ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ కార్స్ ఇండియా ఈ నెల ప్రారంభంలో టిఎస్ఐ ఎడిషన్ పోలో మరియు వెంటో మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టిఎస్ఐ ఎడిషన్ల ధరలు వరుసగా రూ.7.89 లక్షలు మరియు రూ.10.99 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉండేవి..

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

కాగా, ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే తమ అధికారిక వెబ్‌సైట్ నుండి టిఎస్‌ఐ ఎడిషన్ పోలో మరియు వెంటో మోడళ్లను తొలగించి వేసింది. టిఎస్ఐ ఎడిషన్లకు మరియు రెగ్యులర్ వెర్షన్‌లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, టిఎస్ఐ ఎడిషన్లకు హనీకోంబ్ గ్రిల్, బాడీ సైడ్ గ్రాఫిక్స్, ప్యాసింజర్ డోర్స్‌పై టిఎస్ఐ బ్యాడ్జ్, బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, గ్లాసీ బ్లాక్ రూఫ్ మరియు స్పాయిలర్ వంటి మార్పులు ఉన్నాయి. రెండు టిఎస్ఐ ఎడిషన్లను హైలైన్ ప్లస్ వేరియంట్ ఆధారంగా తయారు చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

యాంత్రికంగా, రెండు మోడళ్లలో ఎలాంటి మార్పులు లేవు. వీటిలో అప్‌గ్రేడ్ చేసిన 1.0 లీటర్ టిఎస్ఐ బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో మోడళ్లలోని ఈ 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసింది. ఇది కొత్త సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఫోక్స్‌వ్యాగన్ పోలో లీటరుకు 18.24 కి.మీ మైలేజీని ఫోక్స్‌వ్యాగన్ వెంటో లీటరుకు 17.69 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ:ఇక్కడ రోజుకి 300 కార్లు దొంగలించబడుతున్నాయి, అదెక్కడో తెలుసా ?

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

ఫోక్స్‌వ్యాగన్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ (SAVW) ఇండియా ఇటీవలే పూణేలోని కరంజ్విహైర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ (పిహెచ్‌సి)కు ఓ మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్‌ను అందించింది. ఈ మెడికల్ క్లినిక్ వ్యాన్ సుమారు 12 గ్రామాలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

ఈ గ్రామాలన్నీ కూడా పూణేలోని తమ కంపెనీ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నవే. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రతాప్ బోపరై, పూణేలోని సంస్థ యొక్క కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో ఈ మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్‌ను ఖేడ్ తాలూకా వైద్య అధికారులకు అందజేశారు.

MOST READ:అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ లగ్జరీ కార్స్ ఎలా ఉన్నాయో చూసారా !

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

ప్రస్తుతం ఆసుపత్రిలో ఉపయోగిస్తున్న 15 ఏళ్ల అంబులెన్స్‌కు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ఈ వ్యాన్‌ను ఆరు నెలల పాటు సదరు వైద్య సంస్థకు అందజేశారు. ఈ మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్ గర్భిణీ స్త్రీలను శుభ్రమైన, సురక్షితమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో ఆసుపత్రులకు రవాణా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో స్పెషల్ వేరియంట్స్ మాయం - వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ వెబ్‌సైట్ నుంచి పోలో, వెంటో టిఎస్ఐ మోడళ్లను తొలగించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఫోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్ఐ మరియు వెంటో టిఎస్ఐ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌డేట్స్‌తో వచ్చాయి. బహుశా ఇవి మార్కెట్లో అంత ప్రజాదరణ పొందలేకపోయిన కారణంగా కంపెనీ వీటిని తొలగించి వేసి ఉండొచ్చు. పోలో, వెంటోలు ఈ జర్మన్ బ్రాండ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు మరియు ఇవి టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న కారణంగా ఈ కార్లను నడపడం చాలా సరదాగా అనిపిస్తుంది.

MOST READ:ఇలాంటి కెటిఎమ్ బైక్‌ను ఎప్పుడైనా చూశారా?

Most Read Articles

English summary
volkswagen removes polo vento tsi limited edition from its website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X