11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ ఇండియా లైనప్‌లో చాలా వరకు అన్నీ కొత్త కార్లే ఉన్నాయి. నూతన డిజైన్ ఫిలాసఫీ మరియు సరికొత్త ఫ్లాట్‌ఫామ్స్ మీద అభివృద్ది చేసిన కొత్త మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. టాటా గత నాలుగేళ్ల తీసుకొచ్చిన కొత్త మోడళ్లు ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ రూపు రేఖలే మార్చేశాయి.

వీటికి అదనంగా టాటా మోటార్సు రానున్న మూడు నాలుగేళ్లలో సుమారుగా 12 నుండి 14 కొత్త కార్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. భారీ అంచనాలతో టాటా సిద్దం చేస్తున్న ఈ కొత్త కార్ల వివరాలు గురించి ఇవాళ్టి కథనంలో క్లుప్తంగా తెలుసుకుందాం రండి...

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

1. టాటా ఆల్ట్రోజ్

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి 2020 జనవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన టాటా ఆల్ట్రోజ్ 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హోండా జాజ్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

2. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్

నెక్సాన్ ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. పర్సనల్ ప్యాసిజంర్ కార్ కస్టమర్ల కోసం టాటా తీసుకొస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. గతంలో టిగోర్ మరియు టియాగో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసినా.. వాటిని కేవలం వాణిజ్య అవసరాల కోసం విక్రయించేది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

3. టాటా హ్యారీయర్

టాటా మోటార్స్ తమ ప్రీమియం ఎస్‌యూవీ టాటా హ్యారీయర్‌ను గత ఏడాది జనవరిలో మార్కెట్లోకి లాంచ్ చేసింది. మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న హ్యారీయర్ మంచి సేల్స్ సాధించింది. అయితే, టాటా మోటార్స్ ఇప్పుడు హ్యారీయర్ ఎస్‌యూవీని మెరుగైన ఇంజన్ అప్‌గ్రేడ్‌తో బిఎస్6 వెర్షన్ లాంచ్ చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ 01, 2020లోపే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

4. టాటా గ్రావిటాస్

టాటా గ్రావిటాస్ హ్యారీయర్ ఎస్‌యూవీ యొక్క 7-సీటర్ వెర్షన్ మరియు టాటా లైనప్‌లో ఉన్న హెక్సా స్థానంలో ఇది రానుంది. ఫీచర్లు, ఇంజన్ మరియు డిజైన్ పరంగా హ్యారీయర్ మరియు గ్రావిటాస్ ఎస్‌యూవీలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ గ్రావిటాస్ ఎస్‌యూవీలో 7-మంది ప్రయాణించేలా 7-సీటింగ్ లేఔట్ ఉంటుంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

5. టాటా హార్న్‌బిల్

టాటా మోటార్స్ గతంలో ఆవిష్కరించిన హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా టాటా హార్న్‌బిల్ అనే మైక్రో ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. సబ్-4 మీటర్ల పొడవులోపు ఉండే ఈ ఎస్‌యూవీ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ప్రత్యామ్నాయ ఎంపికగా నిలవనుంది. ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ మరియు ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ డెవలప్ చేస్తున్న దీనిని 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

6. టాటా ఆల్ట్రోజ్ ఇవి

టాటా అతి త్వరలో లాంచ్ చేయనున్న ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తున్నట్లు సమాచారం. 2021 నాటి కల్లా టాటా ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్), పవర్ మరియు ఎలక్ట్రిక్ టెక్నాలజీకి సంభందించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

7. న్యూ టాటా నెక్సాన్

టాటా మోటార్స్ 2022-2023 మధ్య కాలంలో కొత్త తరం నెక్సాన్ ఎస్‌యూవీని లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెక్సాన్‌తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ మీద అత్యాధునిక ఇంజన్ ఆప్షన్లతో రానుంది. దీనికి ముందే నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల కానుంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

8. న్యూ టియాగో

టాటా టియాగో ఇప్పటికే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలయ్యింది, అయితే నెమ్మదిగా దీని లైఫ్ కూడా అయిపోతోంది. టాటా భారీ విజయాన్ని సాధించిపెట్టిన టాటా టియాగో మోడల్‌ను మరింత కొత్తగా రీలాంచ్ చేసే అవకాశం ఉంది. నూతన డిజైన్ అంశాలతో ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ మీద పలు మార్పులు చేర్పులతో రానుంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

9. న్యూ టిగోర్

టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా తీసుకొచ్చిన కాంపాక్ట్ సెడాన్ టిగోర్. ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా.. ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు ధీటైన పోటీనిస్తోంది. అగ్రిసివ్ డిజైన్ లుక్‌లో కనిపించే టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కారును లైట్ వెయిట్ మోడ్యులర్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. ప్రస్తుతం ఉన్న అవే ఇంజన్ ఆప్షన్లలతో ఫ్యూచర్‌లో సరికొత్తగా రీలాంచ్ అయ్యే అవకాశం ఉంది.

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

10. టాటా టిగ్గో

టాటా టిగ్గో.. మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీగా సరాసరి పోటీనిచ్చే మోడల్. చైనీస్ దిగ్గజం చెర్రీ భాగస్వామ్యంతో టాటా తీసుకురానున్న మొట్టమొదటి మోడల్ టాటా టిగ్గో. దీనిని చెర్రీ టిగ్గో ఆధారంగా ఇండియన్ కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా డెవలప్ చేయనున్నారు. కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా మోడళ్లకు పోటీనిస్తుంది

11 కొత్త కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్: పూర్తి వివరాలు

11. టాటా ఇ-విజన్ సెడాన్

టాటా మోటార్స్ గతంలో జరిగిన జెనీవా మోటార్ షోలో ఇ-విజన్ కారును తొలిసారి ఆవిష్కరించింది. టాటా ఇ-విజన్ మిడ్-సైజ్ సెడాన్ కారు మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ మరియు టయోటా యారిస్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది. వివిధ సెగ్మెంట్లలో తమ ఉత్పత్తులు పెంచుకునేందుకు టాటా ఎన్నో కొత్త మోడళ్లను సిద్దం చేస్తోంది. అందులో అత్యంత ముఖ్యమైన మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్ ఒకటి, దీని కోసం టాటా బ్రాండ్ వ్యాల్యూను పెంచేలా ఇ-విజన్ కారును నిర్మిస్తున్నారు.

Most Read Articles

English summary
Tata upcoming cars and SUVs. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X