హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

హోండా కార్స్ ఇండియా కొత్తగా 'వర్చువల్ షోరూమ్'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలో తమ డిజిటల్ ప్రణాళికల్లో భాగంగా ఈ కొత్త ఆన్‌లైన్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో హోండా కార్లను కొనాలనుకునే కస్టమర్లు, ఈ ఆన్‌లైన్ స్టోర్ సదుపాయం ద్వారా వారి ఇంటి వద్ద నుంచే ఎలాంటి అసౌకర్యం లేకుండా కొనుగోళ్లు, సంప్రదింపులు జరవచ్చని కంపెనీ తెలిపింది.

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

హోండా వర్చువల్ కార్ షోరూమ్ వినియోగదారులకు ఇంటరాక్టివ్ షోరూమ్ అనుభవాన్ని అందిస్తుందని, ఈ వర్చువల్ షోరూమ్‌ను స్మార్ట్‌ఫోన్‌లలో లేదా కంప్యూటర్లలో యాక్సెస్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్‌లు తమకు నచ్చిన హోండా కార్ మోడళ్లను, వివిధ ఆప్షన్లను బ్రౌజ్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ వీలు కల్పిస్తుంది.

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

వర్చువల్ షోరూమ్ సాయంతో కస్టమర్లు హోండా కార్లకు సంబంధించి ఎక్స్‌టీరియర్స్ మరియు ఇంటీరియర్స్ రెండింటినీ 360-డిగ్రీ కోణంలో వీక్షించవచ్చు. ఇది కస్టమర్ దృష్టిని మరియు దృక్పథాన్ని పెంచుతుందని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయంతో కస్టమర్లు తమ ఇంటి వద్ద నుండే తమకు నచ్చిన డీలర్‌షిప్‌లతో సంప్రదింపులు జరిపేందుకు కూడా అనుమతిస్తుంది.

MOST READ:కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

హోండా ‘వర్చువల్ షోరూమ్'లో క్లిక్ చేయగల అనేక పాయింట్లు కూడా ఉంటాయి, ఇవి వినియోగదారులకు వీడియోల ద్వారా అదనపు ఫీచర్ల గురించి పూర్తి వివరణను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ కలర్‌రైజర్ ఎంపికతో వస్తుంది, వినియోగదారులు తాము ఎంచుకున్న కార్ మోడల్‌ను వివిధ కోణాల్లో వివిధ రంగులలో చూడటానికి అనుమతిస్తుంది. ఇతర ఆప్షన్లలో హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, వేరియంట్ కంపారిజన్ మొదలైన విజువలైజేషన్స్ కూడా ఉంటాయి.

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

ఈ సందర్భంగా, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ విపి మరియు డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "ఈ కొత్త ప్రణాళికతో మేము నిజమైన హోండా షోరూమ్ యొక్క అనుభవాన్ని వర్చువల్ రూపంలో మా వినియోగదారుల ముందుకు తీసుకువచ్చాము. దీని సాయంతో వారు తమ ఇంటి వద్ద నుండే సౌకర్యంగా, తమకు నచ్చిన హోండా కార్లను పూర్తిగా డిజిటల్ రూపంలో అన్వేషించి, నిజమైన షోరూమ్ అనుభూతిని పొందగలరు" అని అన్నారు.

MOST READ:త్వరలో రానున్న మహీంద్రా 5 డోర్స్ మోడల్, ఇది ఎలా ఉంటుందో తెలుసా ?

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

హోండాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ గత వారం తమ కస్టమర్ల కోసం 'బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్'ను ప్రారంభించింది. హోండా యజమానులు తమ కారుకి ఏదైనా నష్టం జరిగి ఉన్నట్లయితే, వాటిని మరమ్మత్తు చేయించుకోవటానికి ఇదొక గొప్ప అవకాశం అని కంపెనీ పేర్కొంది.

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

హోండా కస్టమర్ల కోసం బాడీ అండ్ పెయింట్ సర్వీస్ క్యాంప్ సెప్టెంబర్ 14వ తేదీ నుండి ప్రారంభమై సెప్టెంబర్ 26, 2020 వరకూ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీస్ క్యాంప్ భారతదేశంలోని అన్ని అధీకృత హోండా సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది కంపెనీ వివరించింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్‌ని చూశారా? ఎంత బాగుందో..

హోండా వర్చువల్ షోరూమ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా ‘వర్చువల్ షోరూమ్' ప్లాట్‌ఫామ్ సాయంతో కస్టమర్లు తమ ఇంటి నుంచే వాస్తవ డీలర్‌షిప్‌లలో ఉన్న అనుభూతిని పొందవచ్చు. అంతేకాకుండా, తమకు నచ్చిన హోండా కారుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరియు డీలరుతో సంప్రదింపులను చేసి, ఇంటి నుంచి బయటకు రాకుండా తమ అభిమాన కారును తమ ఇంటికే డెలివరీ చేయించుకోవచ్చు.

MOST READ:10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన మొదటి ఇన్నోవా కారు ఇదే.. చూసారా ?

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India has announced the launch of its 'Virtual Showroom', as part of its digital plans in the country. The new Honda Virtual Showroom allows customers to discover, engage and experience seamless car purchase experience from the comfort of their homes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X