దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

భారతీయ మార్కెట్లో Force Motors తన కొత్త బిఎస్ 6 Force Gurkha ను 2021 సెప్టెంబర్ 27 న అధికారికంగా విడుదలచేయనుంది. అయితే కంపెనీ Force Gurkha ను విడుదల చేయకముందే దీనికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించింది. వెల్లడించిన సమాచారం ప్రకారం Gurkha యొక్క ఫీచర్స్ మరియు పరికరాల వంటి విషయాలపై కొంత అవగాహన ఏర్పడింది. అయితే తాజాగా కంపెనీ మరిన్ని ఫోటోలను వెల్లడించింది.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

భారతీయ మార్కెట్లో Force Gurkha పై ఉన్న అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఆఫ్ రోడ్ ప్రేమికుల ఈ SUV కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న Force Gurkha ఆరంజ్ కలర్ లో ఉంది. ఇది 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన Gurkha లాగా ఉంది.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

2021 Force Gurkha యొక్క బాడీ షెల్ కొత్తగా ఉంది, కానీ ఇది పాత మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే ఈ కొత్త Force Gurkha ను మరింత అప్డేటెడ్ గా గుర్తించడానికి అనేక కాస్మెటిక్ అప్డేట్స్ చేసింది. ఇందులో భాగంగానే ఫ్రంట్ గ్రిల్ రీడిజైన్ చేయబడింది, అంతే కాకుండా ఫోర్స్ లోగోకు బదులుగా గుర్ఖా పేరు వ్రాయబడింది.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

ఇది మాత్రమే కాకుండా, ఇందులో ఫాగ్ లైట్లు, రూఫ్ క్యారియర్, చంకీ వీల్ క్లాడింగ్ మరియు బ్లాక్ ORVM లతో సింగిల్ స్లేట్ గ్రిల్ కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా కంపెనీ ఈనికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో కూడా Force Gurkha లోని ఫీచర్స్ మరియు పరికరాలను గమనించవచ్చు.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

Gurkha యొక్క సైడ్ ప్రొఫైల్ 16 ఇంచెస్ స్టీల్ వీల్స్, బ్లాక్ ORVM లు, బ్లాక్ రూఫ్ రైల్స్, ఫంక్షనల్ రాక్‌లు మరియు టర్న్ ఇండికేటర్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 4x4x4 బ్యాడ్జింగ్ కూడా చూడవచ్చు. ఇవి వాహనాన్ని చాలా దూకుడుగా చూపిస్తాయి. ఇక కొత్త 2021 Gurkha యొక్క రియర్ ఫ్రొఫైల్ విషయానికి వస్తే, వెనుక భాగంలో విండోస్ పెద్దవిగా ఉంటాయి.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

2021 Force Gurkha యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్‌ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది. లోపల మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్‌తో బ్లాక్ క్యాబిన్‌ను పొందుతుంది, అంతే కాకుండా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

Force Motors ఇప్పుడు మహీంద్రా థార్ లాగే రెండవ వరుస సీట్లకు కొత్త డిజైన్ ఇచ్చింది. దీనిలో ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ రియర్ సీట్లు ఉపయోగించబడ్డాయి. ఇది కాకుండా, A- పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ రైల్స్, ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్, రౌండ్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి అప్‌డేట్ ఫీచర్లు ఇంటీరియర్‌లో చేర్చబడ్డాయి.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

Force Gurkha కొలతల విషయానికి వస్తే, ఇది 4,116 మి.మీ పొడవు, 1,812 మి.మీ వెడల్పు, 2,075 మి.మీ ఎత్తు, 2,400 మి.మీ వీల్‌బేస్ మరియు 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. కావున ఆఫ్ రోడింగ్ చేయడానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

2021 Force Gurkha యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉండే, 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ అనుసంధానించబడింది. ఇందులోని ఇంజిన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

2021 Gurkha లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఏబీఎస్ విత్ ఈబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహనదారుని భద్రతను నిర్ధరిస్తాయి.

దుమ్మురేపుతున్న Force Gurkha కొత్త ఫోటోలు.. మీరు చూసారా..!!

Force Motors ఇటీవల Force Gurkha యొక్క యాక్ససరీస్ కూడా వెల్లడించింది. ఇందులో విండ్‌స్క్రీన్ బార్, రూఫ్ క్యారియర్, రూప్ రైల్స్, వెనుక నిచ్చెన (రియర్ ల్యాడర్), టెయిల్ ల్యాంప్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ మరియు ఆల్-టెర్రైన్ టైర్లు రెండు అడిషినల్ ఛైల్డ్ సీట్స్ ఉన్నాయి. Force Gurkha యొక్క యాక్ససరీస్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
2021 force gurkha new official images revealed launch soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X