వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

జర్మన్ బ్రాండ్ అయిన వోక్స్ వ్యాగన్ తన తరువాతి తరం కాంపాక్ట్ సెడాన్ యొక్క అధికారిక స్కెచ్లను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ ఆవిష్కరించనున్న తరువాతి తరం వెంటో కాంపాక్ట్ సెడాన్ లో సరికొత్త బాహ్య రూపకల్పనలు ఉంటాయని స్కెచ్లు వెల్లడిస్తున్నాయి. రాబోయే వోక్స్ వ్యాగన్ వెంటో కార్ లో వోక్స్ వ్యాగన్ జెట్టా యొక్క స్పూర్తితో రూపకల్పన చేసిన బోనెట్ ఉంటుందని స్కెచ్లు వెల్లడిస్తున్నాయి. వోక్స్ వ్యాగన్ వెంటో 2021 లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ నిర్దారించింది.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ వెంటోలో పునఃరూపకల్పన చేయబడిన బంపర్, కొత్త ఎల్ఇడి హెడ్‌లైట్లు మరియు పెద్ద ఎయిర్ డ్యామ్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో చేసిన డిజైన్ మార్పులలో ప్రధానంగా టెయిల్ లాంప్స్, మజిల్ బంపర్, ఫాక్స్ డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

కొత్త వోక్స్ వ్యాగన్ వెంటోలో ఇంటీరియర్స్, కొత్త స్టీరింగ్ వీల్ మరియు కేంద్రంగా ఉంచిన ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ ఉంటాయి. వెంటోలో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు సరికొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానల్‌ ఉంటుంది. ఇందులో 8 అంగుళాల ఫ్లోటింగ్ రకం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఇది ప్రస్తుత మోడళ్లలో ఇన్ డాష్ హౌజ్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ నుండి రిఫ్రెష్ మార్పు.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

వోక్స్వ్యాగన్ వెంటోలో అప్హోల్స్టరీతో పాటు వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు బ్యాక్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయని భావిస్తున్నారు.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ యొక్క తరువాతి తరం వెంటోలో లభించే ఇంజిన్ ఎంపికల గురించి నిర్దిష్టమైన సమాచారం లేదు, కాని ఈ కాంపాక్ట్ సెడాన్ సంస్థ యొక్క కొత్త 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

వోక్స్ వ్యాగన్ యొక్క పోలో మోడళ్లలో కనిపించే కొత్త 1.0 లీటర్, మూడు సిలిండర్ల డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ తో ఉంటాయి.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

ప్రస్తుత తరం వోక్స్‌వ్యాగన్ వెంటో ధర రూ. 8.77 లక్షల నుంచి రూ. 14.49 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ఉంది. కానీ 2020 లో ప్రారంభించబోయే తదుపరి తరం వెంటో ధర దాదాపు రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ఉంటుందని ఆశిస్తున్నారు.

వెంటో యొక్క అధికారిక స్కెచ్లను వెల్లడించిన వోక్స్ వ్యాగన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాధారణంగా స్కెచ్ వేసినప్పుడు ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది. కానీ నిజంగా స్కెచ్ లో కనిపించేంత అద్భుతంగా వోక్స్ వ్యాగన్ యొక్క తరువాతి తరం ఉంటుందేమో చూడటానికి కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఏది ఏమైనా తరువాతి తరం వోక్స్ వ్యాగన్ బాగానే ఉంటుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Volkswagen Vento Official Sketches Revealed: Redesigned Exterior, Impressive Interior. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X