కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

రైడ్-హెయిలింగ్ సర్వీస్ కంపెనీ యూబర్ భారతదేశంలో క్యాబ్‌ల కోసం భద్రతా తెరలను (ప్రొటెక్టివ్ స్క్రీన్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవస్థను 'సేఫ్టీ కాక్‌పిట్స్' అని పిలువనున్నారు. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో యూబర్ రైడర్స్ మరియు డ్రైవర్ల భద్రత కోసం ఈ కొత్త ప్రమాణాలను తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది. సుమారు 20,000 ప్రీమియర్ సెడాన్లలో ఈ సిస్టమ్‌ను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది.

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

యూబర్ ఇప్పటికే 8,000 క్యాబ్‌లలో ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్ల రవాణా కోసం యూబర్‌మెడిక్ కార్లలో ఈ తరహా ప్రొటెక్టివ్ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. రైడర్ల క్యాబ్‌లలో ఈ స్క్రీన్‌లను ఇన్‌స్టాల్ చేయటానికి అయ్యే ఖర్చును యూబర్ భరిస్తుంది, డ్రైవర్లు ఇందు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు.

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

అంతే కాకుండా, ఈ సేఫ్టీ కాక్‌పిట్‌ను యూబర్‌లోని ఇతర శ్రేణి వాహనాలకు కూడా విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహమ్మారి సమయంలో యూబర్ తమ డ్రైవర్-భాగస్వాములు మరియు వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించాలని కంపనీ లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

సేఫ్టీ కాక్‌పిట్ డిజైన్ విషయానికి వస్తే, ఇదొక వినూత్నమైన పారదర్శక ప్లాస్టిక్ స్క్రీన్. ఇది వాహనం రూఫ్ నుండి డ్రైవర్ వెనుక వైపు, ప్రక్క వైపున కవర్ చేసేలా ఉంటుంది. అంటే కారులో ఎక్కే ప్యాసింజర్లకు, డ్రైవర్లకు మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఉండేలా దీనిని తయారు చేశారు.

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

ఈ విషయంపై యూబర్ ఇండియా మరియు దక్షిణ ఆసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ మాట్లాడుతూ, "యూబర్ వద్ద, మేము నిరంతరం రవాణా భద్రతా ప్రమాణాలను నిర్వచించాము. ప్రస్తుత పరిస్థితుల్లో రైడర్స్ మరియు డ్రైవర్ల భద్రతను నిర్ధారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. భారత మార్కెట్లో సేఫ్టీ కాక్‌పిట్‌లకు మార్గదర్శకత్వం వహించిన తరువాత, మా డ్రైవర్లు మరియు రైడర్‌లందరికీ సాధ్యమైనంత ఉత్తమమైన ఉత్పత్తి అనుభవాన్ని ఆవిష్కరించడం కోసం యూబర్ బృందాలు దాని సాంకేతికత మరియు ప్రపంచ నైపుణ్యాన్ని పెంచడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయ''ని అన్నారు.

MOST READ:మీరు చూసారా.. మాడిఫై చేయబడిన ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

వాహనాలను శుభ్రపరిచే సామాగ్రి మరియు రక్షణ పరికరాలను అందించడం ద్వారా యూబర్ తమ డ్రైవర్-భాగస్వాములకు సహాయం చేస్తోంది. ఇందులో ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు మరియు మెడికల్-గ్రేడ్ వాహన క్రిమిసంహారకాలు మొదలైన అన్ని ఉత్పత్తులను యూబర్ తమ డ్రైవర్లకు అందుబాటులో ఉంచింది.

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

యూబర్ ప్రపంచ స్థాయిలో 50 మిలియన్ డాలర్ల విలువైన భద్రతా సామాగ్రిని కొనుగోలు చేసింది. భారతదేశానికి మాత్రమే, యూబర్ 3 మిలియన్లకు పైగా ఫేస్ మాస్క్‌లు, మోటో రైడర్స్ కోసం 1.2 మిలియన్ షవర్ క్యాప్స్, 2,00,000 బాటిళ్ల క్రిమిసంహారక మందులు మరియు 2,00,000 బాటిళ్ల శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేసింది.

MOST READ:కొత్త యమహా XSR 155 బైక్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

యూబర్ యొక్క ఇతర భద్రతా కార్యక్రమాలలో గో ఆన్‌లైన్ చెక్‌లిస్ట్ ఉంటుంది. డ్రైవర్ తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మాస్క్ ధృవీకరణ సెల్ఫీలు, కోవిడ్-19 సంబంధిత భద్రతా ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వినియోగదారులు కానీ లేదా డ్రైవర్లు కానీ ఇద్దరూ సురక్షితం కాదని భావిస్తే ప్రయాణాలను రద్దు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఎవరైతే డ్రైవర్ ఈ నిబధనలను పాటించరో వారి సభ్యత్వాన్ని యూబర్ రద్దు చేస్తుంది.

కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

యూబర్ సేఫ్టీ కాక్‌పిట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజా రవాణా స్థంభించిపోయిన నేపథ్యంలో, ప్రజలు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రత్యేకించి యూబర్ వంటి రైడ్-హెయిలింగ్ సేవలను అందించేటప్పుడు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, యూబర్ వైరస్ వ్యాప్తిని నివారించడానికి డ్రైవర్లు, కస్టమర్ల భద్రత కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి ట్రిప్‌కు ముందు క్యాబ్‌లను శుభ్రపరచడానికి ఇది వివిధ విమానాశ్రయాలతో కూడా జతకట్టింది.

MOST READ:బైకర్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

Most Read Articles

English summary
The ride-hailing service, Uber has announced the installation of safety screens for cabs in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X