కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

టయోటా తన కాంపాక్ట్ ఎస్‌యువి అయిన యారిస్ క్రాస్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. టయోటాలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కార్లలో యారిస్ క్రాస్ ఒకటి. ఈ టయోటా యారీస్ క్రాస్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

టయోటా యారిస్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యువి 2020 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా 2020 జెనీవా మోటార్ షో రద్దు చేయబడింది. అందుకే ఈ కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రత్యేకంగా ఆవిష్కరించారు. యారిస్ క్రాస్ యూరోపియన్ మార్కెట్లో లభించే యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడింది. కొత్త కాంపాక్ట్ ఎస్‌యువి సంస్థ టిఎన్‌జిఎ-బి ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది.

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

టయోటా యొక్క కొత్త యారిస్ క్రాస్ పొడవు 4,180 మిమీ, వెడల్పు 1765 మిమీ, ఎత్తు 1560 మిమీ మరియు వీల్ బేస్ 2560 మిమీ. కొత్త యారిస్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సి-హెచ్ఆర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కంటే ఇది తక్కువ స్థానంలో ఉంది.

MOST READ:లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుత టయోటా ఎస్‌యువి కంటే భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది. టయోటా క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యువి ముందు భాగంలో టైర్ గ్రిల్ ఉంది. కొత్త ఎస్‌యువిలో డీఆర్‌ఎల్‌లతో హెడ్‌ల్యాంప్, బంపర్ దిగువన ఫాగ్ లాంప్స్ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యువి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

ఈ కాంపాక్ట్ ఎస్‌యువిలో సొగసైన టైల్ లాంప్ ఉంది. టయోటా యారిస్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యువిలో ఆకర్షణీయమైన ఇంటీరియర్, యాంబియంట్ లైటింగ్, పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

MOST READ: బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో బుకింగ్స్ ఇప్పుడు కేవలం రూ. 5000 మాత్రమే

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

ఈ ఎస్‌యువి లోపలి భాగంలో మంచి స్థలం ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యువిలో హాయిగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. హైబ్రిడ్ ఇంజిన్ యారిస్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పొందుపరచబడింది.

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

ఈ కాంపాక్ట్ ఎస్‌యువిలోని 1.5 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఈ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పొందుపరచబడింది.

MOST READ:సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?

కొత్త డిజైన్‌తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్‌యువి

యారిస్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యువి యొక్క డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉండటం చేత ఇది వినియోగదారులను ఎక్కువగా ఆకర్షింస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యువిని భారతీయ మార్కెట్లో విడుదల చేయలేదు. యారిస్ క్రాస్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేస్తే, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా 300 మరియు టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Yaris Cross Hybrid SUV Unveiled. Read in Telugu.
Story first published: Saturday, April 25, 2020, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X