లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

భారత మార్కెట్లో అనేక లగ్జరీ కార్లు వాడుకలో ఉన్నాయి. కానీ ఈ సూపర్ కార్లు ఎక్కువ భాగం బాగా డబ్బున్న ధనవంతులు, పారిశ్రామికవేత్తలు మరియు సినీ ప్రముఖులు కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఈ కార్లు అత్యధిక ధర కలిగి ఉండటమే. అయితే చాలామంది సాధారణ ప్రజలు కూడా ఇలాంటి వాటిని ఉపయోగించాలని కళలు కంటూ ఉంటారు. కానీ ఈ కలలు కొంతమందికి నిజమవుతాయి, మరికొంత మందికి కలలుగానే మిగిలిపోతాయి.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఇదిలా ఉంటే కొంతమంది యువకులు తమ కళలు నిజం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విజయం సాధిస్తుంటారు. ఇలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

నివేదికల ప్రకారం అస్సాంలోని కరీమ్‌గంజ్ జిల్లాకు చెందిన ఒక మోటర్ మెకానిక్ తనకు అందుబాటులో ఉండే పరిమిత స్థానిక వనరులను ఉపయోగించి సాధారణ కారుని ఒక లగ్జరీ కారును అభివృద్ధి చేశారు. అస్సాంలోని కరీమ్‌గంజ్ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన మోటారు మెకానిక్ నురుల్ హక్, తన పాత మారుతి స్విఫ్ట్ కారును ఇటాలియన్ లగ్జరీ కారు లంబోర్ఘిని మోడల్‌గా కనిపించే స్పోర్ట్స్ కారుగా మార్చారు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

30 ఏళ్ల వయసున్న నురుల్ హక్ తన ప్రాజెక్ట్ కోసం రూ. 6.2 లక్షలు ఖర్చు చేశానని, లంబోర్ఘిని వంటి స్పోర్ట్స్ కారులో ప్రయాణించడం తనకు చాలా ఇష్టమని, ఈ కారణంగానే ఇన్ త డబ్బు ఖర్చు చేసి మారుతి స్విఫ్ట్ కారుని లంబోర్ఘిని సూపర్ కార్ గా మార్చుకున్నట్లు అతడు తెలిపాడు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

వృత్తిరీత్యా నురుల్ హక్ మోటారు మెకానిక్, అంతే కాకుండా ఆ ప్రాంతంలో గ్యారేజ్, ఎన్ మారుతి కార్ కేర్ కలిగి ఉన్నాడు. కోవిడ్-19 లాక్ డౌన్ యొక్క మొదటి దశలో అతనికి పని లేకుండా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ఈ సమయంలో తన పాత మారుతి స్విఫ్ట్ కారు యొక్క ఇంజిన్ను అనుకూలీకరించడం ద్వారా ఇటాలియన్ లగ్జరీ కార్ మోడల్ యొక్క తన స్వంత వెర్షన్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ విధంగా అనుకున్న తరువాత ఏకంగా ఎనిమిది నెలలు కృషి చేసి, దీనిని పూర్తి చేసాడు. దీనికి మొత్తం అయినా ఖర్చు రూ. 6.2 లక్షలు అని అతడు తెలిపాడు. అతడు మాడిఫై చేసిన ఈ లంబోర్ఘిని కారుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ ఫోటోలు చూసిన చాలామంది నురుల్ హక్ ని ప్రశంసించారు, అంతే అతని గ్యారేజ్ కి వెళ్లి ఈ మాడిఫైడ్ లాంబోర్గినితో ఫొటోలో తీసుకున్నారు. ఇది చూడటానికి లంబోర్ఘిని మాదిరిగానే తయారుచేశారు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఫెరారీకి ప్రతిరూపం చేయాలన్నది తన తదుపరి కోరిక అని, మరో లగ్జరీ స్పోర్ట్స్ కారుకు అనుకూలీకరించిన ప్రతిరూపాన్ని తయారు చేయాలని యోచిస్తున్నానని నూరుల్ హక్ చెప్పారు.

అయితే ప్రస్తుతం ఈ మాడిఫైడ్ కారు చట్టబద్ధమైనదా.. కాదా అని ఖచ్చితంగా తెలియదు. కానీ ఇది చట్టవిరుద్ధం కాదని నేను నమ్ముతున్నాను, కావున పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఇప్పటికే నురుల్ హక్ తన కారుని రాష్ట్రవ్యాప్తంగా నడిపించాలని స్థానిక పరిపాలనకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం ఇంకా అనుమతి జారీ చేయలేదని వారు తెలిపారు. ఈ కారుని అమ్మకానికి కూడా ఉంచనున్నట్లు అతడు తెలిపాడు. కానీ ఈ కారు కొనేవారు తప్పకుండా స్పోర్ట్స్ కారు అభిమాని అయి ఉండాలి, అలాంటి స్పోర్ట్స్ కార్ల ప్రేమికులకు అమ్మాలనుకుంటున్నానని చెప్పారు.

లంబోర్ఘిని సూపర్ కారుగా మారిన పాత మారుతి స్విఫ్ట్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ కారును నడపడానికి స్థానిక పరిపాలన అనుమతిస్తే, నేను ఇటువంటి మోడళ్లను మరిన్ని తయారు చేస్తాను అన్నారు. తరువాత కాలంలో నేను మరో సూపర్ కార్ అయిన ఫెరారీ కొత్త మోడల్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు నూరుల్ హక్ చెప్పారు.

Image Courtesy: OK North East/Facebook

Most Read Articles

English summary
Old Maruti Swift Turn To Lamborghini Car. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X