి, కొత్త ఫినిషింగ్‌లను జోడించింజి. ఇందులో ముందు వైపు రెండు హారిజాంటల్ గ్రిల్‌తో కూడిన కొత్త బంపర్‌ ఉంటుంది, ఈ గ్రిల్ మధ్యలో ‘టొయోటా' లోగో ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

అలాగే, ఇందులో ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్లుగా మారే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌పై ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్‌, సెంట్రల్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ ఫినిష్‌లో కూడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి స్టాప్ లైట్‌తో కూడిన రియర్ స్పాయిలర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇది మారుతి విటారా బ్రెజ్జాలో కనిపించినట్లుగా అదే డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, అర్బన్ క్రూయిజర్‌లోని ఇంటీరియర్స్ మాత్రం కాస్తంత ప్రీమియంగా అనిపిస్తాయి. ఇందులో ప్రీమియం బ్లాక్ / బ్రౌన్ అప్‌హోలెస్ట్రీ ఉంటుంది. సైడ్ డోర్ ప్యానెల్స్‌తో పాటు రూఫ్ మొత్తం సెమీ వైట్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

అర్బన్ క్రూయిజర్‌లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా నుండి గ్రహించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో పాటుగా బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం విటారా బ్రెజ్జాలో ఉపయోగించిన పెట్రోల్ ఇంజన్‌నే కొత్త అర్బన్ క్రూయిజర్‌లోనూ ఉపయోగించారు. ఇందులోని 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

టొయోటా అర్బన్ క్రూయిజర్‌లోని ఇతర ఫీచర్లలో ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఎలక్ట్రోక్రోమిక్ ఐఆర్‌విఎమ్ (సైడ్ మిర్రర్స్), ఆటో ఏసి, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. లీకైన సమాచారం ప్రకారం, టొయోటా అర్బన్ క్రూయిజర్ మొత్త ఆరు సింగిల్-టోన్ మరియు మూడు డ్యూయెల్-టోన్ రంగులలో లభ్యం కావచ్చని తెలుస్తోంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 10 లక్షల లోపు ఉన్న టాప్ 5 కొత్త కార్లు

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే..?

టొయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ డేట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీకి మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకి మధ్య కాస్మెటిక్ మార్పులు తప్ప ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ రెండు మోడళ్లలో అనేక పరికరాలు, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అయినప్పటికీ, విడుదలకు ముందే అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీకి మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది ఈ విభాగంలో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motors (TKM) is all set to introduce their new sub-4-metre compact-SUV, the Urban Cruiser on 23 September in the Indian market. The new Toyota Urban Cruiser, which is essentially a rebadged version of the Maruti Suzuki Vitara Brezza. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X