ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా తన కొత్త ప్రీమియం ఎమ్‌పివిని భారత మార్కెట్లో "టయోటా వెల్‌ఫైర్" గా విడుదల చేసింది. టయోటా యొక్క ఈ కొత్త బ్రాండ్ ధర ఇండియన్ మార్కెట్లో దాదాపు రూ. 79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

కొత్త టయోటా వెల్‌ఫైర్ ప్రీమియం అప్డేట్ లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఎమ్‌పివి రెండు ఎలక్ట్రిక్ మోటారులతో జత చేసిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 4,700 ఆర్‌పిఎమ్ వద్ద 115 బిహెచ్‌పి మరియు 2,800 మరియు 4,000 ఆర్‌పిఎమ్ మధ్య 198 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

వెల్‌ఫైర్ ఫ్రంట్ ఆక్సిల్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ మోటారు 4,800 ఆర్‌పిఎమ్ వద్ద 115 కిలోవాట్ల శక్తిని బయటకు తీస్తుంది, అదేవిధంగా వెనుక వైపున ఉన్న మోటారు 50 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా వెల్‌ఫైర్ 16.35 కి.మీ / లీ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని టయోటా పేర్కొంది.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్ ఎమ్‌పివిని యొక్క కొలతలను గమనించినట్లయితే 4935 మిమీ పొడవు, 1850 మిమీ వెడల్పు మరియు 1895 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. వెల్‌ఫైర్ ఎమ్‌పివి యొక్క వీల్‌బేస్ 3000 మిమీ కలిగి ఉండటంతో పాటు, ఈ కారు బరువు గరిష్టంగా 2815 కిలోలు కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్ ఎంపివిలో గ్రిల్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్ మరియు బంపర్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్లలో ఫాగ్ ల్యంప్స్ తో కూడిన ట్రైయాంగిల్ క్రోమ్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ అయితే విండో లైన్, డోర్ హ్యాండిల్స్ మరియు రూఫ్‌లైన్‌లోని క్రోమ్ ఎలిమెంట్స్‌ ని కలిగి ఉంటుంది. 17-అంగుళాల హైపర్ క్రోమ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్‌ను ఒకే ‘ఎగ్జిక్యూటివ్ లాంజ్' వేరియంట్‌లో అందిస్తున్నారు. ఇది మూడు వరుసల సీట్ల కోసం ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది. ఈ సీట్లు ఫ్లాక్సెన్ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ తో పూర్తి అవుతుంది.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

ముందు మరియు మధ్య వరుస సీట్లు హీటెడ్ మరియు శీతలీకరణ పంక్చువాలిటీని కలిగి ఉంటాయి. సెంట్రల్ సీట్లు రెట్రో-ఫిట్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ సీట్లు ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్టబుల్ మరియు మెమరీ ఫంక్షన్‌తో పాటు ఫోల్డింగ్ ట్రేలను కూడా కలిగి ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్ ఎమ్‌పివిలో ట్విన్-సన్‌రూఫ్‌లు, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ కంట్రోల్డ్ స్లైడింగ్ రియర్ డోర్స్, 13 అంగుళాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మౌంటెడ్ అమర్చబడి ఉంటాయి. వీటిని ఎలక్ట్రానిక్‌గా తెరిచి మూసివేసే సదుపాయం కూడా కలిగి ఉంటుంది. అదే సమయంలో హెచ్‌డిఎంఐ మరియు వై- ఫై కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్-పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, హీటెడ్ ఓఆర్‌విఎంలు మరియు 16 కలర్ ఛాయిస్ రూఫ్ యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

వెల్‌ఫైర్ ఎమ్‌పివిలోని సెంట్రల్ కన్సోల్‌లో 10 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 17-స్పీకర్ జెబిఎల్ ఆడియో సిస్టమ్‌తో కూడా వస్తుంది.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్ లో భద్రతా లక్షణాలను గమనిస్తే ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ మరియు టయోటా యొక్క వెహికల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

టయోటా వెల్‌ఫైర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 180 యూనిట్లు బుక్ చేయబడినట్లు కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా అంతర్జాతీయంగా 6 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ నాలుగు కలర్ అప్సన్లతో లభిస్తుంది. అవి బర్నింగ్ బ్లాక్, వైట్ పెర్ల్, గ్రాఫైట్ మరియు బ్లాక్.

ఇండియన్ మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్ రేటెంతో తెలుసా.. !

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా వెల్‌ఫైర్ అనేది భారతీయ మార్కెట్లో జపనీస్ బ్రాండ్ ఎమ్‌పివి. కొత్త వెల్‌ఫైర్ ప్రీమియం ఎమ్‌పివి ఇప్పుడు భారత మార్కెట్లో ఈ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. వెల్‌ఫైర్ ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌కు ప్రత్యర్థిగా ఉంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Vellfire Premium MPV Launched In India: Prices Start At Rs 79.50 Lakh. Read in Telugu.
Story first published: Wednesday, February 26, 2020, 16:58 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X