టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

టయోటా మోటార్స్ వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీని అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టయోటా వెల్‌ఫైర్ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోలు చూద్దాం రండి...

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

జపాన్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా దేశీయంగా టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు టయోటా ఫార్చ్యూనర్ మోడళ్లతో భారతీయుల నమ్మకాన్ని గెలుచుకుంది. అయితే, ఈ రెండు మోడళ్లను తలదన్నే అత్యంత విలాసవంతమైన వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీని విడుదల చేసేందుకు టయోటా సిద్దమైంది.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విజయవంతంగా అమ్ముడవుతున్న టయోటా వెల్‌ఫైర్ నిజానికి గత ఏడాది పండుగ సీజన్‌లో విడుదల కావాల్సి ఉండగా, అప్పట్లో దీని విడుదల వాయిదా పడింది.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

అయితే, టయోటా మోటార్స్ ఎట్టకేలకు వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీని ఈ యేడు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 26న అధికారికంగా దీనిని విడుదల చేస్తున్నట్లు టయోటా ప్రకటించింది.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ అత్యంత విలాసవంతమైనది, ధర కూడా ఫార్చ్యూనర్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ బయటి నుండి చూడటానికి ఇది మినీ-వ్యాన్ తరహాలో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డ్యూయల్ కలర్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లు వంటివి ఇందులో వచ్చాయి.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ ఇంటీరియర్‌లో గమనిస్తే, ఆరు మంది ప్రయాణించేలా ఒక్కొక్కరికి ఒక్కో సీటు చొప్పున విలాసవంతమైన సీటింగ్ సౌలభ్యం కలదు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సీటు వెనుక రియర్ సీట్ ప్యాసింజర్ల కోసం ప్రత్యేకమైన టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అన్నీ సీట్లు కూడా హీటెడ్ మరియు వెంటిలేటెడ్ సౌకర్యంతో వచ్చాయి.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

సాంకేతికంగా టయోటా వెల్‌ఫైర్ ఎంపీవీ కారులో 2.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల హైబ్రిడ్ ఇంజన్ వ్యవస్థ కలదు. సీవీటీ (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 180బిహెచ్‌పి పవర్ మరియు 235ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ నిజానికి సంపన్నుల కారు అని చెప్పుకోవాలి. మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎంపీవీకి సరాసరి పోటీనిస్తుంది. దీని ధర సుమారుగా రూ. 80 లక్షల నుండి రూ. 90 లక్షల మధ్య ఉండవచ్చు.

టయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎంపీవీ విడుదల ఖరారు: డేట్ బుక్ చేసుకోండి!

విదేశీయుల భారత పర్యటనకు వచ్చినపుడు ఎక్కువగా ఇలాంటి మోడళ్లను వినియోగిస్తారు. ఈ మధ్య కాలంలో లగ్జరీ హోటళ్లు కూడా కస్టమర్లను పికప్ చేసుకోవడానికి ఈ లగ్జరీ వెహికల్‌ను ఉపయోగిస్తున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే కొంత మంది ఈ మోడల్‌ను టయోటా షోరూముల్లో బుక్ చేసుకున్నట్లు సమాచారం.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota is all set to launch Vellfire luxury MPV car in India on February, 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X