మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, తమ సరికొత్త 2021 వ్రాంగ్లర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని వచ్చే నెల భారత మార్కెట్లో విడుదల చేయనుంది. జీప్ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఈ మోడల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇండియాలో విక్రయించింది.

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

కాగా, ఇప్పుడు జీప్ ఇండియా తమ కొత్త వ్రాంగ్లర్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లోనే స్థానికంగా అసెంబుల్ చేస్తోంది. సికెడి రూట్‌లో విడిభాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొని, జీప్ తమ ఇండియా ప్లాంట్‌లో ఈమోడల్‌ను నిర్మిస్తోంది. ఈ మేడ్-ఇన్-ఇండియా జీప్ వ్రాంగ్లర్‌ను మార్చి 15న మార్కెట్లోకి రానుంది.

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ స్థానిక తయారీ కోసం కంపెనీ 180 కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించింది. రంజాన్‌గావ్‌లో ఉన్న జీప్ ఇండియా ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. గతేడాది జీప్ తమ 2020 వ్రాంగ్లర్‌ను రూ.63.94 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతే విడుదల చేసింది.

MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

అప్పట్లో ఈ ఎస్‌యూవీని పూర్తిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కారణంగా, అధిక దిగుమతి సుంఖాల కారణంగా మార్కెట్లో దీని ధర అత్యధికంగా ఉండేది. అయితే, ఇప్పుడు కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా భారతదేశంలోనే అసెంబుల్ చేస్తున్న నేపథ్యంలో, దీని ధర కూడా భారీగా తగ్గే ఆస్కారం ఉంది.

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఐకానిక్ జీప్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో బిల్ట్-ఇన్ జిపిఎస్ నావిగేషన్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అప్‌డేటెడ్ డాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ:పెట్రో ధరలకు రెక్కలొచ్చాయ్.. ఇక సామాన్యుడి వాహనం కదిలేనా ?

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

అంతేకాకుండా, ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ మరియు స్టాప్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ మరియు దానిపై వైట్ కలర్ స్టిచింగ్, రిమూవబల్ డోర్స్, సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్, డ్రాప్ డౌన్ విండ్‌షీల్డ్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మరిన్నో ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 జీప్ వ్రాంగ్లర్ 2.0-లీటర్ హై పవర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 268 పిఎస్ శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

MOST READ:వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు

మార్చ్ 15న విడుదల కానున్న సరికొ 2021 జీప్ వ్రాంగ్లర్ - పూర్తి వివరాలు

ఈ ఎస్‌యూవీ అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ డిఫరెన్షియల్ లాక్ ఉంటుంది. సెంట్రల్ కన్సోల్‌లో ఇచ్చిన స్విచ్‌ను ఉపయోగించి దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో కొత్త 4WD ఆటో మోడ్‌తో పాటుగా, హై మరియు లో మోడ్‌తో కూడిన డెడికేటెడ్ ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) సిస్టమ్ కూడా ఉంటుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep India To Launch 2021 Wrangler On 15th March, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X