ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

కోవిడ్-19 తర్వాత ఆటోమొబైల్ రంగం ఇప్పుడిప్పుడే కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఓవైపు వైరస్‌తో సహజీవనం చేస్తూనే మరోవైపు వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా.. జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా 'ఇండియా అన్‌లాక్ 1.0' ప్రణాళికలో భాగంగా భారతదేశంలోని కంటైన్మెంట్ జోన్లు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో తమ వ్యాపారాలను పునఃప్రారంభించినట్లు ప్రకటించింది.

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మార్గదర్శకాలను పాటిస్తూ కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా సేల్ అండ్ సర్వీస్ కార్యకలాపాలను పరిమిత సిబ్బందితో ప్రారంభించినట్లు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తెలిపింది.

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

అన్ని డీలర్‌షిప్ కేంద్రాలకు కూడా ప్రభుత్వం ప్రకటించిన భద్రతా నియమాలకు లోబడి సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. షోరూమ్‌లు మరియు సర్వీస్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది కూడా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ, గ్లౌజ్‌లు మాస్కులు ధరించి కస్టమర్లతో కాంటాక్ట్ లేకుండా సేవలు అందించనున్నారు.

MOST READ: బ్రేకింగ్ న్యూస్.. మోటార్ వెహికల్స్ డాక్యుమెంట్ వాలిడిటీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

ఇక దేశవ్యాప్తంగా షోరూమ్‌లను ప్రారంభించిన సందర్భంగా, ఫోక్స్‌వ్యాగన్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా కస్టమర్ల ఇంటి నుంచే వాహనాలను పికప్ మరియు డ్రాప్ చేస్తూ, ఇలా చేసిన వాహనాలకు ఉచితంగా 10-పాయింట్ వెహికల్ చెకప్‌ను ఆఫర్ చేస్తోంది. టైర్లు, బ్యాటరీలు, ఏసి క్లీనింగ్, క్యాబిన్ జెర్మ్ క్లీన్ ట్రీట్‌మెంట్‌లపై ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్లు ఇప్పుడు కొత్తగా పరిచయం చేసిన యాంటీ-మైక్రోబయల్ ట్రీట్‌మెంట్ మరియు ఓజోన్-వెహికల్ డిస్ఇన్‌ఫెక్టంట్ సిస్టమ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీని సాయంతో కస్టమర్లు తమ కార్ల క్యాబిన్‌లో ఉండే బాక్టీరియాన్ క్లీన్ చేసుకొని ఇంటీరియర్‌ను హైజీన్‌గా ఉంచుకోవచ్చు.

MOST READ: పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

ఈ సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టీఫెన్ నాప్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ప్రణాళికలో భాగంగా, స్థానికంగా అమలులో ఉండే నియమాలకు కట్టబడి దశల వారీగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను పునఃప్రారంభించామని, తమ ఉద్యోగులు, డీలర్ భాగస్వాములు మరియు కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, కస్టమర్లలో తమపై ఉన్న విశ్వాసాన్ని పునర్మించేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

ఇదిలా ఉంచితే.. ప్రీ ఓన్డ్ కార్లపై ఆసక్తి ఉన్నవారి కోసం వోక్స్‌వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 (Das WeltAuto 3.0) అనే కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. డస్ వెల్ట్ఆటో 3.0లో భాగంగా కస్టమర్లు తమకు కావల్సిన కార్లను కొనుగోలు చేయటం లేదా తమ పాత కార్లను విక్రయించడంలో వోక్స్‌వ్యాగన్ సహకరిస్తుంది. వోక్స్‌వ్యాగన్ డస్ వెల్ట్ఆటో 3.0 కోసం కంపెనీ కొత్త రకం షోరూమ్‌లను ప్రారంభించింది.

MOST READ: మీకు తెలుసా.. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్

ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లు రీఓపెన్; కస్టమర్లకు ప్రత్యేక సేవలు

కోవిడ్-19 నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్ స్పెషల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు షోరూమ్‌లకు వెళ్లడానికి సంకోచించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫోక్స్‌వ్యాగన్ తమ కస్టమర్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలతో కస్టమర్లలో కొత్త ధైర్యం నెలకొంది. అంతేకాకుండా, ఇప్పుడు కస్టమర్లు స్వంత కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న తరుణంలో షోరూమ్‌లు అందుబాటులోకి రావటం కూడా మంచి విషయమనే చెప్పాలి.

Most Read Articles

English summary
Volkswagen India has announced the restart of dealerships operations across the country. The German brand has announced the reopening of all its stores outside of the containment zones, according to the 'India Unlock 1.0' initiative. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X