ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

జర్మన్ కార్ బ్రాండ్ 'ఫోక్స్‌వ్యాగన్ ఇండియా' ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ 'టిగువాన్ ఆల్‌స్పేస్' డెలివరీలను అతి త్వరలోనే ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. గడచిన మార్చ్ 2020లో ఫోక్స్‌వ్యాగన్ ఈ కొత్త కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వెంటనే కోవిడ్-19 లాక్‌డౌన్ రావటంతో ఈ మోడల్ దిగుమతి నిలిచిపోయింది. ఫలితంగా అప్పట్లో ఈ కారును బుక్ చేసుకున్న వారు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

కాగా.. గడచిన మే నెలలో కేంద్రం లాక్‌డౌన్‌లో సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో, ఈ కొత్త ఇప్పుడిప్పుడే డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటోంది. ఫోక్స్‌వ్యాగన్ ఇదివరకు భారత మార్కెట్లో విక్రయిస్తూ వచ్చిన టిగువాన్ 5-సీటర్ వెర్షన్‌ను రీప్లేస్ చేస్తూ కంపెనీ ఈ కొత్త 7-సీటర్ వెర్షన్‌ను టిగువాన్ ఆల్‌స్పేస్ పేరిట విడుదల చేసింది. భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ప్రారంభ ధర రూ.33.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

ముంబైలో ఓ షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. విడుదలైన రోజు నుండే ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ముందస్తుగా ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇచ్చి ముందుగా డెలివరీ చేయనున్నారు.

MOST READ: మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి పోటీగా వస్తోన్న టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆశించిన రీతిలో సక్సెస్‌ను అందించకపోవటంతో కంపెనీ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఫుల్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పొడవుగా మరియు ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండేలా టిగువాన్ ఆల్‌స్పేస్ కారును డిజైన్ చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో టొయోటా ఫార్చ్యూనర్, స్కొడా కొడియాక్ మోడళ్లకు అలాగే భవిష్యత్తులో విడుదల కానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మరియు టాటా గ్రావిటాస్ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 187 బిహెచ్‌పిల శక్తిని మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

MOST READ: కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీలో విభిన్నమైన వేరియంట్లను ఆఫర్ చేస్తూ కొనుగోలుదారులను కన్ఫ్యూజ్ చేయకుండా కంపెనీ ఇందులో ఒకే వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఒక్క వేరియంట్‌లోనే ఫుల్లీ-లోడెడ్ ఫీచర్లను అందిస్తోంది. పైపెచ్చు ఈ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, లెథర్ అప్‌హోలెస్ట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, వెంటిలేటెడ్ సీట్స్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, మోషన్ సెన్సిటివ్ బూట్ డోర్ ఓపెన్ వంటి కీలకమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

MOST READ: కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ డెలివరీలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోక్స్‌వ్యాగన్ తమ సరికొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీని విదేశాల్లో తయారు చేస్తున్న నేపథ్యంలో, లాక్‌డౌన్ కారణంగా దిగుమతుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడిప్పుడే మొదటి షిప్‌మెంట్ దేశానికి చేరుకున్న తరుణంలో కంపెనీ ముందుగా ఈ కార్లను డీలర్‌షిప్‌లో డిస్‌ప్లే కోసం పంపుతోంది. 7-సీటర్ టిగువాన్ ఆల్‌స్పేస్ చూడటానికి 5-సీటర్ టిగువాన్ మాదిరిగానే కనిపిస్తుంది, కాకపోతే ఇది దాని కన్నా పొడవుగా ఉండి ఎక్కువ సీటింగ్ సామర్థ్యాన్ని, అదనపు ఫీచర్లను ఆఫర్ చేస్తుంది.

IMAGES:Team-BHP

Most Read Articles

English summary
Volkswagen India launched the Tiguan Allspace SUV in the Indian market, back in March 2020. The Volkswagen Tiguan Allspace is a seven-seater SUV, which replaced its smaller five-seater sibling, the Tiguan in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X