జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

సాధారణంగా సినీ రంగంలో ఉన్న వారికి ఖరీదైన అత్యంత విలాసవంతమైన కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది హీరోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ కి సరిపోయే విధంగా వారి వాహనాలను మారుస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ముందుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే చాలా ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు. ఇప్పుడు మరో ఖరీదైన కార్ త్వరలో రానుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

తెలుగు సినీ రంగంలో అత్యంత క్రేజున్న మరియు అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ట్రిపుల్ ఆర్ (RRR) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం ఎంతోమంది అభిమానులు వేచి చూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కార్ కొంటున్నట్లు సమాచారం. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉరుసు కారును బుక్ చేసుకున్నారు, అంతే కాదు ఇది త్వరలో ఇటలీ నుంచి దిగుమతి కూడా చేసుకోబడుతుంది.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేస్తున్న ఈ లంబోర్ఘిని ఉరుస్ సూపర్ కార్ ధర దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యంత విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి ఇండియాకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం త్వరలోనే చేరుకుంటుంది. ఇది సూపర్ స్పోర్ట్స్ కార్. ఈ కారు కేవలం రోడ్ల మీద మాత్రమే కాకుండా ఎడారి వంటి ప్రాంతాలలో కూడా డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

లంబోర్ఘిని ఉరుస్ సూపర్ కార్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మంచి క్వాలిటీ ఇంటీయర్స్ కలిగి ఉంటుంది, అంతే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఉరుస్ కారు అత్యధిక ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది సెలబ్రెటీలు వినియోగిస్తారు.

ఈ ఉరుస్ కారులో 4.0 లీటర్, 8-సిలిండర్ ట్విన్-టర్బో వి 8 ఇంజన్ ఉంది, ఇది 641 బిహెచ్‌పి శక్తితో గరిష్టంగా 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ లంబోర్ఘిని యొక్క ఇంజిన్లలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

ఇప్పటిదాకా తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఖరీదైన లగ్జరీ కార్ వినియోగిస్తున్న వాడిగా ప్రభాస్ పేరు ఉండేది. ప్రభాస్ ఉపయోగించే కార్ దాదాపు 4 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఇప్పుడు అత్యధిక ఖరీదైన కార్ ఉపయోగించే స్టార్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు.

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలుగులో అత్యంత ఆదరణ పొందిన టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడులో కూడా హోస్ట్ చేసేందుకు సైన్ చేశాడు. తెలుగు సినీరంగంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న అతి తక్కువ హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

Source:Deccanchronicle

Most Read Articles

English summary
Jr NTR Buys A Lamborghini Urus Car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X