Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 5 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 5 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 7 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా కార్లపై రూ.2.5 లక్షల వరకూ డిస్కౌంట్స్; ఇయర్ ఎండ్ ఆఫర్స్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2020 సంవత్సరం ముగింపును పురస్కరించుకొని ఈ డిసెంబర్ నెలలో తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. హోండా బ్రాండ్ లైనప్‌లోని అమేజ్, ఐదవ-తరం హోండా సిటీ, డబ్ల్యూఆర్-వి, జాజ్ మరియు సివిక్ మోడళ్లపై కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది.

అంతేకాకుండా, హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్, అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మరియు డబ్ల్యూఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లపై కూడా కంపెనీ ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తోంది. కస్టమర్ ఎంచుకున్న మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా ఈ డిసెంబర్ నెలలో గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. మోడల్ వారీగా హోండా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

దేశీయ విపణిలో హోండా అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ హోండా అమేజ్‌పై కంపెనీ రూ.37,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. వీటికి అదనంగా, కస్టమర్లు నాల్గవ మరియు ఐదవ సంవత్సరానికి గాను రూ.12,000 విలువైన పొడిగించిన (ఎక్స్టెండెడ్) వారంటీ ప్యాకేజీని కూడా పొందవచ్చు.
MOST READ:ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్ టచ్ పాయింట్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా.. ఎక్కడో తెలుసా?

అలాగే, అమేజ్ స్పెషల్ ఎడిషన్‌పై రూ.15,000 తగ్గింపును ఇస్తున్నారు, ఇందులో రూ.7,000 క్యాష్ బెనిఫిట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఇకపోతే, హోండా అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌పై మొత్తం రూ.27,000 ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో రూ.12,000 నగదు తగ్గింపు మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్‌పై కంపెనీ డిసెంబర్ 2020 నెలలో గరిష్టంగా రూ.40,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు బోనస్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

హోండా అందిస్తున్న కాంపాక్ట్-ఎస్యూవీ డబ్ల్యుఆర్-వి మోడల్‌పై కంపెనీ గరిష్టంగా రూ.40,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. అలాగే, హోండా డబ్ల్యుఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌పై కంపెనీ రూ.10,000 నగదు తగ్గింపు మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.

హోండా కార్స్ ఇండియా, ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఐదవ తరం సిటీ సెడాన్‌పై కేవలం ఎక్సేంజ్ బోనస్ ఆఫర్‌ను మాత్రమే అందిస్తోంది. ఈ మోడల్‌పై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్స్ కానీ వేరే ఇతర ప్రయోజనాలు కానీ లేవు. ఈ కొత్త సిటీ కారు కోసం తమ పాత కారును ఎక్సేంజ్ చేసుకునే కస్టమర్లు కంపెనీ అదనంగా రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.
MOST READ:ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 160 ; ఇంతకీ ఈ పెట్రోల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ?

హోండా అందిస్తున్న ప్రీమియం సెడాన్ సివిక్‌పై కంపెనీ అత్యధిక నగదు తగ్గింపును అందిస్తోంది. హోండా సివిక్ డీజిల్ మోడల్‌పై కంపెనీ గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. పెట్రోల్‌తో నడిచే సివిక్ మోడల్రై రూ.1 లక్ష వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2020 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి.

మార్కెట్లో హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.7.00 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటే, డబ్ల్యుఆర్-వి స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.969 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు డీజిల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు స్టాండర్డ్ మోడళ్ల కన్నా మరిన్ని అధనపు ఫీచర్లను కలిగి ఉంటాయి.
MOST READ:నవంబర్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్, చూసారా !

గడచిన నెలలో కూడా హోండా ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. ఆ సమయంలో కంపెనీ ఆఫర్లు చక్కగా పనిచేశాయి, ఫలితంగా హోండా గడచిన నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. నవంబర్ 2020 నెలలో హోండా అమ్మకాలు 55 శాతం పెరిగి, 9,990 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో హోండా 6,459 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

హోండా కార్లపై అందిస్తున్న డిసెంబర్ నెల ఆఫర్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశంలో ఫెస్టివ్ సీజన్ ముగిసినప్పటికీ, ఆ జోరును అలానే కొనసాగించేందుకు మరియు అమ్మకాల లక్ష్యాలను చేరుకునేందుకు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ డిసెంబర్ నెలలో తమ ప్రోడక్ట్ లైనప్‌లో సిఆర్-వి మరియు పాత తరం సిటీ సెడాన్ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై తగ్గింపులను అందిస్తోంది. మంచి డీల్‌లో హోండా కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు.