ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా, దాదాపు ఏడాది కాలం పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తికి ముందు ప్రజా జీవనం సాధారణంగా ఉండేది. ఎవరి పనులు వారు చూసుకుంటూ బిజీగా కాలం గడిచిపోయేది. అలాగే, ఔటింగ్ పట్ల ఆసక్తి ఉన్న వారు తమ వాహనాల్లో క్యాంపింగ్‌లకు కూడా వెళ్తుండే వారు.

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

అయితే, మనదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. ఈ పరిస్థితులు ఇలా ఎంత కాలం కొనసాగుతాయో కూడా తెలియకుండా పోతోంది. కానీ, విదేశాల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అక్కడి ప్రజలు తిరిగి తమ వారాంతపు జీవన విధానాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

తమ వారాంతాలను (వీకెండ్స్‌ను) హాయిగా ప్రకృతి ఒడిలో గడిపేందుకు మోటార్ హోమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ మోటార్ హోమ్‌లలో ఒక కుటుంబం కొద్దిరోజుల పాటు హాయిగా బ్రతకడానికి కావల్సిన అన్ని వసతులు ఉంటాయి. నిజానికి ఇవి ఇంటిని కూడా మరపిస్తాయి. ఇందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి మరి.

MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఈ మోటార్ హోమ్‌లు వివిధ రూపాల్లో లభిస్తుంటాయి. అయితే, ఇప్పుడు ఈ కథనంలో మనం చెప్పుకోబోయేది మాత్రం ఓ విశిష్టమైన మోటార్ హోమ్ గురించి. ఈ ఫొటోలలో కనిపిస్తున్న మోటార్ హోమ్‌ను 1969 ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారును ఉపయోగించి తయారు చేశారు. అప్పట్లో ఈ కారును పీపుల్స్ కార్ అని పిలిచేవారు.

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఈ 1969 ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు ముందు హుడ్ భాగం వరకు యధావిధిగా ఉంచి, మిగిలిన భాగాన్ని మొత్తం పూర్తిగా కస్టమైజ్ చేసి మోటార్ హోమ్‌లా మార్చారు. అంతేకాదు, ఈ వాహనానికి ఫోక్స్‌వ్యాగన్ సూపర్ ప్యాకర్ క్యాంపర్ అనే పేరును కూడా పెట్టారు.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ప్రస్తుతం ఈ మోటార్ హోమ్ వేలానికి వచ్చింది. మక్ మహోన్ లో జరిగిన ఆన్‌లైన్ వేలంలో ఈ కారును విక్రయించారు. వేలంలో ఈ మోటార్ హోమ్ గరిష్టంగా 19,800 డాలర్ల వెల పలికింది. అంటే, మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.5 లక్షలు.

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఈ మోటార్ హోమ్‌ను కాలిఫోర్నియాకు చెందిన ఒక సంస్థ 1977లో బీటిల్ కారు యజమాని కోరిక ప్రకారం నిర్మించింది. అందుకే, ఈ ఇంటి లోపలి భాగం అంతా 1970 మరియు 1980 ల స్టైల్‌లో ఉంటుంది.

MOST READ:ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

మోటార్ హోమ్ గోడలను తేలికపాటి చెక్క పలకలతో తయారుచేయబడ్డాయి. పైకప్పులో వెంటిలేషన్ కోసం కొన్ని కిటికీలు కూడా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఈ మోటారు హోమ్‌లో లోపల హాయిగా ఉండగలరు. లోపలి భాగంలో గ్యాస్ స్టవ్ సదుపాయం కూడా ఉంటుంది.

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఇది పురాతన వాహనం కాబట్టి ఇందులో అధునాతన సౌకర్యాలేమీ లేవు. చరిత్రకు సాక్ష్యంగా ఉండే ఈ మోటార్ హోమ్ ఒక కలెక్టర్ ఐటెం మాత్రమే. ఇందులో వినోదం కోసం కేవలం ఎఫ్ఎమ్ రేడియో మాత్రమే ఉంటుంది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఈ కారులో ఇప్పటికే అదే పాత ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఆ సమయంలో ఫోక్స్‌వ్యాగన్ తమ బీటెల్ కార్లలో ఉపయోగించిన 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ మోటార్ హోమ్ నడుస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు వెనుక భాగంలో చేసిన సవరణల కారణంగా పెరిగిన అదనపు బరువుకు అనుగుణంగా, దీని సస్పెన్షన్ సెటప్‌ను మరియు వెనుక టైర్లను కూడా అప్‌గ్రేడ్ చేశారు. మరి ఈ మోటార్ హోమ్ మీకు నచ్చిందా? కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.

చిత్ర సౌజన్యం: Mecum.com

Most Read Articles

English summary
Make Your Camping More Exciting With This $19,800 Converted 1969 VW Beetle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X