లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

జపాన్ వాహన తయారీ సంస్థ అయిన టయోటా తన కొత్త యారిస్ ఫేస్‌లిఫ్ట్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పుడే విడుదల చేసిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ కారు పేటెంట్ చిత్రాలు బయటపడ్డాయి. ఈ కొత్త టయోటా యారీస్ కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

కొత్త యారిస్ ఫేస్ లిఫ్ట్ కారు యొక్క పేటెంట్ ఇమేజ్ నుండి దాని డిజైన్ డీటైల్స్ తెలుస్తాయి. పేటెంట్ పొందిన ఈ చిత్రంలో సరికొత్త కొరోల్లా మాదిరిగానే కొత్త యారిస్ ఫేస్‌లిఫ్ట్ పియర్ హెడ్‌లైట్‌లు కలిగి ఉంటుంది. ఈ కారులో ఫ్రంట్ బంపర్ కూడా డిజైన్ చేయబడుతోంది. ఈ కారు యొక్క స్టైలింగ్ ప్యాకేజీ కూడా కొంత భిన్నంగా ఉంటుంది.

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

ఈ కొత్త కారు వెనుక భాగం నవీకరించబడింది. హాచ్-గేట్, బ్యాక్ విండ్‌షీల్డ్ మరియు వెనుక వైపున ఉన్న టెయిల్ లాంప్ క్లస్టర్ ప్రస్తుత మోడల్‌ను పోలి ఉంటాయి. వెనుక బంపర్ కొద్దిగా నవీకరించబడింది. కానీ అధికారిక చిత్రాలు చూసిన తర్వాతే మీకు ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా తెలుస్తుంది.

MOST READ:వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ & రెన్యువల్ పొందాలంటే ఇప్పుడు చాలా సింపుల్

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

ఈ కారు యొక్క ప్రొఫైల్ సి-పిల్లర్ పై తేలియాడే పైకప్పును కలిగి ఉంది మరియు పేటెంట్ చిత్రాలలో ఈ కారు యొక్క అల్లాయ్ వీల్ డిజైన్ సాదాగా ఉంటుంది. కానీ ఉత్పత్తి నమూనాలో ఇది మారుతుందని మేము ఆశిస్తున్నాము.

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

ఈ కొత్త కారు ఇంటీరియర్ గురించి ఫొటోలో ఇంకా వెల్లడించలేదు. ఇది ప్రధాన మిడ్-లైఫ్ నవీకరణ కాబట్టి, ఇది ఇతర టయోటా మరియు లెక్సస్ మోడళ్ల యొక్క కొన్ని ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకిఉండా ఇది చూడటానికి కొత్త డిజైన్ ని కలిగి ఉంటుంది.

MOST READ:పోలీసులకు స్వీట్లు పంచిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఎందుకో తెలుసా ?

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

ఈ కొత్త యారిస్ ఫేస్ లిఫ్ట్ కారు యొక్క పేటెంట్ చిత్రం తప్ప ఇతర వివరాలు కంపెనీ వెల్లడించలేదు. ఈ కొత్త యారిస్ ఫేస్ లిఫ్ట్ కారు యొక్క ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

టయోటా ఇటీవలే తన కాంపాక్ట్ ఎస్‌యూవీని యారిస్ క్రాస్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. యారిస్ క్రాస్ యూరోపియన్ మార్కెట్లో లభించే యారిస్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడింది. కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సంస్థ టిఎన్‌జిఎ-బి ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించింది.

MOST READ:డీలర్స్ వద్దకు రానున్న కొత్త బిఎస్ VI మహీంద్రా ఎక్స్‌యూవీ 500

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని 1.5 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఈ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పొందుపరచబడింది.

లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

కొత్త యారిస్ ఫేస్ లిఫ్ట్ ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ కొత్త కారు భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ కొత్త టయోటా యారీస్ భారత మార్కెట్లో లాంచ్ అయిన తరువాత హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

Image Courtesy: motor1

MOST READ:ఇలా చేస్తే కరోనా వైరస్ చావడం కాయం, ఎలానో తెలుసా !

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Yaris facelift leaked in patent images. Read In Telugu.
Story first published: Saturday, May 23, 2020, 18:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X