Just In
Don't Miss
- News
బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Movies
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రెండ్ మారింది.. కొత్త సంవత్సరంలో రానున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు
భారత కార్ మార్కెట్లో క్రమంగా ట్రెండ్ మారుతోంది. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో కస్టమర్లు ప్రత్యామ్నాయ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు దేశంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ కంపెనీలు సైతం తమ ఎలక్ట్రిక్ వాహనాలను మనదేశంలో విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ మార్కెట్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంది.

ప్రస్తుతం ఈ విభాగంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తులు ఉన్నాయి. అయితే, కొత్త సంవత్సరంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు మన దేశంలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాదిలో (2021లో) భారత మార్కెట్లో 7 ఎలక్ట్రిక్ కార్లు విడుదల కావచ్చని తెలుస్తోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

మారుతి వాగన్ఆర్ ఎలక్ట్రిక్
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఎంతో కాలంగా అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ కారు 2021లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కంపెనీ అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ మోడల్ ఆధారంగా కంపనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
MOST READ:వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

మారుతి సుజుకి తమ ఎలక్ట్రిక్ వెర్షన్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు సంబంధించి అధికారిక సమయాన్ని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, వచ్చే ఏడాది రెండవ భాగంలో (సెప్టెంబర్ 2021 ప్రాంతంలో) ఇది మార్కెట్లోకి రావచ్చని ఆశిస్తున్నారు. ఒకవేళ, ఇది మార్కెట్లో విడుదలైతే, దీని ధర సుమారు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్లో ఉంటాయని అంచనా.

మహీంద్రా ఇకెయువి 100
ఎస్‌యూవీల తయారీలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ కెయువి100 ఆధారంగా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. మహీంద్రా ఈకెయువి 100 పేరుతో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది ప్రారంభంలో 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
MOST READ:వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచనున్న స్కోడా.. కారణం ఇదేనా !

ఆ సమయంలో మహీంద్రా తమ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధరలను కూడా ప్రకటించింది. రూ.8.25 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో మహీంద్రా ఈకెయువి దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనం అవుతుంది. వచ్చే ఏడాది ప్రథమ త్రైమాసికంలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎస్యూవీ చూడటానికి దాని పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో అందిస్తున్న చిన్న కారు 'క్విడ్' ఆధారంగా కంపెనీ ఇందులో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం రెనో క్విడ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ చైనా మార్కెట్లో కె-జీఈ పేరుతో ప్రత్యేకంగా విక్రయిస్తోంది. రెనో క్విడ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ముందుగా 2021 మొదటి అర్ధభాగంలో యూరప్ మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాత ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:ఈబైక్గోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న హీరో ఎలక్ట్రిక్ ; ఎందుకంటే ?

ఒకవేళ క్విడ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఆ బ్రాండ్‌కు దేశంలో మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. రెనో క్విడ్ ఎలక్ట్రిక్ కారులో 26.8 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించనున్నారు. పూర్తి చార్జ్‌పై ఇది 270 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేయనుంది. మారుతి సుజుకి వాగన్ఆర్ ఎలక్ట్రిక్‌కు ఇది పోటీగా ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ ఈవీ
టాటా మోటార్స్ ఇప్పటికే తమ నెక్సా ఈవీతో భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉంది. నెక్సాన్ ఈవీ విజయం తర్వాత ఈ బ్రాండ్ నుండి రానున్న రెండవ ఎలక్ట్రిక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఈవీ. టాటా మోటార్స్ ఈ కారును తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
MOST READ:అటల్ టన్నెల్లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదిలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మాదిరిగానే ఇది కూడా ఒకేరకమైన పవర్‌ట్రైన్‌ను మరియు అనేక భాగాలను పంచుకోవచ్చని సమాచారం. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విడుదల కానుంది మరియు నెక్సాన్ ఈవీ తక్కువ ధరను కలిగి ఉండొచ్చని అంచనా (రూ.10 - రూ.12 లక్షలు, ఎక్స్-షోరూమ్).

జాగ్వార్ ఐ-పేస్
టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ కూడా ఓ సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. జాగ్వార్ ఐ-పేస్ పేరుతో కంపెనీ తమ మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

మార్చ్ 2021లో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత తీరాలకు చేరుకోనుంది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి మరియు ఆడి నుండి రాబోయే ఇ-ట్రోన్ వంటి ఎస్‌యువిలకు పోటీగా నిలుస్తుంది. జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు 395 బిహెచ్‌పికి పైగా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది పూర్తి ఛార్జీపై గరిష్టంగా 470 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఆడి ఇ-ట్రోన్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా, కూడా దేశంలో తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆడి విక్రయిస్తున్న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ఈ విభాగంలో జాగ్వార్ ఐ-పేస్, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కొత్త ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 436 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. కొత్త ఆడి ఇ-ట్రోన్ ధరలు ఈ విభాగంలో దాని పోటీదారులతో సమానంగా ఉంటాయని అంచనా (సుమారు రూ.1 కోటి).

టెస్లా మోడల్ 3
ఈ జాబితాలో చివరిది మరియు అత్యంత అధునాతమైనది టెస్లా నుండి వస్తున్న 'మోడల్ 3'. అమెరికాలో అత్యంత పాపులర్ అయిన టెస్లా కార్ బ్రాండ్, వచ్చే ఏడాది భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తోంది. టెస్లా ఐఎన్సి వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

టెస్లా బ్రాండ్ నుండి భారత్‌కు రానున్న మొట్టమొదటి కారు మోడల్ 3 అని తెలుస్తోంది. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు 2021 మధ్య భాగం నాటికి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మోడల్ బుకింగ్స్‌కు సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో టెస్లా మోడల్ 3 ధర రూ.60 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్లో ఉండొచ్చని అంచనా.