ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లో మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి ఎంతగానో ప్రజాదరణ పొందింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు తన న్యూ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీని టయోటా ఈ నెల 9 న ఆవిష్కరించనుంది.

ఈ కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

టయోటా ఇటీవల తన తన ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ వివరాలను కొత్త టీజర్ వీడియోతో విడుదలచేసింది. ఈ న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి భారతీయ తీరాలకు చేరుకుంటుంది.

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

త్వరలో రానున్న ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ ఇటీవల వెల్లడించినట్లుగా, దక్షిణాఫ్రికా మార్కెట్లో జిఎక్స్-ఆర్, జిఆర్-ఎస్ మరియు జెడ్‌ఎక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

MOST READ:ఇల్లు వదిలి కరోనా బాధితులకు సర్వీస్ చేస్తున్న ఐటీ ఉద్యోగి

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

కొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలో టార్క్-సెన్సింగ్ లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్‌తో రేంజ్-టాపింగ్ జెడ్‌ఎక్స్ ఉంటుంది. జిఎక్స్-ఆర్ మరియు జెడ్‌ఎక్స్ వేరియంట్ల రెండింటి ముందు మరియు వెనుక యాక్సెల్ పై ఫ్రంట్ లింక్ సస్పెన్షన్ కలిగి ఉంటాయి. ఈ మూడు వేరియంట్లలో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన జిఎక్స్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. కానీ జీఆర్-ఎస్, జెడ్‌ఎక్స్ వేరియంట్లు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి.

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలో 3.3 లీటర్ వి 6 టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇక పెట్రోల్ వేరియంట్లలో 3.5 లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇవి మంచి సామర్థ్యాన్ని అందిస్తూ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

కొత్త 3-లీటర్ వి 6 డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 302 బిహెచ్‌పి శక్తిని, 1,600 నుంచి 2,600 ఆర్‌పిఎమ్ మధ్య 700 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదే విధంగా 3.5-లీటర్ వి 6 పెట్రోల్ ఇంజన్ 5,400 ఆర్‌పిఎమ్ వద్ద 409 బిహెచ్‌పి శక్తిని, 2,000 నుంచి 3,600 ఆర్‌పిఎమ్ మధ్య 650 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

కొత్త 2.8 లీటర్ 4-సిలిండర్ రైల్ డీజిల్ ఇంజన్ ఎంపిక ఎంచుకున్న గ్లోబల్ మార్కెట్లలో లభిస్తుంది. ఈ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీలో 18 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. అయితే టాప్-ఎండ్ జెడ్‌ఎక్స్‌లో మాత్రం ప్రత్యేకంగా 20 ఇంచెస్ వీల్స్ అందుబాటులో ఉంటాయి.

MOST READ:సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

ఈ కొత్త ఎస్‌యూవీలో సైడ్ స్టెప్స్ మరియు కిక్-సెన్సార్‌తో టెయిల్‌గేట్‌తో వంటివి అందించబడుతుంది. అంతే కాకుండా ఇందులో 3 డి మల్టీ-టెర్రైన్ మానిటర్‌లో డ్యూయల్ 11.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. దీనితో పాటు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కోసం 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, ఫోర్ స్టేజ్ క్లయింట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా మరియు ఇతర అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ 10 కలర్ అప్సన్లలో లభిస్తుంది. అవి గ్లేసియర్ వైట్, పెర్ల్ వైట్ మెటాలిక్, క్లాసిక్ వైట్, శాటిన్ సిల్వర్ మెటాలిక్, గ్రాఫైట్ గ్రే మెటాలిక్, రూబీ మెటాలిక్, బ్లాక్, యాటిట్యూడ్ బ్లాక్, అవంటే-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, మరియు మూన్‌లైట్ ఓషన్ మెటాలిక్.

MOST READ:ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లనున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కార్, ఇదే

ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ ప్రారంభించిన తర్వాత, ల్యాండ్ క్రూయిజర్ 300 రేంజ్ రోవర్ మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
New Toyota Land Cruiser To Make Its Global Debut On June 9th. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X