ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం : దీనికి ఛార్జింగ్ అవసరమే లేదు

స్విట్జర్లాండ్‌కు చెందిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ కుహ్న్ ష్వీజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం. 45 టన్నుల బరువున్న ఈ డంప్ ట్రంక్, 65 టన్నుల సరుకుని లోడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం : దీనికి ఛార్జింగ్ అవసరమే లేదు

ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనం తన రోజువారీ పనిలో వినియోగించే దానికంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వాహనంలో రాళ్లను సిమెంట్ కర్మాగారానికి, కొండ పైభాగం నుండి దాని స్థావరం వరకు రవాణా చేయడం మనం వీడియోలో చూడవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం : దీనికి ఛార్జింగ్ అవసరమే లేదు

ఎలెక్ట్రో డంపర్ అని పిలువబడే ఈ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం 9.36 మీటర్ల పొడవు, 4.24 మీటర్ల వెడల్పు, 4.4 మీటర్ల ఎత్తు మరియు 4.30 మీటర్ల వీల్‌బేస్‌తో ఉంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం : దీనికి ఛార్జింగ్ అవసరమే లేదు

ఈ ఎలక్ట్రిక్ ట్రక్కుకు ఛార్జ్ చేయడానికి శక్తి అవసరం లేదు. ఇది పనిని చేసేటప్పుడు ట్రక్కు ఛార్జ్ చేయవలసిన దానికంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం : దీనికి ఛార్జింగ్ అవసరమే లేదు

సాధారణ ఎలక్ట్రిక్ వాహనం వలె ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో బ్రేకింగ్ ఇ డంపర్లను ఉపయోగించినప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియను పునరుత్పత్తి బ్రేకింగ్ అంటారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క డ్రైవర్ బ్రేకింగ్ చేస్తున్నప్పుడు ట్రక్కులోని ఎలక్ట్రిక్ మోటారు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఉత్పత్తి చేయబడిన శక్తి డంపర్లోని బ్యాటరీలో నిల్వ చేయబడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క ఇ-డంపర్ యొక్క బ్యాటరీ వ్యవస్థ 4.5 టన్నుల బరువును కలిగి ఉంది. ఇది 7 టెస్లా ఎస్ కార్ల నిల్వ సామర్థ్యంతో సమానంగా ఉంటుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనం : దీనికి ఛార్జింగ్ అవసరమే లేదు

ఎలక్ట్రో డంపర్ ప్రతి సంవత్సరం 130 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలోకి రాకుండా సహాయపడుతుంది. మరియు ప్రతి సంవత్సరం 1,00,000 టన్నుల డీజిల్ వాడకాన్ని నిరోధిస్తుంది. ప్రస్తుతం, స్విట్జర్లాండ్‌లోని బీల్ సమీపంలో ఉన్న ఒక గని వద్ద ఈ ఎలక్ట్రిక్ ట్రక్కుని ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
This is world's largest electric vehicle that needs no charging. Read in Telugu.
Story first published: Thursday, February 27, 2020, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X