Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఉబర్, ఎందుకంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా కస్టమర్ల ప్రతి ట్రిప్‌కు ముందు క్యాబ్‌లను శుభ్రపరచడానికి ఉబర్ వివిధ విమానాశ్రయాలతో కొత్త భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల వినియోగదారులకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన క్యాబ్‌లను అందించడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దాని డ్రైవర్-భాగస్వాములను కూడా సురక్షితంగా ఉంచడంపై దృష్టి పెడుతుంది.

భారతదేశంలో దేశీయ విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఉబర్ 39 నగరాల్లో విమానాశ్రయ రవాణా సేవలను తిరిగి ప్రారంభించింది. నగరాలలో సేవలన్నీ తిరిగి ప్రారంభమైన తరువాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం ప్రారంభించారు. ఈ కారణంగా వాహన సర్వీసులన్నీ ప్రారంభించబడ్డాయి. అంతే కాకుండా ఇది ప్రధానంగా అవసరమైన భద్రతా ప్రమాణాలను నిర్వహించడంపై కూడా దృష్టి పెడుతుంది.

ఉబర్ ప్రస్తుతం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (డిఐఎల్), జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (జిహాల్), బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (బియాల్), ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (మియాల్), మరియు పూణే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లలో ఉబర్ శానిటైజేషన్ హబ్స్ ఏర్పాటు చేసింది. ప్రతి ట్రిప్‌కు ముందు కస్టమర్ల మరియు డ్రైవర్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని కార్లను క్రిమిసంహారక చేయడం, అత్యాధునిక పరికరాలు మరియు క్రిమిసంహారక మందులను ఉపయోగించడం చేస్తున్నారు.
MOST READ:దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

బెంగుళూరు, హైదరాబాద్, ముంబై మరియు పూణే విమానాశ్రయాలలో ఉబర్ పిక్ అప్ పాయింట్ వద్ద ఈ సంస్థ శానిటైజేషన్ హబ్‌లను ఏర్పాటు చేసింది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ లోపల ఉబెర్ శానిటైజేషన్ హబ్‌ను కలిగి కూడా ఉంది. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్న ఏకైక ఫంక్షనల్ టెర్మినల్.

కంపెనీ జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లు డ్రైవర్లు మరియు రైడర్లకు ఫేస్ మాస్క్‌ల వాడకాన్ని తప్పనిసరి చేశాయి. కస్టమర్ పరిచయాన్ని తగ్గించడానికి కర్టన్స్ వంటి వాటిని ఉపయోగించాలని వినియోగదారులను అభ్యర్థించారు. ఇది డ్రైవర్ల ద్వారా మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. దీని ఫలితంగా వినియోగదారులు వారి సామాను వారి నిర్వహణలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. సంస్థ తన వినియోగదారుల కోసం డిజిటల్ పేమెంట్ ని కూడా అందిస్తోంది.
MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు : ఎంతో తెలుసా

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ విదే కుమార్ కుమార్ జైపురియార్ మాట్లాడుతూ, విమానంలో మరియు వాహనాలలో ప్రయాణించే వారి భద్రతను నిర్ధారించడం మా సమిష్టి బాధ్యత. దీనిలో భాగంగానే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు.
జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ఎస్.జి.కె కిషోర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రత మా ప్రధాన లక్ష్యం అని, విమానాశ్రయం మరియు నగరం మధ్య సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని నిర్ధారించడానికి ఉబర్ సహా మా రవాణా భాగస్వాములందరితో కలిసి పనిచేయడం మాకు సంతోషంగా ఉందన్నారు.
MOST READ:గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్, త్వరలోనే విడుదల!

సంస్థ ప్రయాణికులకు కట్టుదిట్టమైన భద్రత ప్రమాణాలను అందిస్తూ వారిని గమ్య స్థానానికి చేర్చడానికి కృషి చేస్తుంది. ఇక్కడ డ్రైవర్ల మరియు కస్టమర్ల భద్రతే ప్రధానం. ఇక్కడ వినియోగదారులు మరియు డ్రైవర్లు ఇద్దరూ సురక్షితం కాదని భావిస్తే ప్రయాణాలను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కరోనా మహమ్మారి భారీ తప్పించుకోవడానికి చేస్తున్న ప్రధాన భద్రతా చర్యలు.