2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

ప్రముఖ అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ (Ford) తన రేంజర్ పిక్-అప్ ట్రక్ (Ranger Pick-Up Truck) యొక్క లేటెస్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త 2022 ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్ అప్‌డేటెడ్ డిజైన్, రివైజ్డ్ క్యాబిన్ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది కొత్త టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ కొత్త పిక్ అప్ ట్రక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది నాటికి 2022 రేంజర్‌ను ఇప్పటికే ఉన్న అన్ని మార్కెట్‌లలో విక్రయించడం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ కంపెనీ ఇప్పటికే భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. కావున ఈ కొత్త 2022 ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్ కొనుగోలు చేసేవారికి ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి అవుతుంది. అయితే ఇది భారతదేశంలో ప్రారంభించే అవకాశం లేదనే భావిస్తున్నాము.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

కొత్త 2022 ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్ ఇప్పుడు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు ముఖం చాలా బోల్డ్‌గా ఉంచబడింది. ఇది పెద్ద రేడియేటర్ గ్రిల్ మరియు సి-ఆకారపు LED DRL లు కలిగి చాలా దూకుడుగా ఉంటుంది. కావున చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

అంతే కాకుండా ఇందులో ఇన్‌స్టాల్ చేయబడిన సిల్వర్ స్కిడ్ ప్లేట్ 2022 ఫోర్డ్ రేంజర్ యొక్క మొత్తం ఆకర్షణను పెంచుతుంది. ఫాగ్ ల్యాంప్ కోసం హౌసింగ్ హుక్ వంటి బ్లాక్ థీమ్‌లో ఉంచబడుతుంది. బోనెట్ బోల్డ్ క్రీజ్‌లను కలిగి ఉంది, ఇది రేంజర్ యొక్క కొత్త ముఖంతో బాగా సరిపోతుంది. 2022 ఫోర్డ్ రేంజర్ వెడల్పు కూడా మునుపటికంటే కూడా 50 మిమీ పెరిగింది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

ఫోర్డ్ రేంజర్ సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, వీల్ ఆర్చ్‌లు ఇప్పుడు పైకి విస్తరించబడ్డాయి. రియర్ టెయిల్‌గేట్ కూడా సవరించబడింది మరియు "రేంజర్" బ్యాడ్జింగ్ కూడా ఇవ్వబడింది. మీరు దీనిని ఇందులో గమనించవచ్చు. వెనుక బంపర్ సులభంగా యాక్సెస్ కోసం ఇంటిగ్రేటెడ్ దశలను కలిగి ఉంది. పాత మోడల్ మాదిరిగానే, కొత్త ఫోర్డ్ రేంజర్ మల్టిపుల్ క్యాబిన్ మరియు బెడ్ పొడవు ఎంపికలలో విక్రయించబడుతుంది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

ఫోర్డ్ కొత్త రేంజర్ కోసం దాదాపు 600 అధికారిక యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో, కంపెనీ తన ఇంటీరియర్‌లో కూడా విస్తృతమైన మార్పులు చేసింది. మొత్తం డ్యాష్‌బోర్డ్ కొత్తది మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కూడా ఇప్పుడు 12 ఇంచెస్ పరిమాణంలో ఉంటుంది. అయితే, ఇందులోని లో వేరియంట్‌లలో 10 ఇంచెస్ చిన్న ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అవుట్‌గోయింగ్ రేంజ్ యొక్క రాప్టార్ వేరియంట్ వంటి ఆల్-డిజిటల్ యూనిట్‌తో వస్తుంది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

కొత్త 2022 ఫోర్డ్ రేంజర్ పిక్-అప్ ట్రక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది వివిధ పవర్ అవుట్‌పుట్‌ల కోసం సింగిల్ మరియు డబుల్ టర్బోచార్జర్‌లతో అందించబడుతుంది. ఇది కాకుండా, 3.0-లీటర్ V6 డీజిల్ అందించబడుతుంది. ఇది 210 బిహెచ్‌పి పవర్‌ మరియు 498 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని 2.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపిక చేసిన మార్కెట్లలో కూడా అందుబాటులోకి వస్తుంది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

Ford Ecosport రీకాల్

ఫోర్డ్ కంపెనీ భారతదేశం నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ, తమ ప్రస్తుత కస్టమర్లకు కావల్సిన అన్ని రకాల సేవలను అందించడం కొనసాగిస్తూనే ఉంటామని ఇంతకు ముందే హామీ ఇచ్చింది. ఫోర్డ్ హామీ ఇచ్చినట్లుగానే ఇప్పుడు, తమ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓ సర్వీస్ రీకాల్ గురించి సమాచారాన్ని పంపిస్తోంది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయించిన్న ఎకోస్పోర్ట్ డీజిల్ మోడళ్లలో తలెత్తిన డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్యల కారణంగా కంపెనీ వీటిని సైలెంట్ గా రీకాల్ చేస్తోంది. కంపెనీ ఈ రీకాల్ గురించి బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ, తమ కస్టమర్లకు ప్రత్యేకంగా సందేశాలు పంపిస్తోంది.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

ఈ నేపథ్యంలో, ఫోర్డ్ డీలర్‌షిప్ ఓ కస్టమర్ కు పంపిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఫోర్డ్ భారతదేశం నుండి వెళ్లిపోతున్నప్పటికీ, తమ కస్టమర్లను మాత్రం విస్మరించదని ఈ లేఖ చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, బిఎస్ 6 డీజిల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కలిగి ఉన్న వాహన యజమానులు తమ కార్లతో Diesel Particulate Filter (DPF) వలన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

2022 Ranger Pick-Up Truck ఆవిష్కరించిన Ford: వివరాలు

ఫోర్డ్ ఇండియా మాత్రం ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మరియు ఈ నివేదికలను అంగీకరించనూ లేదు. అయితే, ఫోర్డ్ ఇప్పుడు ఎట్టకేలకు డిపిఎఫ్ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది, అందుకో స్వచ్ఛందంగా వాహనాలను రీకాల్ చేస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
2022 ford ranger pick up truck unveiled for global market details
Story first published: Thursday, November 25, 2021, 19:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X