కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా (Toyota) అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న టండ్రా (Tundra) పికప్ ట్రక్ లో ఓ అధునాతన వెర్షన్‌ ను ఆవిష్కరించింది. కొత్త 2022 టొయోటా టండ్రా (2022 Toyota Tundra) పికప్ ట్రక్ ఈ ఏడాది చివరి నాటికి అమ్మకానికి రానుంది. దాని తర్వాత కంపెనీ ఇందులో ఓ హైబ్రిడ్ వెర్షన్ ను కూడా విడుదల చేయనుంది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ పూర్తిగా సరికొత్త పవర్‌ట్రెయిన్ (ఇంజన్) తో అధికారికంగా ప్రారంభమైంది. ఇంకా ఇందులో కొత్త ప్లాట్‌ఫామ్ మరియు కొత్త సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది. దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కూడా భారీ మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతో ఈ పిక్ ట్రక్కును రూపొందించారు.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

ఈ అధునాతన 2022 టండ్రా పికప్ ట్రక్ ఎస్ఆర్, ఎస్ఆర్5, లిమిటెడ్, ప్లాటినం, 1794 మరియు టిఆర్‌డి ప్రో అనే ట్రిమ్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ పికట్ ట్రక్కు ఉత్పత్తి నవంబర్‌ 2021లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ వాహనాన్ని అమెరికాలోని టెక్సాస్ స్టేట్ లో ఉన్న శాన్ ఆంటోనియో నగరంలోని టొయోటా ప్లాంట్ ఉత్పత్తి చేయనున్నారు.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

మెరుగైన సౌకర్యం కోసం కంపెనీ ఈ 2020 Tundra పికప్ ట్రక్కు వెనుక భాగంలో స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్‌ ను జోడించింది, ఇది గరిష్టంగా 880 కిలోల బాక్స్ లోడ్ సామర్థ్యాన్ని అనుమతిస్తుంది. ఇందులోని మరికొన్ని ట్రిమ్‌ లు వివిధ రకాలుగా సర్దుబాటు చేయగల మోడ్‌ లతో కూడిన రియర్ ఎయిర్ సస్పెన్షన్‌ సెటప్ తో కూడా వస్తాయి. వీటిని పేలోడ్ కి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ను రూపొందించిన కొత్త ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ అంతర్గతంగా F1 అని సూచిస్తారు. ఇది అధిక బలమైన నిర్మాణం కలిగిన బాక్స్ టైప్, స్టీల్-లాడర్ ప్లాట్‌ఫామ్ మరియు ఇది వాహనం యొక్క మొత్తం బరువును తగ్గించడానికి ఎక్కువ భాగం అల్యూమినియంతో తయారై ఉంటుంది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

ఈ కొత్త తరం 2022 Tundra యొక్క దృఢత్వం మరియు ఆఫ్-రోడ్ సామర్ధ్యం మునుపటి మోడల్ కంటే ఇప్పుడు గణనీయంగా మెరుగుపరచినట్లు Toyota పేర్కొంది. ఇంజన్ పరంగా కూడా ఈ కొత్త పికప్ లో భారీ మార్పు వచ్చింది. టొయోటా ఇందులో మునుపటి మోడల్ కు శక్తినిచ్చే నమ్మకమైన V8 ఇంజన్‌ ను వదలివేసి, దానికి బదులుగా సరికొత్త 3.5-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్‌ ను ఉపయోగించింది. ఇందులో ఓ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

ఇక ఈ పికప్ ట్రక్కులో లభించే ఇంటీరియర్ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. ఈ ట్రక్కులో పానోరమిక్ రూఫ్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్ మరియు 14.0 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి. ఇంకా ఇందులో 360 డిగ్రీల కెమెరా ఫీచర్ కూడా ఉంటుంది. ఇది రహదారిపై వాహనాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

అంతేకాకుండా, ఇందులో పికప్ బెడ్ లేదా అటాచ్డ్ ట్రైలర్‌ లో సరుకును తనిఖీ చేయడం కోసం కెమెరాలు కూడా ఉంటాయి. ఇంకా ఇందులో పవర్ ఎక్స్‌టెండింగ్ మరియు ఫోల్డింగ్ టో మిర్రర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పికప్ ట్రక్కులోని టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోని కొన్ని ట్రిమ్‌ ల కోసం వాయిస్ కమాండ్‌ లు మరియు మరింత పెద్దగా ఉండే 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

ఇక చివరిగా దాని ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ రెండు రకాల 3.5 లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. వీటిలో ఒకటి హైబ్రిడ్ వెర్షన్. Tundra ను నిర్మించిన కొత్త ప్లాట్‌ఫామ్ కారణంగా, దాని బరువు కూడా తక్కువగా ఉంటుంది ఫలితంగా ఇది వేగంగా వెళ్లడానికి మరియు ఎక్కువ పేలోడ్ ని లాగడానికి సహాయపడుతుంది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

మునుపటి 5.7 లీటర్ V8 ఇంజిన్‌తో పోలిస్తే, కొత్త ఐసి V6 ఇంజన్ గరిష్టంగా 389 బిహెచ్‌పి పవర్ ను మరియు 650 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే, ఇందులో 288-వోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 1.5-కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 437 హార్స్‌పవర్ శక్తిని మరియు 790 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2022 టండ్రా యొక్క హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వెర్షన్ ను గంటకు 30 కి.మీ కంటే తక్కువ వేగంతో నడిపితే దీనిని పూర్తిగా ఎలక్ట్రిక్-ఓన్లీ (ఎలక్ట్రిక్ వాహనంగా) మార్చవచ్చు. ఇకపోతే, ఈ రెండు ఇంజన్లు కొత్త 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయడి ఉంటాయి. దీని టోయింగ్ సామర్థ్యం గరిష్టంగా దాదాపు 5,500 కేజీల వరకూ ఉంటుందని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 Toyota Tundra పికప్ ట్రక్ ఆవిష్కరణ; Ford F150 కి గట్టి పోటీ!

కొత్త 2022 Toyota Tundra ఈ విభాగంలో ఫోర్డ్ ఎఫ్150 లేదా ర్యామ్ 1500 వంటి ప్రీమియం పికప్ ట్రక్కులతో పోటీ పడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి రానుంది. అదే సమయంలో దాని ధర మరియు ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
All new 2022 toyota tundra pickup truck unveiled details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X