వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

వోక్స్‌వ్యాగన్ సరికొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ప్రారంభ ధర రూ. 33.12 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా నిర్ణయించారు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

వోక్స్‌వ్యాగన్ గతంలో విడుదల చేసిన టిగువాన్ 5-సీటర్ మోడల్ యొక్క 7-సీటర్ వెర్షన్ టిగువాన్ ఆల్‌స్పేస్. రెగ్యులర్ టిగువాన్ తరహాలోనే టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ మోడల్‌ను కూడా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకొని ఇండియన్ మార్కెట్లో విక్రయించనున్నారు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా భాగస్వామ్యంలో తీసుకురావాలని భావిస్తున్న కొత్త కార్లలో టిగువాన్ ఆల్‌స్పేస్ కూడా ఒకటి, మరియు ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో వచ్చిన మొదటి మోడల్ కూడా ఇదే. దీనిని గ్లోబల్ MQB AO ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

ఇతర వోక్స్‌వ్యాగన్ కార్ల తరహాలోనే, టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీ కూడా సింగల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ పవర్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

డిజైన్ విషయానికి వస్తే, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ డిజైన్ పరంగా అచ్చం 5-సీటర్ టిగువాన్ ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. అయితే, మూడో వరస సీటింగ్ అందివ్వడానికి పొడవు మరియు వీల్ బేస్ పెంచారు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ గల ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌‌ల్యాంప్స్, వెనుక వైపున ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు 18-ఇంచుల అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా వచ్చాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఇంటీరియర్‌లో క్లీన్ అండ్ నీట్‌గా డిజైన్ చేసిన డాష్‌బోర్డ్ మరియు డ్యూయల్ టోన్ బ్లాక్/బీజి కలర్ క్యాబిన్ లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది. ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇం

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, లెథర్ ఫినిషింగ్ గల మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పెడల్ షిఫ్టర్స్, పానరొమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమొరీ ఫంక్షన్ మరియు పవర్ అడ్జెస్టబుల్ ఫీచర్ గల సైడ్ మిర్రర్లు, ప్రీమియం లెథర్ ఫినిషింగ్ గల సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హీట్ ఇన్సులేషన్ గల విండ్‌షీల్డ్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సార్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ మరియు డ్రైవ్ మోడ్ సెలక్టర్ ఇంకా ఎన్నో అదనపు ఫీచర్లు వచ్చాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

సేఫ్టీ విషయానికి వస్తే, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, సీట్-బెల్ట్ ప్రి-టెన్షననర్లు, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ మరియు రియర్ ఫాగ్ ల్యాంప్స్, ఆటో-హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఏడు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, హబానిరో ఆరేంజ్ మెటాలిక్, ప్యూర్ వైట్, రూబీ రెడ్ మెటాలిక్, పెట్రోలియం బ్లూ, ప్లాటినం గ్రే మెటాలిక్, పైరైట్ సిల్వర్ మరియు డీప్ బ్లాక్ పర్ల్. వోక్స్‌వ్యాగన్ ఈ మోడల్ మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది, డెలివరీలు కూడా అతి త్వరలో స్టార్ట్ కానున్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విడుదల: ధర రూ. 33.12 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌‌వ్యాగన్ ఇండియా తొలిసారిగా 7-సీటర్ ఎస్‍‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ విపణిలో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఆల్టురాస్ జీ4 మరియు ఇసుజు ఎమ్‌యుఎక్స్ మోడళ్లకు పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Volkswagen Tiguan AllSpace Launched In India: Prices Start At Rs 33.12 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X