టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా అందిస్తున్న యారిస్ సెడాన్‌లో కంపెనీ ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ ఇమేజ్‌లో కొత్త యారిస్ ఫ్రంట్ డిజైన్‌లో చేసిన కొన్ని మార్పులను గమనించవచ్చు.

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

కొత్త 2021 టొయోటా యారిస్ సెడాన్ కారు టీజర్ ఇమేజ్‌ను చూస్తుంటే, ప్రస్తుత తరం యారిస్ కన్నా ఇది మెరుగైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ టీజర్ ఫొటోలో అప్‌గ్రేడ్ చేసిన ఫ్రంట్ ఫాసియాను చూడొచ్చు. ఇందులో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ నుండి స్పూర్తి పొందిన కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ మరియు రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

ఇందులోని కొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్‌ను టొయోటా ప్రీమియం బ్రాండ్ అయిన లెక్సస్ మోడళ్లలో కనిపించే వాటి నుండి స్ఫూర్తిని పొంది తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. ఇది బ్లాక్-అవుట్ పెయింట్ స్కీమ్‌తో ట్రాపెజోయిడల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది, ఇది కారుకి ప్రీమియం మరియు ఖరీదైన లుక్ ఇస్తుంది.

MOST READ: డ్రైవర్ భాగస్వాముల కోసం ఓలా 'డ్రైవ్ ది డ్రైవర్' ఫండ్

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

ఫ్రంట్ మరియు సైడ్ ప్రొఫైల్‌లో చేసిన ఇతర మార్పులను గమనిస్తే, సి-ఆకారపు కటౌట్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి. కారు వెనుక భాగంలో చేసిన మార్పులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఫ్రంట్ మాదిరిగానే రియర్ కూడా కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉండే ఆస్కారం ఉంది. అయితే, సెడాన్ యొక్క మొత్తం సిల్హౌట్ మాత్రం మారదని తెలుస్తోంది.

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

ఇంటీరియర్లలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త యారిస్ సెడాన్‌లో అప్‌గ్రేడ్ చేసిన అప్‌హోలెస్ట్రీ, సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ప్రధానమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్లతో ఓవరాల్ క్యాబిన్ ఎక్స్‌పీరియెన్స్ మునపటి కన్నా మెరుగ్గా ఉండనుంది.

MOST READ: బైకర్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

ప్రస్తుత మోడల్‌లో రూఫ్‌లో అమర్చిన ఎయిర్-వెంట్స్, యాంబియంట్ ఇల్యూమినేషన్, 8-వే అడ్జస్టబల్ పవర్ డ్రైవర్ సీట్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు గెశ్చర్ కంట్రోల్స్‌తో సెవన్ ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్ల ఉండనున్నాయి.

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

ఇందులోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ ఏడు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్, అలాగే ఇన్‌ఫ్రారెడ్ కట్‌ఆఫ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) మరియు సౌర శక్తిని గ్రహించే ఫ్రంట్ విండ్‌షీల్డ్‌తో గ్లాస్-హై సోలార్ ఎనర్జీ శోషణ (హెచ్‌ఎస్‌ఇఎ) వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

టొయోటా యారిస్ సింగిల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవన్-స్పీడ్ సూపర్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

ఈ కొత్త టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందుగా అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యం కానుంది. అయితే, ఈ కొత్త యారిస్ ఇప్పట్లో భారత్‌కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఇది వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో యారిస్ అమ్మకాలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి.

MOST READ: చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

భారతీయ మార్కెట్లో టొయోటా ఎటియోస్ మోడల్ వాహనాలను నిలిపివేసిన తర్వాత కంపెనీ ఖాలీని భర్తీ చేసేందుకు కొత్త యారిస్ కారును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం టొయోటాకు ఎంట్రీ లెవల్ సెడాన్‌గా ఉన్న యారిస్ కారు అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ దృష్టి సారించింది. కమర్షియల్ విభాగం (టాక్సీ ఆపరేటర్లన) నుంచి యారిస్‌కు మంచి డిమాండ్ ఉంది.

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల, ఇండియాలో లాంచ్ అవుతుందా?

టొయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త 2021 ఫేస్‌లిఫ్టెడ్ టొయోటా యారిస్ ఫ్రంట్ డిజైన్ మరింత ప్రీమియంగా మరియు ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరగడంతో సెడాన్ విభాగం మార్కెట్ సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త యారిస్ భారత్‌కు వస్తుందన్న సూచనలు కనిపించడం లేదనే చెప్పాలి.

Most Read Articles

English summary
The Toyota Yaris facelift is set to be unveiled in the international market on June 25, 2020. The company has released a teaser of the upcoming facelift sedan, ahead of it unveil revealing a couple of design changes made to the new model. Read in Telugu.
Story first published: Saturday, July 25, 2020, 17:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X