Just In
- 48 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 10 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుడ్ న్యూస్.. టి-రాక్ ఎస్‌యువిని స్థానికంగా తయారుచేయనున్న వోక్స్ వ్యాగన్
జర్మన్ కార్ల తయారీ దిగ్గజం అయిన వోక్స్ వ్యాగన్ ఇటీవల తన ప్రసిద్ధ ఎస్‌యువి వెర్షన్ టి-రాక్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం టి-రాక్ ఎస్‌యువి ధర రూ.19.99 లక్షలు. ఈ వోక్స్ వ్యాగన్ యొక్క కొత్త టి రాక్ ఎస్‌యువి గురించి మరింత సమాచారం మీకోసం..
వోక్స్ వ్యాగన్ తన టి-రాక్ ఎస్‌యువిలను సిబియు మార్గం ద్వారా భారత్‌కు తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు ఈ టి-రాక్ ఎస్‌యువిని భారతదేశంలోని ఔరంగాబాద్‌లోని తన ప్లాంట్‌లో అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. కానీ ఈ సమాచారాన్ని వోక్స్ వ్యాగన్ అధికారికంగా ప్రకటించలేదు.
భారతీయ మార్కెట్లో ఈ ఎస్‌యువికి ఉన్న డిమాండ్ వల్ల ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ యొక్క అన్ని టి రాక్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
టి-రాక్ ఎస్‌యువి ముందు భాగంలో సొగసైన గ్రిల్ ఉంది. ముందు వైపున ఇరువైపులా ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఎస్‌యువిలో కొత్త బంపర్ మరియు పెద్ద గ్రిల్ వంటివి కూడా ఉన్నాయి.
MOST READ:హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే..?
ఈ ఎస్‌యువి ముందు భాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను కూడా అమర్చారు. కొత్త టి-రాక్ ఎస్‌యువిలో 5-స్పోక్ అల్లాయ్ వీల్, వెనుక భాగంలో పైకప్పులో అమర్చిన స్పాయిలర్ మరియు సొగసైన ఎల్‌ఈడీ టెయిల్ లైట్ ఉన్నాయి. వెనుక భాగంలో బంపర్ మరియు స్కఫ్ ప్లేట్లు కూడా ఉన్నాయి.
వోక్స్ వ్యాగన్ టి రాక్ ఎస్‌యువిలో పూర్తి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్, 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
MOST READ: శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు
టి-రాక్ ఎస్‌యువి యొక్క ప్రీమియం లక్షణాలు గమనించినట్లయితే ఇందులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, లెదర్ సీట్లు మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ప్రయాణీకుల భద్రత కోసం, ఎబిఎస్ విత్ ఇబిడి, 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక ప్రీమియం సౌకర్యాలు ఇందులో ఉంటాయి.
కొత్త వోక్స్ వ్యాగన్ టి రాక్ ఎస్‌యువిలో 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. టి-రాక్ ఎస్‌యువిని లగ్జరీ ఫీచర్లతో పెట్రోల్ ఇంజన్లలో మాత్రమే విక్రయిస్తారు.
MOST READ: కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు
వోక్స్వ్యాగన్ యొక్క కొత్త టి-రాక్ మోడల్ మిడ్ ఎస్‌యువి విభాగంలో ఉంటుంది. ఈ ఎస్‌యువి దేశీయ మార్కెట్లో జీప్ కంపాస్, కియా సెల్టోస్ మరియు స్కోడా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.