ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

కార్లలో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ ఓ సర్వసాధారణమైన ఫీచర్‌గా మారిపోయింది. దేశంలో ఇప్పటికే అనేక కార్ కంపెనీలు తమ ఉత్పత్తులలో ఈ తరహా టెక్నాలజీని అందిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని కార్లలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఈ కార్ కనెక్టింగ్ టెక్నాలజీకి 'మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్' అనే పేరును పెట్టారు. ఆ కొత్త కనెక్ట్ కార్ టెక్నాలజీ ఇప్పుడు అన్ని ఫోక్స్‌వ్యాగన్ మోడళ్లలో అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఫీచర్ల కోసం ఈ కనెక్టింగ్ టెక్నాలజీలో ఎంబెడెడ్ సిమ్‌ను కూడా జోడించారు.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

కంపెనీ ఇటీవలే విడుదల చేసిన కొత్త పోలో జిటి టిఎస్‌ఐ మరియు వెంటో హైలైన్ ప్లస్ మోడళ్లలో ఈ కొత్త కనెక్టింగ్ టెక్నాలజీని స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్ టెక్నాలజీ చాలా సింపుల్‌గా ఉండి, వినియోగదారులకు సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. దీనిని కారు యొక్క ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ (ఓబిడి) పోర్ట్‌కు డాంగిల్‌ను ప్లగ్ చేయడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్ 350 లాంచ్ డేట్ ఫిక్స్ : ఎప్పుడంటే ?

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

ఈ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ పరికరాన్ని ఓబిడికి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్ యాప్ సాయంతో వినియోగదారులు తమ కారుతో కనెక్ట్ కావచ్చు. ఈ యాప్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ శైలిని విశ్లేషిస్తుంది, ఇందులో స్పీడ్, బ్రేకింగ్ బిహేవియర్, కూలెంట్ టెంపరేచర్, యాక్సిలరేషన్ మరియు ఆర్‌పిఎమ్ మొదలైన అంశాలు ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

ఈ యాప్ వినియోగదారుల ఆసక్తిని గుర్తించడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్ కేర్ లేదా రోడ్ సైడ్ అసిస్టెన్స్‌కు కాల్ చేయటానికి వీలు కల్పిస్తుంది. దీనికి అదనంగా, కస్టమర్లు పేపర్‌లెస్ ఎక్స్‌పీరియెన్స్ కోసం వాహన పత్రాలను లేదా సంబంధిత అధికారిక పత్రాలను స్కాన్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి మరియు స్టోర్ చేసుకోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టాక్ యార్డ్‌లో అగ్నిప్రమాదం; భారీ ఆస్తి నష్టం!?

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

వాహన భీమా కోసం పునరుద్ధరణ రిమైండర్‌లను సెట్ చేయడానికి మరియు ‘ఓవర్ ది ఎయిర్' (ఓటిఏ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను స్వీకరించడానికి వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ అధునాతన మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్ యాప్ 3 సంవత్సరాల ఉచిత చందా మరియు 3 సంవత్సరాల వారంటీతో లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

ఈ సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మిస్టర్ స్టీఫెన్ నాప్ మాట్లాడుతూ, "ఫోక్స్‌వ్యాగన్ ఇండియాలో, మా వినియోగదారులకు ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుసంధాన పరిష్కారాలను (కనెక్టింగ్ సొల్యూషన్స్) అందించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ రోజు, మేము మా కస్టమర్ల సౌలభ్యం మరియు భద్రత కోసం అప్‌గ్రేడ్ చేయబడిన 'మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్' యాప్‌ను విడుదల చేశాం. దీని సాయంతో వినియోగదారులు వారి వాహన స్థితి, డ్రైవింగ్ విధానాలు వంటి రియల్ టైమ్ గణాంకాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ మొత్తం డ్రైవింగ్ విధానాన్నే చాలా సరదాగా మరియు ఉపయోగకరంగా మారుస్తుందని​​" ఆయన అన్నారు.

MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న యమహా ఎమ్‌టి-09 బైక్ టీజర్ వీడియో

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

ఈ ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్ యాప్ సాయంతో మీ కారు యొక్క సర్వీస్ హిస్టరీని కూడా రికార్డ్ చేయవచ్చు. తద్వారా మీ వాహనం యొక్క కండిషన్ మరియు దానికి సంబంధించిన రియల్ టైమ్ అనాలసిస్‌లను తెలుసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఫోక్స్‌వ్యాగన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ సేవలను యాక్సెస్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్ మీకు సహకరిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

అంతేకాకుండా, మీరు ప్రయాణించే మార్గంలో దగ్గర్లో ఉండే పెట్రోల్ బంకులను గర్తించేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. అలాగే, ఏ ప్రాంతంలో ఇంధనం నింపబడింది, ఎంత మొత్తంలో నింపారు మరియు ఏ ధర వద్ద నింపారు వంటి అంశాలు కూడా ఇందులో గుర్తించవచ్చు. అలాగే, ఇందులోని యాంటీ-థెఫ్ట్ ఫీచర్ సాయంతో మీ కారును పార్క్ చేసిన ప్రదేశం నుండి ఎవరైనా కదిలించడానికి ప్రయత్నిస్తే, తక్షణమే మీ ఫోన్‌కి నోటిఫికేషన్‌ను పంపించడం జరుగుతుంది.

MOST READ:కొత్త రైడింగ్ జాకెట్స్ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్, వీటి రేటెంతో తెలుసా ?

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ విడుదల

ఫోక్స్‌వ్యాగన్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతున్న ప్రస్తుత మార్కెట్ ధోరణికి అనుగుణంగా ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ కార్లలో అధునాతన కనెక్టింగ్ టెక్నాలజీని విడుదల చేసింది. ఈ కనెక్టింగ్ టెక్నాలజీ సాయంతో కస్టమర్లు తమ కారును దొంగతనం నుండి రక్షించుకోవడంతో పాటుగా అనేక ఇతర అంశాల గురించి కూడా తెలియజేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవటం కోసం కంపెనీ 3 ఏళ్ల ఉచిత చందా వ్యవధిని కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
Volkswagen has launched a new connected car technology called 'My Volkswagen Connect' in the Indian market. Volkswagen models now receive an embedded Sim for the connected technology with enhanced features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X