వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

భారతదేశంలో అధికంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అన్ని సంస్థలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ నాల్గవ దశ అమలు చేసింది. ఈ క్రమంలో కొన్ని సడలింపులు కూడా కల్పించింది. ఈ లాక్ డౌన్ నాల్గవదశలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పిస్తూ, 2020 ఫిబ్రవరి 1 తర్వాత గడువు ముగిసినప్పటికీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి వాహన పత్రాల చెల్లుబాటును జూలై 31 వరకు పొడిగించింది.

వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

అనేక మోటారు వాహన సంబంధిత సర్టిఫికెట్స్ చెల్లుబాటును జూలై 31 వరకు పొడిగించినట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని పిటిఐలో ఒక నివేదిక తెలిపింది.

MOST READ: ఈ బజాజ్ బైక్స్ ఇప్పుడు మరింత కాస్ట్లీ, ఎంతో తెలుసా ?

వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

2020 మార్చి నుండి దేశవ్యాప్తంగా ఇది విధించబడింది. అంతేకాకుండా 2020 ఫిబ్రవరి 1 నుండి పెండింగ్‌లో ఉన్న పత్రాల ధ్రువీకరణ ఆలస్యం అయినందుకు వినియోగదారుల నుండి ఆలస్య రుసుము వసూలు చేయబడదని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో, లాక్-డౌన్ కారణంగా చెల్లుబాటు యొక్క పొడిగింపు మంజూరు చేయబడింది. సాధారణంగా వెహికల్ సర్టిఫికెట్స్ 2020 ఫిబ్రవరి 1 కి ముగిసింది. కానీ అది ఇప్పుడు 2020 జూన్ 30 వరకు ముగుస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ 2020 జూన్ 30 వరకు ఇటువంటి పత్రాలను చెల్లుబాటు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.

MOST READ:నీరవ్ మోడీ రోల్స్ రాయిస్ లగ్జరీ కార్ వేలంలో ఎవరి సొంతమైందో తెలుసా

వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు, 1989 లోని 32 మరియు 81 నిబంధనల ప్రకారం తప్పనిసరి చేసిన వివిధ ఫీజులు మరియు ఆలస్య రుసుములకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీని వల్ల ఈ పొడిగింపును కల్పించడం జరిగింది.

వెహికల్ డాక్యుమెంట్ వ్యాలిడిటీని పెంచిన గవర్నమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా !

రెన్యువల్ మరియు సర్వీస్ కోసం కోసం వినియోగదారులు ఇప్పటికే ఫీజు చెల్లించిన అనేక సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ, లాక్ డౌన్ కారణంగా ప్రక్రియ పూర్తి కాలేదు. దేశవ్యాప్తంగా అనేక ఆర్టీఓ కార్యాలయాలు మూసివేయడం వల్ల పౌరులు ఫీజు చెల్లించడం వంటివి కష్టమవుతోంది. వాహనదారులు వీలైనంత వరకు ఇచ్చిన గడువు లోపల రెన్యూవల్ చేసుకోవడానికి చేసుకోవాలి.

MOST READ:లీక్ అయిన టయోటా యారిస్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోస్

Most Read Articles

English summary
Lockdown 4.0: Government Extends Validity Of Vehicle Documents Till July 31. Read in Telugu.
Story first published: Monday, May 25, 2020, 10:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X