స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

స్కొడా ఆటో భారత మార్కెట్లో తమ 'ప్రాజెక్ట్ 2.0'లో భాగంగా రానున్న రోజుల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, కంపెనీ ఇప్పటికే మూడు కొత్త పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. అయితే, ఈ మూడు పేర్లను భవిష్యత్తులో స్కొడా భారత్‌లో విక్రయించబోయే ఎస్‌యూవీ మోడళ్ల కోసం రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

కాగా తాజా సమాచారం ప్రకారం, స్కొడా విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్ స్థానంలో కంపెనీ వచ్చే ఏడాదిలో ఓ సరికొత్త సెడాన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు.

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

కొత్త సంవత్సరంలో కొత్త ర్యాపిడ్ సెడాన్ వస్తుందా అని సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు, స్కొడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ సమాధానమిస్తూ.. భారత్ కోసం కొత్త ర్యాపిడ్‌ను తీసుకురాబోమని, వచ్చే సంవత్సరం చివరి నాటికి ఓ సరికొత్త సెడాన్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

అంతేకాకుండా, ఈ కొత్త సెడాన్‌ను బ్రాండ్ యొక్క ఎమ్‌క్యూబి ఏఓ ఇన్ (MQB AO IN) ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుందా అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు హోలిస్ సమాధానమిస్తూ, ఈ కొత్త సెడాన్‌ను కేవలం టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లతోనే విడుదల చేస్తామని, ఇవి మరింత సమర్థవంతమైనవి మరియు శక్తివంతమైనవని చెప్పారు.

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

స్కొడా ఆటో ఇటీవలే ‘స్లావియా' అనే మరో కొత్త పేరును కూడా ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసింది. ఈ పేరును గమనిస్తుంటే, ఇదే కొత్తగా రాబోయే స్కొడా ర్యాపిడ్ రీప్లేస్‌మెంట్ సెడాన్‌గా తెలుస్తోంది. కొత్త స్కొడా ‘స్లావియా' సెడాన్‌ను ఏఎన్‌బి (ANB) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు.

MOST READ:నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

డిస్‌కంటిన్యూ కాబోయే స్కొడా ర్యాపిడ్ సెడాన్‌తో పోల్చుకుంటే, కొత్త స్కొడా సెడాన్‌లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అనేక మార్పులు ఉండే అవకాశం ఉంది. స్కొడా కొత్త డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ కొత్త స్లావియా సెడాన్ మునుపటి కన్నా మరింత ప్రీమియంగా, స్టైలిష్‌గా ఉండనుంది.

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

ఇంజన్ పరంగా చూసుకుంటే, ఈ కొత్త స్కొడా సెడాన్‌లో కూడా ప్రస్తుతం ర్యాపిడ్‌లో ఉపయోగిస్తున్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తనే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ లేదా ఆప్షనల్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించే అవకాశం ఉంది.

MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

స్కొడా ఆటో ప్రస్తుతం భారత మార్కెట్లో ర్యాపిడ్, ఆక్టావియా, సూపర్బ్ అనే మూడు సెడాన్ మోడళ్లను మరియు కరోక్ అనే ఎస్‌యూవీని విక్రయిస్తోంది. కాగా, కంపెనీ ఇటీవలే కోస్మిక్, కార్మిక్ మరియు కుషాక్ అనే మూడు పేర్లను ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసింది. ఈ మోడు పేర్లు ఎస్‌యూవీ మోడళ్లను తలపించేలా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో స్కొడా ఆటో నుండి విజన్ ఇన్ అనే ఎస్‌యూవీ కూడా విడుదల కానుంది.

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

స్కొడా ర్యాపిడ్ రైడర్ వేరియంట్ డిస్‌కంటిన్యూ

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఇందులో విక్రయిస్తున్న 'రైడర్' వేరియంట్‌ను నిలిపివేసింది. ఇప్పటి వరకూ బేస్ వేరియంట్‌గా అందుబాటులో ఉన్న స్కొడా ర్యాపిడ్ రైడర్ ఇకపై మార్కెట్ నుండి తొలగిపోయింది.

MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

స్కొడా ర్యాపిడ్ డిస్‌కంటిన్యూ; దాని స్థానంలో మరో కొత్త సెడాన్!?

ఇదివరకు మార్కెట్లో బేస్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్ ధర రూ.7.49 లక్షలు (రైడర్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేది. కాగా ఇప్పుడు కొత్త బేస్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (రైడర్ ప్లస్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Zac Hollis Confirms New Skoda Sedan Launch In 2021 To Replace Rapid. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X