ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

లాక్‌డౌన్ తర్వాత అమ్మకాలను పెంచుకునే దిశగా అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ ఎంట్రీ లెవల్ కార్లయిన పోలో, వెంటో మోడళ్లపై రూ.43,000 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే, ఇవి కేవలం మ్యాన్యువల్ వేరియంట్లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

జూన్ నెల ఆఫర్లలో భాగంగా, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లపై రూ.33,000 బెనిఫిట్లను కంపెనీ కంపెనీ అందిస్తోంది. ఇందులో భాగంగా, రూ.10,000ల లాయల్టీ బోనస్, రూ.10,000ల ఎక్సేంజ్ బోనస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ ఫైనాన్షియల్ సర్వీస్ (విడబ్ల్యూఎఫ్ఎస్) ఆఫర్‌లో భాగంగా రూ.13,000ల అదనపు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఆఫర్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ పోలో ధరలు రూ.5.82 లక్షల నుంచి రూ.9.59 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ కారు మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది, ఇందులో రెండు ఆటోమేటిక్ వేరియంట్లు ఉంటాయి.

MOST READ: మద్యం మత్తులో బైక్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిరిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఫోక్స్‌వ్యాగన్ పోలో రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఒకట్ 1.0 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ గరిష్టంగా 76 బిహెచ్‌పిల శక్తిని, 95 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇకపోతే రెండవ ఇంజన్ ఆప్షన్ 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పిల శక్తిని, 175 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాత్రం మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులో ఆండ్రాయిడ్, యాపిల్ కార్‌ప్లే మరియు వాయిస్ కమాండ్స్‌ని సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్, నైట్ వ్యూ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఇక ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఆఫర్ విషయానికి వస్తే.. ఈ కారులోని మ్యాన్యువల్ వేరియంట్లపై కంపెనీ డీలర్లు గరిష్టంగా రూ.43,000 రాయితీలను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.15,000 లాయల్టీ బోనస్, రూ.15,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఫైనాన్షియల్ సర్వీస్ (విడబ్ల్యూఎఫ్ఎస్) ఆఫర్‌లో భాగంగా రూ.13,000ల అదనపు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నారు. డీలరును బట్టి ఆఫర్లు కూడా మారే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

జూన్ 30, 2020 వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రస్తుతానికి పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. బిఎస్6 డీజిల్ వెర్షన్ ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయబడింది. పెట్రోల్ వెర్షన్ టాప్ ఎండ్ వేరియంట్‌లో మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఫోక్స్‌వ్యాగన్ తమ కాంపాక్ట్ సెడాన్ 'అమెనో'ను భారత మార్కెట్ నుంచి డిస్‌కంటిన్యూ చేసిన తర్వాత వెంటో సెడాన్ కంపెనీ ఎంట్రీ లెవల్ సెడాన్‌గా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ వెంటో కార్ల ధరల రూ.8.86 లక్షల నుంచి రూ.13.29 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ: త్వరలో నిలిపివేయనున్న మహీంద్రా గ్రూప్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎందుకో తెలుసా ?

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్‌లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్స్, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్, రియర్ ఏసి వెంట్స్, ఆండ్రాయిడ్, యాపిల్ కార్‌ప్లే మరియు వాయిస్ కమాండ్స్‌ని సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్, నైట్ వ్యూ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లపై స్పెషల్ ఆఫర్స్

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే ఫోక్స్‌వ్యాగన్ మాత్రం అనూహ్యంగా తమ కార్లపై అధనపు తగ్గింపులను అందిస్తోంది. ఈ సమయంలో ఫోక్స్‌వ్యాగన్ కారు కొనాలనుకునే వారికి నిజంగా బెస్ట్ ఆఫర్స్ అనే చెప్పాలి.

Most Read Articles

English summary
Volkswagen is offering attractive discounts with the Polo and Vento models in June 2020. The company is offering discounts and benefits of up to Rs 43,000 on select manual variants of both the models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X