భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

స్వీడిష్ ప్రీమియం కార్ కంపెనీ వోల్వో, భారత మార్కెట్లో ఓ కొత్త రీచార్జబల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్లో వోల్వో అందిస్తున్న కంబస్టియన్ ఇంజన్ మోడళ్లను క్రమక్రమంగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం, స్వీడన్ ఆటో మేకర్ వోల్వో తమ ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. వోల్వో అందిస్తున్న ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎక్స్‌సి40 రీఛార్జబల్ ఎస్‌యూవీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

వోల్వో తమ వాహనాల్లో ఎలక్ట్రిక్ మోటార్లను ప్రవేశపెట్టి, పూర్తి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలన్ని ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ఈ వోల్వో ఎక్స్‌సి40. గత 2018లో కూడా వోల్వో ఇండియా రానున్న మోడళ్ల కాలంలో భారత మార్కెట్ కోసం 4 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

వోల్వో తమ వాహనాల్లో ఎలక్ట్రిక్ వేరియంట్లను పరిచయం చేయటం ద్వారా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థకు మరియు పర్యావరణానికి మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి కట్టుబడి, భవిష్యత్తులో వోల్వో ప్రపంచవ్యాప్తంగా విక్రయించే అన్ని వోల్వో కార్లలో ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను పరిచయం చేస్తామని కంపెనీ 2019 లోనే ప్రకటించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి భారత్ కూడా వచ్చి చేరింది.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

ఇక వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇదొక కొత్త కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎమ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన మోడల్. ఈ ప్లాట్‌ఫామ్‌పై కంబస్టియన్ ఇంజన్ మోడళ్లను మరియు బ్యాటరీతో నడిచే వాహనాలను రెండింటినీ తయారు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చూడటానికి స్టాండర్డ్ ఎక్స్‌సి40 మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీలో కొన్ని సూక్ష్మమైన మార్పులు ఉండనున్నాయి.

MOST READ:త్వరలో రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ; చూసారా ?

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పుల్లో, ముందు భాగంలో అమర్చిన కొత్త వైట్-ఫినిష్డ్ గ్రిల్, పెద్ద వోల్వో బ్యాడ్జ్ ఉంటాయి. సాధారణ మోడల్‌లో కనిపించే డ్యూయెల్-ఎగ్జాస్ట్ సెటప్ ఈ ఎలక్ట్రిక్ మోడల్‌లో ఉండదు. అలాగే, ఇందులో ముందు వైపు హుడ్ క్రింద్ భాగంలో ఇంజన్ ఉండదు కాబట్టి దాని స్థానంలో 31 లీటర్ల చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎస్‌యూవీలో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిని యాక్సెల్స్ వద్ద అమర్చబడి ఉంటాయి. ఇవి 78 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి శక్తిని మరియు 659 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. స్టాండర్డ్ వెర్షన్ ఎక్స్‌సి40 పోల్చితే, అందులోని 2.0-లీటర్ డీజిల్ కేవలం 187 బిహెచ్‌పి శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ ; కార్ ఓనర్ టీ అమ్ముకునేలాగా చేసింది, ఎలాగో చూడండి

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో చేర్చిన బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్ల కారణంగా, స్టాండర్డ్ ఎక్స్‌సి40తో పోలిస్తే ఈ కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 500 కిలోల అధక బరువుని కలిగి ఉంటుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

ఎలక్ట్రిక్ మోటార్ల విడుదలయ్యే శక్తి ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జ్‌పై 400 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది, దీని సాయంతో బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు.

MOST READ:అరుదైన పాతకాలపు కారు కొన్న M.S ధోని : దీని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

వోల్వో తన మొట్టమొదటి ఎక్స్‌సి90 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను 2019లో విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే భారతదేశంలో ఎక్స్‌సి90 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని 2019 చివర్లో బెంగళూరులోని తన ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించింది.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ భారత మార్కెట్లో విడుదలైతే, ఈ మోడల్‌ను కూడా కంపెనీ ఇక్కడే స్థానికంగా అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, మార్కెట్లో ఎక్స్‌సి40 రీచార్జ్ ధర కూడా అందుబాటులో ఉండొచ్చని అంచనా.

భారత్‌కు రానున్న వోల్వో ఎలక్ట్రిక్ కారు - ఫుల్ డీటేల్స్

వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జబల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ మోడల్‌ను కంపెనీ భారత్‌లో విడుదల చేస్తే, ఇప్పటికే అధికంగా ఉన్న దిగుమతి సుంఖాల కారణంగా మార్కెట్లో దీని ధర కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ, ఈ మోడల్‌ను కంపెనీ స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించినట్లయితే, ధరలు అందుబాటులోకి రావచ్చు. ఏదేమైనప్పటికీ, ఇది మాత్రం లగ్జరీ కార్ విభాగంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

Source:Autocar India

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo was evaluating the possible launch of the XC40 Recharge electric SUV in the Indian market. The company aims to cater to the growing demand for electric SUVs in the country and slowly phase out its combustion-engine-only models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X